సాక్షి, అన్నమయ్య జిల్లా: తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగింది. మధ్యాహ్నం కేజీఎన్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం బైక్ ర్యాలీ ప్రారంభమైంది. మాదవయ్యగారి పల్లె, పులికల్లు మీదుగా బైక్ ర్యాలీ కొనసాగింది. సాయంత్రం ములకలచెరువులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని అభివృద్ది సీఎం జగన్ పాలనలోనే జరిగిందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
‘‘జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది. వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు. నాలుగున్నరేళ్లుగా జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. వెనుకబడిన వర్గాల సాధికారతే సీఎం జగన్ లక్ష్యం. ఏపీలో సామాజిక విప్లవానికి నాంది పలికిన నేత వైఎస్ జగన్. ఆయన పాలనలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు న్యాయం చేసిన ఘనత జగన్‌దే’’ అని మంత్రి కొనియాడారు.
‘‘దళితులను అడుగడుగునా అవమానించిన వ్యక్తి చంద్రబాబు. అర్హత ఉంటే చాలు అన్ని సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు జగన్. లక్షా 76 వేల కోట్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఖాతాల్లో జమ చేశాం. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశాడు. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు, పవన్ మళ్లీ కలిసొస్తున్నారు. చంద్రబాబు, పవన్‌లకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు.
చదవండి: పురందేశ్వరి చంద్రముఖిలా మారిపోయారు: మంత్రి సీదిరి
Comments
Please login to add a commentAdd a comment