
అన్నమయ్య : మదనపల్లె నుంచి పీలేరుకు 50 కిలోమీటర్లుపైగా క్షేమంగా పయనించి... రెండు నిమిషాలు ఆగితే ఇంటికి చేరుతారనగా.. ఇంతలోనే కర్ణాటక ఆర్టీసీ బస్సు రూపంలో ఆ ఇద్దరినీ మృత్యువు కబళించింది. పీలేరు పట్టణం కొండారెడ్డిసర్కిల్ వద్ద టాటాఏఎస్ – కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇర్షాద్, విజయకుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
► పీలేరు పట్టణంలోని సరోజినీదేవి వీధికి చెందిన ఇర్షాద్ (27)కు భార్య రోషిణి తోపాటు కుమారుడు అమాన్, కుమార్తె ఫిదా ఉన్నారు. టాటాఏస్ వాహనం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఇర్షాద్ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు, మున్నీరుగా విలపించారు. రోషిణిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.
► పీలేరు పట్టణం ఇందిరమ్మకాలనీకి చెందిన విజయకుమార్ (50) టాటాఏస్‌కు కూలీగా వెళుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య చిట్టెమ్మ, కుమారుడు శివనాగరాజు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న విజయకుమార్ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment