
వనపర్తి : జిల్లాలోని పెద్దగూడెంలో దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఆరేళ్ల చిన్నారి నాగేశ్వరి దారుణ హత్యకు గురైంది. స్థానికంగా నివాసం ఉంటున్న రామకృష్ణ అలియాస్ బాబా ఇంట్లో చిన్నారి మృతదేహం లభించింది. కాగా ఈ నెల 10న పెద్దగూడెంలో చిన్నారి అదృశ‍్యమైంది. నాగేశ్వరి హత్యకేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే క్షుద్ర పూజలా? లేక చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment