Live : బాబు కేసు & పాలిట్రిక్స్‌ అప్‌డేట్స్‌.. Click & Refresh | AP High Court Hearing Over Angallu TDP Attacks Case Updates | Sakshi
Sakshi News home page

Live : బాబు కేసు & పాలిట్రిక్స్‌ అప్‌డేట్స్‌.. Click & Refresh

Published Thu, Sep 14 2023 7:31 AM | Last Updated on Thu, Sep 14 2023 7:12 PM

AP High Court Hearing Over Angallu TDP Attacks Case Updates - Sakshi

Updates.. 

06:10 PM
రాజమండ్రి : లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రాపై ఫిర్యాదు
►బాబు లాయర్‌ సిద్ధార్థ లూద్రాపై  రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
►రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన న్యాయవాదే రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారని ఫిర్యాదు
►మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌతు సూర్యప్రకాశరావు ఫిర్యాదు

06:10 PM
రాజమండ్రి : బాలయ్య బిజీ బిజీ
►కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్యనేతలతో బాలకృష్ణ సమావేశం
►చంద్రబాబు, పవన్ మధ్య జరిగిన చర్చల ప్రస్తావన
►రెండు రోజుల్లో విజయవాడలో టీడీపీ, జనసేన నేతల మీటింగ్
► క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలపై చర్చ
► కొందరికి టికెట్‌లు ఇవ్వకపోతే వచ్చే అసంతృప్తిపై చర్చ
► రెండు పార్టీల క్యాడర్ సహకరించుకుంటారా? విభేదించుకుంటారా?
►ఈ నెల 19న చంద్రబాబు కేసు విచారణ తర్వాత అప్పటి పరిస్థితులను అనుగుణంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు

06:10 PM
రాజమండ్రి
►రేపట్నుంచి సెలవులో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్
►తన భార్య అనారోగ్యం దృష్ట్యా సెలవు తీసుకున్న సూపరింటెండెంట్
►కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ కు జైలు ఇన్ ఛార్జ్ బాధ్యతలు

05:30 PM
విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్
►పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు
►బెయిల్ పిటిషన్‌ పరిశీలించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి
►కస్టడీ పిటిషన్ పై హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిందన్న న్యాయమూర్తి
►కస్టడీ పిటిషన్ కు, బెయిల్ కు సంబంధం లేదన్న న్యాయవాది సుబ్బారావు
►పిటిషన్‌కు లిస్టింగ్‌ ఇచ్చి కౌంటర్‌ దాఖలు చేయాలని CIDకి సూచించిన కోర్టు

04:46 PM
పేర్ని నాని, వైఎస్సార్‌సిపి ప్రెస్‌మీట్‌
►చంద్రబాబును ఓదార్చడానికి పవన్ వెళ్లాడనుకున్నాం
►పవన్ చంద్రబాబును ఓదార్చడానికి వెళ్లాడా?
►చంద్రబాబుతో బేరం మాట్లాడ్డానికి వెళ్లాడా?
►చంద్రబాబుతో ములాఖత్ కాదు మిలాఖత్ అని తేలింది
►బీజేపీతో పవన్ ది తాత్కాలిక పొత్తు మాత్రమే
►తెలుగుదేశంతోనే పవన్ కు శాశ్వత పొత్తు  
►పవన్ కు క్లారిటీ ఉంది... బీజేపీకే లేదు
►బీజేపీ ఎప్పటికప్పుడు పిల్లిమొగ్గలు వేస్తోంది
►పవన్ పొత్తు పాత వార్తే... ఇందులో కొత్తదనం లేదు
►తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ అంతర్భాగం
►కలవడం, విడిపోవడం కేవలం ముసుగు మాత్రమే
►చంద్రబాబుతో పవన్ వ్యాపారం మాట్లాడుకుని వచ్చాడా?
►తన కార్యకర్తలకైనా పవన్ ఈ విషయం చెప్పాలి
►పవన్ పరామర్శకు జైలుకు వెళ్లి డీల్ చేసుకుని వచ్చారు
►ప్రజాధనం దోచుకున్న దొంగను పవన్ పరామర్శిస్తాడా?
►ఇదేనా పవన్ చెప్పిన జనసేన సిద్ధాంతం?
►అవినీతిపై పవన్ రాజీ లేని పోరాటం చేస్తానన్నాడు
►మరి అవినీతిపరుడైన చంద్రబాబుకు ఎలా మద్దతు ప్రకటిస్తాడు
►తాను దోచుకున్న డబ్బులో లోకేష్ వాటా ఇస్తానని చెప్పాడా?
►లోకేష్ తో సీట్లేనా లేక లెక్కలు కూడా పంచుకున్నారా?
►తనను నమ్ముకున్న వారిని మోసం చేసి పవన్ లాభపడుతున్నాడు
►సినిమాల్లోనే పవన్ హీరో... బయట మాత్రం జోకర్
►25 స్థానాలకు పవన్ అభ్యర్ధులను సప్లై చేస్తాడు


04:00 PM
ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి
► స్కిల్ స్కామ్ లో రూ.371 కోట్ల అవినీతి జరిగింది
► ఈ స్కామ్ లో మొత్తం 10 కీలక అంశాలు ఉన్నాయి
► నిబంధనలకు విరుద్ధంగా నిధులను రిలీజ్ చేశారు
► అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు
► తప్పుడు డాక్యుమెంట్స్ తో ఒప్పందాలు చేసుకున్నారు
► ప్రభుత్వ జీవోకు, అగ్రిమెంట్ కు చాలా తేడాలు ఉన్నాయి
► అగ్రిమెంట్ లో జీవో నెంబర్ ను చూపించలేదు
► జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్ లో లేవు
► సీమెన్స్ కంపెనీ ట్రైనింగ్ మాడ్యూల్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు
► ఎక్కడా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెడతామని చెప్పలేదు
► కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్  ఏర్పాటు
► కార్పొరేషన్ ఏర్పాటులో విధివిధానాలు పాటించలేదు
► స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో ఖజానాను దోచేశారు
► రూ.3,300 కోట్లు ఫ్రీగా సీమెన్స్ ఇస్తుందని చెప్పారు
► ప్రభుత్వం కేవలం 10 శాతం ఇస్తే సరిపోతుందన్నారు
► ఏపీ ఖజానా నుండి రూ.371 కోట్లు డిజైన్ టెక్ కు చెల్లించారు
► పైలట్ ప్రాజక్టు అమలు చేయాలన్న అధికారుల వాదనను పట్టించుకోలేదు

03:13 PM
లోకేష్‌, బాలకృష్ణ ప్రెస్‌మీట్‌
లోకేష్‌
► జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం
► ఉమ్మడి కార్యాచరణ రేపటి నుంచే అమల్లోకి వస్తుంది
► సీట్ల పంపిణీతో పాటు అన్ని అంశాలు చర్చించుకుంటాం
► కొందరు అధికారులపై సివిల్‌ వార్‌ ప్రకటిస్తున్నాను
► చంద్రబాబు కట్టిన జైలులో ఆయన్నే పెడతారా?
► పవన్‌ కళ్యాణ్‌ లాంటి వ్యక్తిని రోడ్డుపైనే కూర్చోబెడితే ఎలా?
► జనసేనతో కలిసి సివిల్‌ వార్‌ ప్రకటిస్తున్నాం

బాలకృష్ణ
►అన్న ఎన్టీఆర్‌ తెలుగువారికి ఆత్మగౌరవం తెచ్చారు
►చంద్రబాబు చాలా ఇన్నోవేటివ్‌, ఎక్కడా సంతకం పెట్టలేదు
►ఏ చట్ట ప్రకారం అరెస్ట్‌ చేశారో చెప్పాలి
►యువగళంలో లోకేష్‌కు వస్తున్న ఆదరణ చూసి బాబును అరెస్ట్‌ చేశారు
 

03:13 PM
బాబు బెయిల్ పిటిషన్‌పై నోటీసులు జారీ
►చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు నోటీసులు
►స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు .
►అయితే.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్‌ ఉండగా బెయిల్ పిటిషన్ ఎలా వేశారని ప్రశ్నించిన ఏసీబీ కోర్టు
►సీఐడీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరిగే అవకాశం

03:05 PM
పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుంది: బీజేపీ
►పవన్ పొత్తు వ్యాఖ్యల పై స్పందించిన ఏపీ బీజేపీ
►పొత్తుల అంశం బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుంది
►ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది
►ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే బీజేపీ పొత్తు ఉంది : ఏపీ బీజేపీ
►తెలుగుదేశంతో ఎలాంటి పొత్తు లేదు : ఏపీ బీజేపీ

03:00 PM
లోకేష్‌, బాలకృష్ణ పోటాపోటీ భేటీలు
► అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో పవన్, లోకేశ్, బాలకృష్ణ సమాలోచనలు
► రేపటి నుంచి ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశంపై బాలకృష్ణ చర్చ

02:36 PM
చంద్రబాబు కుటుంబంతో పవన్‌ భేటీ 
► పరామర్శ పేరిట..  చంద్రబాబు కుటుంబ సభ్యులతో పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు.
►చంద్రబాబు భార్య భువనేశ్వరి, బాబు తనయుడు నారా లోకేష్‌, లోకేష్‌ సతీమణి బ్రహ్మణి, చంద్రబాబు బామ్మర్ది నందమూరి బాలకృష్ణ ఉన్నారు.
► అంతకు ముందు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో.. ములాఖత్‌ పేరిట పవన్‌ రాజకీయం నడిపారు. 

01:30 PM
ప్యాకేజ్ బంధం బయటపడింది
►పవన్‌కు YSRCP స్ట్రాంగ్‌ కౌంటర్‌
►నువ్వు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్‌కి వెళ్ళింది దీని కోసమేనా?
►పొత్తును ఖాయం చేసుకునేందుకేనని ప్ర‌జ‌ల‌కు పూర్తిగా అర్థం అయింది
►ఇన్నాళ్ళూ నీమీద న‌మ్మ‌కం పెట్టుకున్న‌ అభిమానుల‌కు, కాస్తో కూస్తో నిన్ను న‌మ్మిన వాళ్ళ‌కు ఈరోజుతో భ్ర‌మ‌లు తొల‌గించేశావు
►ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం
►ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం
►జైల్లోనూ పాలిట్రిక్స్‌ వదిలి పెట్టరా అంటూ పవన్‌, చంద్రబాబులకు చురకలు

12:50 PM
సెంట్రల్‌ జైల్‌ పాలిట్రిక్స్‌ : ములాఖత్‌ తర్వాత పవన్‌ కళ్యాణ్‌
►వచ్చే ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తున్నాం
►ఈ విషయం జనసేన కార్యవర్గం అర్థం చేసుకోవాలి
►తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయని నేను ఇవ్వాళ నిర్ణయం తీసుకున్నాను
► విడివిడిగా పోటీ చేస్తే వైఎస్సార్‌సిపిని ఆపలేం
► BJP మాతో కలుస్తుందో లేదో వాళ్లే తేల్చుకోవాలి
► ఇక నుంచి టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక
► తెలుగుదేశం నేతలతో కలుస్తున్నానంటే అది పాలకపక్షం వల్లే
► ఒక వైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్‌ల మధ్య ఉన్నానంటే అది పాలకపక్షం వల్లే
► ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును చట్టవ్యతిరేకంగా జైల్లో పెట్టారు
► చంద్రబాబుకు నా మద్ధతు ప్రకటిస్తున్నా
► గతంలో విధానాల పరంగా భిన్నమైన ఆలోచనలున్నాయి
► అందుకే 2019లో వేర్వేరుగా పోటీ చేశాం
► 2014లో విభజన జరిగినపుడు రాష్ట్రానికి నష్టం కలిగింది
► 2014లో నేను నరేంద్ర మోదీకి మద్ధతు తెలిపాను
► భారత్‌ మీద తరచుగా ఉగ్రదాడులు జరిగినపుడు బలమైన నాయకత్వం కావాలనుకున్నాను
► నాడు నరేంద్ర మోదీ నన్ను పిలిస్తే నేను వెళ్లాను తప్ప.. నా అంతట నేను కాదు
► చంద్రబాబుతో నాడు ప్రత్యేక హోదా కోసం విభేదించాను తప్ప.. ఆయనంటే నాకు నమ్మకం
► చంద్రబాబు అంటే వ్యక్తిగతంగా నాకు విశ్వాసం ఉంది
► బ్యాంకులో తప్పు జరిగితే .. బ్యాంకు ఓనర్‌ను అరెస్ట్‌ చేసినట్టుగా ఉంది
► చంద్రబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విచారించాలి కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారిస్తుంది?

12:40 PM
మూడు అంశాలపై ముగ్గురితో మంతనాలు
► పూర్తిగా రాజకీయ ఎజెండాతో చంద్రబాబు ములాఖత్‌
మొదటి అంశం : లోకేష్‌ పాదయాత్ర కంటిన్యూ చేయాలా? ఆపేయాలా?
రెండో అంశం : పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర ఏం చేయాలి?
మూడో అంశం : పొత్తుల విషయం ఏం చేయాలి? జనసేనకు ఎన్ని సీట్లు?
► పార్టీలో బాలకృష్ణ పాత్ర ఏంటీ? ఇక ముందు టిడిపికి ఎవరు నేతృత్వం వహించాలి?

12:30 PM
ఎట్టకేలకు ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌
► విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన చంద్రబాబు లాయర్లు
► స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్
► హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు కదా అని ప్రశ్నించిన ఏసీబీ కోర్టు జడ్జి
► బెయిల్‌ పిటిషన్‌ పరిశీలించి లిస్టింగ్‌ ఇస్తామన్న ఏసీబీ కోర్టు జడ్జి

12:16 PM
చంద్రబాబుతో ముగ్గురు నేతల ములాఖత్‌
► రాజమండ్రి జైలు కేంద్రంగా చంద్రబాబుతో రాజకీయ మంతనాలు
► బాలకృష్ణ, పవన్‌, లోకేశ్‌లతో చంద్రబాబు చర్చలు
► దాదాపు 40 నిమిషాల పాటు ములాఖత్‌ ఉండే అవకాశం

12:10 PM
ఎన్నికలొస్తున్నాయ్‌.. కిం కర్తవ్యం.?
► జైల్లో బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌లతో చంద్రబాబు మంత్రాంగం
► ఎవరెవరు ఏ ఏ విభాగాలు చూసుకోవాలన్న దానిపై స్పష్టత ఇచ్చే అవకాశం
► విజయవాడ కేంద్రంగా బాలకృష్ణ, రాజమండ్రి కేంద్రంగా లోకేష్‌, గ్రౌండ్‌లో పవన్‌.?
► ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జైలు నుంచే చంద్రబాబు వ్యూహరచన
► పొత్తులపైనా చర్చలు, ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలో సమాలోచనలు

11:59 AM
బెయిల్‌పై వెనక్కి..ముందుకు..
► విజయవాడ ACB కోర్టులో బెయిల్ పిటీషన్ వేసే ఆలోచనలో చంద్రబాబు లాయర్లు
► ఇప్పటివరకు స్క్వాష్‌పై నమ్మకం పెట్టుకున్న బాబు లాయర్లు
► ఆలస్యం అవుతుండడంతో ముందు బెయిల్‌ కోసం లాయర్ల యోచన
► స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలని పిటిషన్ తయారీ
► ఎప్పుడు వేయాలన్నదానిపై లాయర్ల మల్లగుల్లాలు

11:45 AM
రాజమండ్రిలో పవన్‌ కళ్యాణ్‌ బిజీ బిజీ
► రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్దకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌
► ఆరు వాహనాల కాన్వాయ్‌తో వచ్చిన పవన్ కళ్యాణ్
► ఆరు వద్దు, ఒక కారు సరిపోతుందని సూచించిన అధికారులు
► పవన్‌ వెంట జైల్లోకి వెళ్లేందుకు జనసేన నాయకుడు కందుల దుర్గేష్‌ ప్రయత్నం
► ఇష్టానుసారంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంపై అధికారుల అసహనం
► జనసేన నేత కందుల దుర్గేష్‌ను వెనక్కి పంపిన అధికారులు

11:30 AM

జైలు ముందు కూడా డ్రామాలా?
► రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న బాలకృష్ణ లోకేష్
► వారితోపాటు జైలు వద్దకు వచ్చిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చౌదరి
►ముందస్తు అనుమతి లేకుండా జైల్లోకి వెళ్లేందుకు బుచ్చయ్య చౌదరి యత్నం
► బుచ్చయ్యని వారించి, వెనక్కు పంపిన జైలు అధికారులు
►అధికారులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బుచ్చయ్య
►ములాఖత్‌కు దరఖాస్తు చేసుకోకుండా రావడం సరికాదన్న అధికారులు
►అనుమతి తీసుకున్న వారిని మాత్రమే లోపలికి పంపిన జైలు అధికారులు

11:20 AM
జైలు నుంచే రాజకీయం
► ఇవ్వాళ చంద్రబాబును కలవనున్న బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌
► పార్టీకి సంబంధించి బాధ్యతల పంపిణీపై బాబు మాట్లాడతాడని ప్రచారం
► విజయవాడ కేంద్రంగా బాలకృష్ణ, రాజమండ్రి కేంద్రంగా లోకేష్‌, గ్రౌండ్‌లో పవన్‌.?
► ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జైలు నుంచే చంద్రబాబు వ్యూహరచన

11:15 AM
లూథ్రా ట్వీట్ల పరమార్థమేంటీ?
► పూర్తిగా నిర్వేదంలోకి వెళ్ళినట్టు కనిపిస్తోన్న సిద్ధార్థ లూథ్రా
► నిన్న గురు గోవింద్ సింగ్ .. ఈ రోజు స్వామి వివేకానంద !!!
► ఇంతటి క్లిష్టమైన కేసును చూడలేదన్నట్టుగా ట్వీట్లు
► చంద్రబాబుకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలుండడంతో చేష్టలుడిగిపోయిన లూథ్రా
► కేసులో అన్ని దారులు మూసుకుని పోవడంతో ఫ్రస్ట్రేషన్‌ నుంచి ఫిలాసఫీలోకి వచ్చాడంటున్న టిడిపి నేతలు

11:00 AM
పోటాపోటీ క్యాంపులు
► రాజమండ్రి రూరల్ కాతేరు వద్ద లోకేష్‌ క్యాంప్ ఏర్పాటు
► టిడిపి శ్రేణులతో చర్చలు జరుపుతున్న లోకేష్, భువనేశ్వరి
►పార్టీ కార్యాలయం కేంద్రంగా బాలకృష్ణ, అంతే స్థాయిలో కాతరు క్యాంపులో లోకేష్‌
►పార్టీపై పట్టుకు ఇద్దరు నేతల ప్రయత్నాలు
►తల్లి భువనేశ్వరీని తనతో పాటు చర్చల్లో కూర్చోపెడుతున్న లోకేష్‌

10:50 AM
బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా
► అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా. 
► ఈ కేసులో విచారణను ఈనెల 20వ తేదీ వరకు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు.

10:00 AM
చీమ చిటుక్కుమన్నా.. పట్టేస్తారు
►రాజమండ్రి సెంట్రల్‌ జైలులో భారీగా భద్రత పెంపు. 
►జైలు బయట అదనంగా సీసీ కెమెరాల ఏర్పాటు. 
►చంద్రబాబు భద్రతను స్వయంగా పరిశీలిస్తున్న జైలు శాఖ డీఐజీ రవికిరణ్‌. 
 

9:00 AM
ఇంటిని మరిపించేలా రోజువారీ కార్యకలపాలు
►రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు నాలుగు రోజు
►ఉదయం అల్పాహారం తీసుకున్న చంద్రబాబు
►అంతకు ముందు కాసేపు వ్యాయామం, పేపర్లు చదివిన చంద్రబాబు
►చంద్రబాబును కలిసేందుకు ములాఖత్‌కు రానున్న పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ, లోకేష్

7:45 AM
► నేడు రాజమండ్రికి పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌, నందమూరి బాలకృష్ణ. 
► జైలులో ఉన్న చంద్రబాబుతో వీరు ములాఖత్‌. 
► మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్న లోకేష్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ
► రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రత
► ఉదయం 10 గంటలకు రాజమండ్రికి చేరుకోనున్న పవన్, బాలకృష్ణ

7:30 AM 
► నాలుగోరోజు రాజమండ్రి జైలులో చంద్రబాబు
► తెల్లవారుజామున నిద్రలేచిన చంద్రబాబు.
► జైలులో చంద్రబాబు యోగా, పేపర్ రీడింగ్


► నేడు అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. 
► ఈ కేసుపై విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు.
► అంగళ్లులో టీడీపీ నేతల దాడి కేసులో A1గా ఉన్న చంద్రబాబు.

అన్నమయ్య జిల్లా, అంగళ్లు వద్ద జరిగిన విధ్వంసానికి సంబంధించి ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చంద్ర­బాబు­ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేయలేకపో­తు­న్నానని తెలిపారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరి­స్తా­నని, ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదని, తనకు మాత్రం బెయిల్‌ మంజూరు చేయా­లని చంద్రబాబు న్యాయస్థానాన్ని కోరారు.

► ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించి బెయిల్స్‌ తెచ్చుకున్నప్పటికీ ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం హైకోర్టుకు రాలేదు. తనకేం కాదులే అనే ధీమాతో ఉన్న ఆయన.. ఇప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరె­స్టయి, జైల్లో ఉండటంతో ఒక్కసారిగా మేల్కొ­న్నారు. ఎందుకైనా మంచిదని బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు.

ఆగస్టు 4న యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడిన ఘటనలపై చంద్రబాబు సహా 20 మందిపై కురబలకోట మండలం ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇతర నిందితుల్లో టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, తిరుపతి ప్రాంతాలకు చెందిన నేతలు నిందితులుగా ఉన్నారు. దాదంవారిపల్లెకు చెందిన అంగళ్లు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డీఆర్‌.ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506, రెడ్‌విత్‌ 149 సెక్షన్ల కింద ఎస్‌ఐ షేక్‌ ముబిన్‌తాజ్‌ కేసు నమోదు చేశారు. 

యాత్ర సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు, రైతులను చూసి  చంద్రబాబు ఊగిపోయారు. ‘తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. వాహనంపై ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, మదనపల్లె మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్‌బాషా, దొమ్మలపాటి రమేష్, ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి తదితర నేతలు కూడా వైఎస్సార్‌సీపీ నేతలవైపు చేతులు చూపుతూ, కేకలు వేస్తూ హెచ్చరికలు చేస్తూనే.. సైగలతో దాడులకు ప్రేరేపించారు.

► మరికొందరు స్థానిక నేతలు ఈలలు వేస్తూ, తొడ గొడుతూ.. బూతులు తిడితూ కొట్టండి అంటూ దాడికి ప్రోత్సహించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఓ పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలు ఈ దాడులు చేయించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అప్పటికే సిద్ధం చేసుకున్న  మారణాయుధాలు, రాళ్లు, కొడవళ్లు, ఇటుకలు, కట్టెలు, చెప్పులు, రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు.

► ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, దాడిని అడ్డుకోబోయిన పోలీసులు కూడా గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీకి చెందిన బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, వసంతరెడ్డి, అర్జున్‌రెడ్డి, మహేష్, ఓ విలేకరి శ్రీనివాసులు, ముదివేడు పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ కేశవులు తీవ్రంగా గాయపడ్డారు. దాడితో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. రోడ్డుపై పగిలిన బాటిళ్లు, ఇటుకలు, కర్రలు పడి ఉన్నాయి. కొందరు స్థానికులు వైఎస్సార్‌సీపీ నేతలను రక్షించారు. లేనిపక్షంలో కొందరు హత్యకు గురయ్యేవారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement