![Durgam Shravan Is Recognized As The Gold Man Of Telangana](/styles/webp/s3/article_images/2024/08/13/goldman.jpg.webp?itok=4eOznPfo)
ప్రస్తుతం ‘తెలంగాణ గోల్డ్ మ్యాన్’గా గుర్తింపు
తాత ముత్తాతల నుంచి రాయదుర్గమే..
మొదట్లో ‘హైదరాబాద్ గోల్డ్ మ్యాన్’గా ప్రాచుర్యం
రాయదుర్గం: ‘బంగారం’ అంటే ఎవరికి ప్రేమ, మమకారం ఉండదు చెప్పండి. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు అయితే బంగారంతో తయారుచేసిన ఆభరణాలు ధరించడం ఎంతో మక్కువ, మమకారం. కాగా మగవాళ్లకు ఇటీవలి కాలంలో బంగారం ధరించడం ఒక కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. ఆ ట్రెండ్ ఇటీవలి కాలంలో గుర్తింపు సాధించింది మాత్రం దుర్గం శ్రవణ్‌కుమార్ అని చెప్పక తప్పదు. గత 20 ఏళ్లుగా బంగారు నగలు, ఉంగరాలు ధరిస్తూ శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంకు చెందిన దుర్గం శ్రవణ్‌కుమార్ బంగారు ఆభరణాలు ధరిస్తూ మొదట్లో ‘హైదరాబాద్ గోల్డ్‌మ్యాన్’గా గుర్తింపు సాధించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బంగారు ఆభరణాలు ధరిస్తూ అగుపించడంతో రాష్ట్రమంతటా ప్రస్తుతం ‘తెలంగాణ గోల్డ్‌మ్యాన్’ గుర్తింపు సాధించడం విశేషం.
గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో తాత ముత్తాతల నుంచి దుర్గం శ్రవణ్‌కుమార్ కుటుంబం నివాసముంటోంది. ప్రస్తుతం 51 ఏళ్ల వయస్సులో ఉండే శ్రవణ్‌కుమార్ తండ్రి దుర్గం లక్ష్మయ్య, తల్లి పెంటమ్మకు చిన్న తనం నుంచే బంగారంపై చాలా మక్కువ ఉండేది. ఆ తర్వాత ఒక వయస్సు వచి్చన తర్వాత 25 ఏళ్ల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆరంభం నుంచే డబ్బులు సంపాదించడం, ఆ తర్వాత ఫైనాన్స్ చేస్తూ రెండింటిలోనూ రాణిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
బంగారం ధరించేందుకు నాన్నే స్ఫూర్తి..
మా నాన్న దుర్గం లక్ష్మయ్యనే బంగారం ధరించడానికి నాకు స్ఫూర్తి. ఒక గొలుసు, రెండు ఉంగరాలు ధరించే వాళ్లు. ఆయన వాటిని నాకు ఇచ్చేశారు. ఆయన నుంచి కష్టపడేతత్వాన్ని నేర్చుకున్నా. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల డబ్బులు సంపాదించే అవకాశం కలిగింది. దీంతోనే బంగారం కొనుగోలు మొదలైంది. మొదట హైదరాబాద్ గోల్డ్ మ్యాన్‌గా పిలిచేవారు. ప్రస్తుతం రాష్ట్రంలోనూ, ఇతర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్లినా తెలంగాణ గోల్డ్‌మ్యాన్‌గా పిలవడం సంతోషాన్నిస్తుంది. నా కష్టార్జితంతోనే వీటిని ధరించడం అలవాటుగా మారింది. ప్రతి ఒక్కరూ కష్టపడేతత్వం అలవర్చుకుంటే గుర్తింపు దానంతట అదే వస్తుందనేది నా నమ్మకం. రాయదుర్గం నాగార్జున ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకూ చదివాను. ఆపై చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాను. ప్రతి రూపాయి చెమటోడ్చి సంపాధించినదే, ఇందులో కొంత ఆపదలో ఉన్నవారికి నా వంతూ సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అలవాటు. – దుర్గం శ్రవణ్‌కుమార్, తెలంగాణ గోల్డ్ మ్యాన్, రాయదుర్గం
Comments
Please login to add a commentAdd a comment