సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌పీ
జయపురం: అవిభక్త కొరాపుట్ జిల్లాలో మరో ‘దిశ’ సంఘటన శనివారం వెలుగుచూసింది. రాష్ట్ర డీజీపీగా ఇటీవల నియమితులైన అభయకుమార్ జిల్లాలో మొదటిసారిగా పర్యటనకు విచ్చేసిన రోజునే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో పర్యటించిన డీజీపీ ఆయా జిల్లాల శాంతిభద్రతల చర్యలపై అక్కడి అధికారులతో చర్చలు జరపగా, ఆయన పర్యటనలో ఉంటుండగానే నవరంగపూర్ జిల్లాలోని కొశాగుమడ సమితిలో గుమండల గ్రామంలో బాలికపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు లైంగికదాడికి పాల్పడి, ఆ బాలికను చంపేశారు.
గుముండల గ్రామంలో శుక్రవారం రాత్రి దియాలి పర్వ్ జరుగుతుండగా, ఆ పర్వ్ కార్యక్రమాలు చూసుకుని బాధిత బాలిక, ఇంటికి చేరింది. సరిగ్గా రాత్రి 8 గంటల సమయంలో బహిర్భూమి కోసమని ఇంటి నుంచి ఆ బాలిక బయటకు వచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలిక ఎంతసేపటికీ రాకపోయేసరికి బాధిత బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ బాలిక ఆచూకీ కోసం గ్రామం సహా గ్రామ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆ బాలిక ఆచూకీ కానరాలేదు. అయితే శనివారం ఉదయం గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు గ్రామానికి ఓ అరకిలోవీుటరు దూరంలోని ఓ పొలంలో బాలిక మృతదేహం ఉండడాన్ని గమనించారు. ఇదే విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయగా, సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు ఘటన స్థలంలో పడిఉన్న బాలిక మృతదేహం, దానికి కొంతదూరంలో రెండు జీన్ ప్యాంట్లు, చెప్పులు పడిఉండడం, అలాగే బాలిక శరీరంపై కూడా అక్కడక్కడ గాయాలు ఉండడం చూశారు.
ఈ నేపథ్యంలో బాలికపై ఎవరో బలవంతంగా సామూహిక అత్యాచారం చేసి ఉంటారని భావించారు. అనంతరం ఇదే విషయంపై బాధిత బాలిక కుటుంబ సభ్యులు కొశాగుమడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన కొశాగుమడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం దర్యాప్తు చర్యలు ప్రారంభించారు. ఇదే విషయంపై స్పందించిన నవరంగపూర్ జిల్లా మాఘొరొ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు కాదంబనీ త్రిపాఠి కేసును త్వరగా విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment