
అన్నమయ్య: తనకు తెలియకుండా మరో అమ్మాయితో వివాహం చేసుకుంటున్నాడని ఓ ప్రియురాలు పెళ్లిలో హల్‌చల్ చేసింది. ఆగ్రహంతో పెళ్లి కొడుకుపై దాడికి దిగింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో చోటుచేసుకుంది. దీంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది.
నందలూరుకు చెందిన యువతితో రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషాతో ఈ రోజు వివాహం జరగుతున్న సమయంలో ప్రియురాలు రంగంలోకి దిగింది. సయ్యద్ భాషా.. తిరుపతికి చెందిన వివాహిత జయతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సయ్యద్ భాషా తనను కాదని వేరే అమ్మాయినీ వివాహం చేసుకోవడానికి సిద్దపడడంతో జయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
షాదిఖానాలో పెండ్లి కొడుకు సయ్యద్ బాషాపై కత్తి, యాసిడ్‌తో దాడి యత్నించింది. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటలో యాసిడ్ పడి ఒక్క మహిళలకు తీవ్రంగా, మరో మహిళలు స్వల్పంగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు జయను అదుపులోకి తీసుకొని నందలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం ఆగిపోవడంతో పెళ్లి కుమార్తె బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment