పెళ్లి వాహనం బోల్తా.. నలుగురికి తీవ్రగాయాలు | toofan vehicle rolled over and marriage team people injured | Sakshi
Sakshi News home page

పెళ్లి వాహనం బోల్తా.. నలుగురికి తీవ్రగాయాలు

Published Fri, May 12 2017 8:15 AM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

toofan vehicle rolled over and marriage team people injured

అద్దంకి(ప్రకాశం): పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పెళ్లి బృందం తుఫాన్‌ వాహనంలో తాళ్లూరు వెళ్తుండగా అద్దంకి-నార్కెట్‌పల్లి రాహదారిలోని చిన్నకొత్తపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు జరగుతుండటంతో పోలీసులు ఖాళీ టైర్ల సాయంతో వేగ నిరరోధకాలు ఏర్పాటు చేశారు.

నిజామాబాద్‌ నుంచి వస్తున్న తుఫాన్‌ వాహన డ్రైవర్‌ అది గుర్తించకుండా.. టైర్లను ఢీకొట్టాడు. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది. ఈ ప్రమాదంలో పెళ్లికూతురు తల్లిదండ్రులతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని 108 సాయంతో అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

ఇదిలా ఉందగా.. జిల్లాలోని సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద పైపుల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement