
ప్రతీకాత్మక చిత్రం
మదనపల్లె టౌన్(అన్నమయ్య జిల్లా): భర్త వివాహేతర సంబంధాన్ని అడ్డుకున్న భార్యపై భర్త, అతని స్నేహితురాలు, అత్తమామలు దాడి చేసిన ఘటన ఆదివారం మదనపల్లెలో చోటు చేసుకుంది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మదనపల్లె మండలం కొత్త ఇండ్లు (రంగారెడ్డి) కాలనీలో కాపురం ఉంటున్న ఎం.శంకప్పనాయుడు, సుశీలమ్మ కుమారుడు ఎం.బాలప్రసాద్‌కు కర్ణాటక రాష్ట్రం కోలారు బేత మంగళంలోని శ్యామరహల్లికి చెందిన ఎం.సుధతో 2014లో పెళ్లి జరిగింది.
చదవండి: ‘అక్కా.. అమ్మ నాన్నను బాగా చూసుకో, సారీ మీ మాట విననందుకు’
వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరి సంసారం కొంత కాలం సజావుగా సాగింది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పట్నుంచి భార్యను అదనపు కట్నం కోసం తరచూ వేధించి చిత్రహింసలు పెట్టి పుట్టింటికి తరిమేశాడు. భార్య పుట్టింటిలో ఉండగా మండలంలోని బండకిందపల్లెకు చెందిన ఓ మహిళను ఇంట్లో ఉంచుకుని సహజీవనం సాగిస్తున్నాడు. సుధ రూరల్ పోలీసులను ఇంటికి తీసుకెళ్లి భర్తతోపాటు అతనితో సహజీవనం చేస్తున్న స్నేహను పట్టించింది. దీంతో రెచ్చిపోయిన భర్త, స్నేహ, అత్తమామలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశామని రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment