girl murdered
-
నవరంగపూర్ జిల్లాలో మరో ‘దిశ’
జయపురం: అవిభక్త కొరాపుట్ జిల్లాలో మరో ‘దిశ’ సంఘటన శనివారం వెలుగుచూసింది. రాష్ట్ర డీజీపీగా ఇటీవల నియమితులైన అభయకుమార్ జిల్లాలో మొదటిసారిగా పర్యటనకు విచ్చేసిన రోజునే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో పర్యటించిన డీజీపీ ఆయా జిల్లాల శాంతిభద్రతల చర్యలపై అక్కడి అధికారులతో చర్చలు జరపగా, ఆయన పర్యటనలో ఉంటుండగానే నవరంగపూర్ జిల్లాలోని కొశాగుమడ సమితిలో గుమండల గ్రామంలో బాలికపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు లైంగికదాడికి పాల్పడి, ఆ బాలికను చంపేశారు. గుముండల గ్రామంలో శుక్రవారం రాత్రి దియాలి పర్వ్ జరుగుతుండగా, ఆ పర్వ్ కార్యక్రమాలు చూసుకుని బాధిత బాలిక, ఇంటికి చేరింది. సరిగ్గా రాత్రి 8 గంటల సమయంలో బహిర్భూమి కోసమని ఇంటి నుంచి ఆ బాలిక బయటకు వచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలిక ఎంతసేపటికీ రాకపోయేసరికి బాధిత బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ బాలిక ఆచూకీ కోసం గ్రామం సహా గ్రామ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆ బాలిక ఆచూకీ కానరాలేదు. అయితే శనివారం ఉదయం గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు గ్రామానికి ఓ అరకిలోవీుటరు దూరంలోని ఓ పొలంలో బాలిక మృతదేహం ఉండడాన్ని గమనించారు. ఇదే విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయగా, సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు ఘటన స్థలంలో పడిఉన్న బాలిక మృతదేహం, దానికి కొంతదూరంలో రెండు జీన్ ప్యాంట్లు, చెప్పులు పడిఉండడం, అలాగే బాలిక శరీరంపై కూడా అక్కడక్కడ గాయాలు ఉండడం చూశారు. ఈ నేపథ్యంలో బాలికపై ఎవరో బలవంతంగా సామూహిక అత్యాచారం చేసి ఉంటారని భావించారు. అనంతరం ఇదే విషయంపై బాధిత బాలిక కుటుంబ సభ్యులు కొశాగుమడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన కొశాగుమడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం దర్యాప్తు చర్యలు ప్రారంభించారు. ఇదే విషయంపై స్పందించిన నవరంగపూర్ జిల్లా మాఘొరొ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు కాదంబనీ త్రిపాఠి కేసును త్వరగా విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
పిలిస్తే పలకలేదన్న కోపంతో..
వాషింగ్టన్: అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్‌కు చెందిన యువతి రూత్ జార్జ్ (19) తనతో మాట్లాడేందుకు నిరాకరించడం లేదా తాను పిలిస్తే స్పందించలేదనే కోపంతో నిందితుడు డొనాల్డ్ తుర్మాన్ చంపేసి ఉండొచ్చని ప్రాసిక్యూటర్ తెలిపారు. మాట్లాడలేదనే కోపంతోనే గొంతు నులిమి హత్య చేశాడని వివరించారు. మంగళవారం తుర్మాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కుక్ కౌంటీ ప్రాసిక్యూటర్ జేమ్స్ మర్ఫీ మాట్లాడుతూ.. నిందితుడు నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం యూనివర్సిటీ క్యాంపస్ నుంచి జార్జ్ పార్కుకు నడుచుకుంటూ వెళ్తుండగా తుర్మన్ పిలవగా పలకలేదని.. కారు గ్యారేజీలోకి వెళ్తున్న జార్జ్‌ను వెంబడించాడని చెప్పారు. ఆమె చాలా అందంగా ఉందని, తనతో మాట్లాడాలని భావించాడని, అయితే ఆమె స్పందించలేదని వివరించారు. దీంతో కోపోద్రిక్తుడై గొంతు నులిమాడని, దీంతో అచేతనా స్థితిలోకి వెళ్లిందని చెప్పారు. ఆమెను తన కారు వెనుక సీటులోకి ఎక్కించి అత్యాచారం చేశాడని వివరించారు. తుర్మన్‌కు బెయిల్ ఇవ్వొద్దని, కస్టడీలోకి తీసుకోవాలని వాదనలు విన్న జడ్జి చార్లెస్ బీచ్–2 ఉత్తర్వులు ఇచ్చారు. ఆయుధాల దొంగతనం కేసులో ఆరేళ్లు జైలు శిక్ష పడ్డ తుర్మన్ రెండేళ్లు జైలులో ఉండి గతేడాది డిసెంబర్లో బెయిల్‌పై బయటికి వచ్చాడు. రూత్‌జార్జ్ షికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో ఆనర్స్ రెండో సంవత్సరం చదువుకుంటోంది. హైదరాబాద్‌కు చెందిన ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడింది. -
మనుమరాలిని హతమార్చిన తాత
హుజూరాబాద్‌రూరల్ : ఆడుతూ..పాడుతూ సరదాగా ఉండే చిన్నారి తెల్లారెసరికి విగతజీవిగా మారింది. కథలు..కబుర్లు చెబుతూ..కాపాడాల్సిన తాతయ్యే కాలయముడయ్యాడు. సొంత మనుమరాలి గొంతునొలిమి చంపిన ఘటన హుజూరాబాద్ మండలం చెల్పూర్లో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన నిజవపురం సంతోష్–స్వరూపలకు కుమారుడు రితీశ్(7), కుమార్తె సిరివల్లి(6) సంతానం. సంతోష్ దంపతులు జమ్మికుంటలో ఉంటుండడంతో పిల్లలు సైతం అక్కడి ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు. రంజాన్ నేపథ్యంలో పాఠశాలకు సెలవులు రావడంతో సిరివల్లిని చెల్పూర్లోని సంతోష్ తల్లిదండ్రుల వద్ద మూడు రోజుల క్రితం మేనమామ దించేసివచ్చాడు. సోమవారం తెల్లవారుజామున చిన్నారి మృతిచెంది ఉన్నట్లు సిరివల్లి బాపమ్మ పేర్కొంది. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. హుజూరాబాద్‌టౌన్ సీఐ దామోదర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా మృతురాలి తాతయ్య రవి వేలిముద్రలు సిరివల్లి మెడపై ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తాతయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తనే చంపినట్లు అంగీకరించాడు. తన కొడుకు సంతోష్‌ను కోడలు కొన్ని రోజులుగా తమ నుంచి దూరంగా ఉంచుతుండడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు రవి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా రవి కొంతకాలంగా మానసికవ్యాధికి సంబంధించిన మందులు వాడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి : బాలల హక్కుల ప్రజాధ్వని సభ్యులు అభం శుభం తెలియని చిన్నారిని హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల ప్రజాధ్వని రాష్ట్ర కమిటీ సభ్యులు అనుమాండ్ల శోభారాణి, జిల్లా అధ్యక్షుడు సంపత్, కమిటీ సభ్యులు చల్లూరి రాజు, సదాశివరెడ్డి డిమాండ్ చేశారు. చట్టాలు కఠినతరం చేసినప్పుడే బాలికల హత్యలు తగ్గుతాయన్నారు. -
అదృశ్యమైన చిన్నారి దారుణ హత్య
వనపర్తి : జిల్లాలోని పెద్దగూడెంలో దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఆరేళ్ల చిన్నారి నాగేశ్వరి దారుణ హత్యకు గురైంది. స్థానికంగా నివాసం ఉంటున్న రామకృష్ణ అలియాస్ బాబా ఇంట్లో చిన్నారి మృతదేహం లభించింది. కాగా ఈ నెల 10న పెద్దగూడెంలో చిన్నారి అదృశ్యమైంది. నాగేశ్వరి హత్యకేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే క్షుద్ర పూజలా? లేక చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అక్రమ సంబంధం ఉందని.. చెల్లిని చంపేశాడు!
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న కోపంతో.. తన సొంత చెల్లెలిని మెడకు కరెంటు వైరు బిగించి చంపేశాడో అన్నయ్య. మీరట్ సమీపంలోని లీసా రే గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నజియా అలియాస్ లజ్జో (18) అనే అమ్మాయిని ఆమె సొంత అన్న మహ్మద్ యాసిన్ (25) పీకకు కరెంటువైరు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం అతడు నేరుగా వెళ్లి పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఆ అమ్మాయికి తన పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, దాంతో యాసిన్ ఆగ్రహం చెందాడని పోలీసులు తెలిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
నాన్నే యముడు
-
బాలికపై హత్యాచారం కేసు: కన్నతండ్రే నిందితుడు
రంగారెడ్డి జిల్లాలో గిరిజన బాలికపై అత్యాచారం, హత్యకేసు మిస్టరీ వీడింది. ఈ ఘోరమైన కేసులో ఆమె కన్నతండ్రే నిందితుడని పోలీసులు తేల్చారు. ఐదుగురు వ్యక్తులు తనను కొట్టి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హతమార్చారంటూ కట్టుకథలు అల్లి.. ఈ ఘోరానికి పాల్పడ్డాడని చెప్పారు. మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందిన సిమ్రాన్ (14) తండ్రితో కలిసి గురువారం రాత్రి 8 గంటల సమయంలో గ్రామానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. కస్తూరిబా గాంధీ పాఠశాలలో చదువుతున్న సిమ్రాన్‌ను బంధువుల ఇంటి నుంచి తీసుకొస్తానంటూ ఆమె తండ్రి మెగావత్ కమాల్ తన మోపెడ్ మీద వెళ్లాడు. (చదవండి - 'తల్లి'డిల్లిన తండా... యాడియే..) రాత్రి తాము తిరిగి వస్తుండగా ఆటోలోంచి గుర్తు తెలియని దుండగులు వచ్చి తనపై దాడి చేసి.. ఆమెను అపహరించారని, తర్వాత సామూహిక అత్యాచారం చేసి హతమార్చారని అందరినీ నమ్మించాడు. ఈ విషయంలో ఎవరూ తనను అనుమానించకూడదని తలమీద గాయం చేసుకున్నట్లు చూపించాడు. తర్వాత కమాల్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పడంతో తండావాసులు, బంధువులు అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, కమాల్ మెగావత్ వ్యవహారశైలిపై పోలీసులకు ముందునుంచి అనుమానంగానే ఉంది. తనను కొట్టి అమ్మాయిని తీసుకెళ్లిపోయారని ఒకసారి, కాదు తాను వాళ్లను ఎదిరించానని మరోసారి చెప్పడం, అతడి తీరు కూడా తేడాగా ఉండటంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో.. తానే మద్యం మత్తులో కన్నకూతురిపై అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
కాబోయే భర్తే హంతకుడు!!
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన యువతి హత్యకేసు కొత్త మలుపు తిరిగింది. కొంతమంది తాగుబోతులు ఆమెను పొడిచి చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తే.. అంటే, ఆమెకు కాబోయే భర్తే సదరు యువతిని చంపినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని రాయగఢ్ ప్రాంతానికి చెందిన బీర్బల్ ప్రసాద్ (26)కు అహ్మదాబాద్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆమె తండ్రి ఆ సంబంధం వద్దనుకున్నారు. అయినా బీర్బల్ ప్రసాద్ ఆమెతో స్నేహాన్ని కొనసాగిస్తున్నాడు. ఈనెల 14వ తేదీ రాత్రి తాను ఆమెతో కలిసి ఉండగా కొంతమంది తాగుబోతులు వచ్చి ఆమెపై అత్యాచారం చేయబోయారని, తాము అడ్డుకోగా ఇద్దరిపైనా కత్తులతో దాడి చేశారని అతడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అయితే.. విచారణలో అసలు విషయం తేలింది. ప్రసాద్ వద్ద సూసైడ్ నోట్ లభించింది. దాంతో, ముందుగా ఆమెను హతమార్చి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోడానికి అతడు ప్రయత్నించాడని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మనోజ్ అగర్వాల్ తెలిపారు. ఆమె తల్లిదండ్రులు తనను అవమానించినందువల్లే ప్రతీకారం తీర్చుకోడానికి బీర్బల్ ఈ హత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఆమెను చంపిన తర్వాత తనను తాను పొడుచుకున్నా, అతడి ప్రాణాలు మాత్రం దక్కాయి. దాంతో కథ మార్చి, నలుగురు యువకులు దాడిచేసినట్లు అల్లాడు. అతడు ఇంకా చికిత్స పొందుతున్నాడు. -
శృంగారానికి నిరాకరించిందని.. పొడిచి చంపేశారు!
గుజరాత్లో దారుణం జరిగింది. తమతో శృంగారానికి నిరాకరించిందన్న కారణంతో.. బాగా తాగి ఉన్న కొంతమంది గూండాలు 22 ఏళ్ల యువతిని కత్తితో పొడిచి చంపేశారు. ఈ దాడిలో ఆమె స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నారన్‌పురా రైల్వే క్రాసింగ్ సమీపంలో జరిగింది. గాయపడిన యువకుడు, మృతురాలి తల్లిదండ్రులు ఏమైనా చెబితే దాన్నిబట్టి కేసు దర్యాప్తు ముందడుగు వేస్తుందని పోలీసులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని రాయగఢ్ ప్రాంతానికి చెందిన బీర్బల్ ప్రసాద్ (26) అనే యువకుడికి అహ్మదాబాద్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో కొంతకాలం క్రితం నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్నాళ్ల తర్వాత పెళ్లికూతురి తండ్రి.. ఆ సంబంధం వద్దనుకుని నిశ్చితార్థం రద్దుచేసుకున్నారు. అయితే.. ఆ తర్వాత కూడా ఆమె బీర్బల్తో స్నేహం కొనసాగిస్తోంది. అతడు అప్పుడప్పుడు అహ్మదాబాద్ వచ్చి వెళ్తుండేవాడు. అలాగే వచ్చి రాత్రి కాసేపు మాట్లాడుకున్న తర్వాత.. తిరిగి 10.30 ప్రాంతంలో వెళ్తుండగా ఆమె పీజీ అకామడేషన్ తలుపులు వేసి ఉన్నాయి. దాంతో మరికాసేపు వాళ్లు మాట్లాడుకుంటూ గడిపారు. అదే సమయంలో తాగిఉన్న నలుగురు అక్కడకు వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. తమతో శృంగారానికి రమ్మని పిలవగా, ఆమె నిరాకరించింది, స్నేహితుడు కూడా వాళ్లను అడ్డుకున్నాడు. వెంటనే వాళ్లు ఆమెను, అతడిని కత్తితో పొడిచారు. ఆమెను పలుమార్లు పొడవడంతో తీవ్రంగా గాయపడింది. బీర్బల్ పోలీసులకు ఫోన్ చేయగా, వారు ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.