Gold man
-
గోల్డ్‌మ్యాన్ దుర్గం శ్రవణ్..
రాయదుర్గం: ‘బంగారం’ అంటే ఎవరికి ప్రేమ, మమకారం ఉండదు చెప్పండి. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు అయితే బంగారంతో తయారుచేసిన ఆభరణాలు ధరించడం ఎంతో మక్కువ, మమకారం. కాగా మగవాళ్లకు ఇటీవలి కాలంలో బంగారం ధరించడం ఒక కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. ఆ ట్రెండ్ ఇటీవలి కాలంలో గుర్తింపు సాధించింది మాత్రం దుర్గం శ్రవణ్‌కుమార్ అని చెప్పక తప్పదు. గత 20 ఏళ్లుగా బంగారు నగలు, ఉంగరాలు ధరిస్తూ శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంకు చెందిన దుర్గం శ్రవణ్‌కుమార్ బంగారు ఆభరణాలు ధరిస్తూ మొదట్లో ‘హైదరాబాద్ గోల్డ్‌మ్యాన్’గా గుర్తింపు సాధించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బంగారు ఆభరణాలు ధరిస్తూ అగుపించడంతో రాష్ట్రమంతటా ప్రస్తుతం ‘తెలంగాణ గోల్డ్‌మ్యాన్’ గుర్తింపు సాధించడం విశేషం.గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో తాత ముత్తాతల నుంచి దుర్గం శ్రవణ్‌కుమార్ కుటుంబం నివాసముంటోంది. ప్రస్తుతం 51 ఏళ్ల వయస్సులో ఉండే శ్రవణ్‌కుమార్ తండ్రి దుర్గం లక్ష్మయ్య, తల్లి పెంటమ్మకు చిన్న తనం నుంచే బంగారంపై చాలా మక్కువ ఉండేది. ఆ తర్వాత ఒక వయస్సు వచి్చన తర్వాత 25 ఏళ్ల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆరంభం నుంచే డబ్బులు సంపాదించడం, ఆ తర్వాత ఫైనాన్స్ చేస్తూ రెండింటిలోనూ రాణిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.బంగారం ధరించేందుకు నాన్నే స్ఫూర్తి..మా నాన్న దుర్గం లక్ష్మయ్యనే బంగారం ధరించడానికి నాకు స్ఫూర్తి. ఒక గొలుసు, రెండు ఉంగరాలు ధరించే వాళ్లు. ఆయన వాటిని నాకు ఇచ్చేశారు. ఆయన నుంచి కష్టపడేతత్వాన్ని నేర్చుకున్నా. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల డబ్బులు సంపాదించే అవకాశం కలిగింది. దీంతోనే బంగారం కొనుగోలు మొదలైంది. మొదట హైదరాబాద్ గోల్డ్ మ్యాన్‌గా పిలిచేవారు. ప్రస్తుతం రాష్ట్రంలోనూ, ఇతర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్లినా తెలంగాణ గోల్డ్‌మ్యాన్‌గా పిలవడం సంతోషాన్నిస్తుంది. నా కష్టార్జితంతోనే వీటిని ధరించడం అలవాటుగా మారింది. ప్రతి ఒక్కరూ కష్టపడేతత్వం అలవర్చుకుంటే గుర్తింపు దానంతట అదే వస్తుందనేది నా నమ్మకం. రాయదుర్గం నాగార్జున ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకూ చదివాను. ఆపై చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాను. ప్రతి రూపాయి చెమటోడ్చి సంపాధించినదే, ఇందులో కొంత ఆపదలో ఉన్నవారికి నా వంతూ సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అలవాటు. – దుర్గం శ్రవణ్‌కుమార్, తెలంగాణ గోల్డ్ మ్యాన్, రాయదుర్గం -
బంగారు బైక్ నడుపుతున్న గోల్డ్ మ్యాన్
-
తిరుమలలో ప్రత్యక్షమైన గోల్డ్‌మ్యాన్!
సాక్షి, తిరుపతి: పది గ్రాములు కాదు.. వంద గ్రాములు కాదు.. ఏకంగా మూడు వేల గ్రాముల బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు ఓ భక్తుడు. చేతికి భారీ బంగారు కడియాలు, బ్రేస్లెట్లు.. వేళ్లకు పెద్దపెద్ద ఉంగరాలు… ఇక మెడలో అయితే అంతకుమించిన గోల్డ్ చైన్స్.. మొత్తంగా మూడు కిలోలకు పైగా బంగారం అతని ఒంటిపై ధగధగ మెరిసిపోతోంది. ఈ గోల్డ్‌మ్యాన్ పేరు గడ్డిపాటి సాంబశివరావు, సొంతూరు గుంటూరు జిల్లా మంగళగిరి. తిరుమలలో ప్రత్యక్షమైన గోల్డ్‌మ్యాన్‌ను ఆశ్చర్యంగా చూశారు మిగతా భక్తులు. గోల్డ్‌మ్యాన్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. వామ్మో ఇంత బంగారమా అంటూ అవాక్కయ్యారు. నగల దుకాణమే తరలివచ్చిందా అన్నట్టుగా బంగారు ధరించి వచ్చిన గడ్డిపాటి సాంబశివరావు తిరుమలలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. -
ఒంటి నిండా బంగారంతో గుళ్లోకి వచ్చి..
చెన్నై(తమిళనాడు): మదురైలో అతడో పేరుమోసిన రౌడి. అతడిపై రౌడీషీటేకాదు ఏకంగా 14 కేసులు ఉన్నాయి. హత్య, బెదిరింపులు, హత్యాయత్నం, దందా సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడి పేరు వరిచియూర్ సెల్వం. మధురైలో అతడి పేరు చెబితే భయంతో జనం హడలిపోతారు. ఎంత పెద్ద రౌడి అయినప్పటికీ అతడికి రెండు బలహీనతలు ఉన్నాయి. ఒకటి బంగారం, రెండోది దైవం. కేజీలకు కేజీల బంగారు నగలు వేసుకోవటమంటే సెల్వంకు పిచ్చి. అదే సమయంలో దేవుడంటే మహా భక్తి భయం కూడా. ఒంటి నిండా బంగారంతో కాంచిపురంలోని అత్తివరదర్ ఆలయాన్ని దర్శించుకోవాలనే కోరిక అతడికి కలిగింది. అనుకున్నదే తడవుగా మదురై పోలీసు కమిషనర్ ద్వారా కాంచిపురం ఎస్పీకి సమాచారం పంపించి అత్తివరదర్ దర్శనానికి వచ్చాడు. అంతే మనోడికి పోలీసులు రాచమర్యాదలతో స్వామి వారి దర్శనం, ప్రత్యేక పూజలు చేయించి జాగ్రత్తగా పంపించివేశారు. ఒంటినిండా బంగారంతో ఓ రౌడి సకల మర్యాదలతో స్వామివారి దర్శనం చేసుకోవడంపై స్థానికులు వింతగా చర్చించుకుంటున్నారు. రౌడీనా మజాకా అంటూ కామెంట్ చేస్తున్నారు. -
బంగారి రాజు!
అవును మీరు చూస్తున్నది నిజమే.. ఫొటోలో ఉన్న వ్యక్తి ధరించిన ఆభరణాలన్నీ నిజంగా బంగారంతో చేసినవే.. అయితే అతడు ఏదో ఫొటో కోసం అలా అలంకరించుకోలేదు.. ఎక్కడికి వెళ్లినా కూడా ఆ భారీ అభరణాలను ధరిస్తాడట. ఇంతకీ మనోడి గురించి చెప్పలేదు కదూ..! పేరు.. ట్రాన్ గోక్.. వియత్నాం దేశానికి చెందినవాడు. వయసు 36 ఏళ్లు. వృత్తి చమురు వ్యాపారి. ఇతడికి ఇలా భారీ ఆభరణాలు వేసుకుని తిరగడమంటే ట్రాన్‌కు మహా సరదా.. ఓ రకంగా పిచ్చి. అతడు వేసుకున్న బంగారు ఆభరణాలు మొత్తం 13 కిలోల బరువుంటాయట. బయటకి ఎక్కడికి వెళ్లినా కూడా అంత బరువున్న ఆభరణాలు వేసుకొని వెళ్లాల్సిందేనట. మరి దొంగలెవరైనా దాడి చేసి ఎత్తుకుపోతే అనుకుంటున్నారా.. ఎక్కడికి వెళ్లినా అతడి వెంట ఎప్పుడూ ఐదుగురు బాడీగార్డులు ఉండాల్సిందేనట. అంత బరువును మోయాల్సిన అవసరం ఏముందని ఎవరైనా అడిగితే.. ఈ బంగారం తనకు అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతాడట. తాను ధరించిన ఆభరణాల్లో మెడ గొలుసు, లాకెట్ కలిపి 5 కిలోలు, చేతికి ధరించిన కంకణం 5 కిలోలు.. అర కిలో బరువుతో ఉండే నాలుగు ఉంగరాలు.. మొలతాడు కిలో ఉంటుందట. వీటి మొత్తం ఖరీదు దాదాపు రూ.4 కోట్లు ఉంటుందట. ఐదేళ్ల కిందటి నుంచే ఇంతటి భారీ ఆభరణాలు తయారు చేయించుకోవడం ప్రారంభించాడట ట్రాన్. ఇక్కడితో ఆగిపోకుండా తన కోసం బంగారు చొక్కా తయారు చేయించుకుంటున్నాడట కూడా. అయితే దానితో కష్టాలు కూడా ఉన్నాయి లెండి. అంత బరువు మెడ గొలుసు వేసుకోవడంతో తరచూ మెడనొప్పి వస్తుందట. అయితే డాక్టర్లను సంప్రదించి మందులు వాడుతున్నాడట కానీ బంగారం వేసుకోవడం మాత్రం ఆపట్లేదట మనోడు. యూట్యూబ్‌లో ఇతడి వీడియోలకు లక్షలాది వ్యూస్ వచ్చాయి. అంతే ఇక సామాజిక మాధ్యమాల్లో ఆయన ఫొటోలు తెగ వైరల్ అయిపోతున్నాయి. ఓ రకంగా రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయాడు. భారత్‌లో కూడా ఓ బంగారు బాబు ఉన్నాడు లెండి. ముంబైలోని పింప్రికి చెందిన దత్తా ఫుగ్ ఏకంగా 3.2 కిలోల బంగారంతో చేసిన చొక్కాను ధరించేవాడు. -
కేంద్రం నిర్ణయంపై గోల్డ్‌మ్యాన్ అసంతృప్తి
బంగారం, బంగారు అభరణాలపై వదంతులు వస్తుండటంతో గతవారం కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక పరిమితి వరకు బంగారు అభరణాలపై లెక్క చూపాల్సిన అవసరం లేదని, వారసత్వంగా వచ్చిన బంగారంపై కూడా పన్ను ఉండదని క్లారిటీ ఇచ్చింది. అయితే, అరకిలో (500 గ్రాముల) కన్నా ఎక్కువ బంగారం ఉంటే మాత్రం లెక్కలు చూపాలని పేర్కొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ వివరణ, బంగారం వస్తున్న వదంతులపై ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన ‘గోల్డ్ మ్యాన్’ మనోజ్ సెంగార్ భగ్గుమంటున్నారు. బంగారం విషయంలో కేంద్రం తీరు ఆయనకు ఎంతమాత్రం నచ్చడం లేదు. ఒంటినిండా నగలు, చేతికి ఉంగరాలు, మణికట్టుకు బరువైన బ్రెస్లెట్ ఇలా దాదాపు నాలుగు కిలోల బంగారాన్ని ధరించి అట్టహాసంగా తిరిగే మనోజ్‌ను స్థానికంగా ‘గోల్డ్‌మ్యాన్’గా ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. ఎప్పుడూ తెల్లటిదుస్తులు ధరించే ఆయన వెండితో చేయించిన షూస్ వేసుకుంటారు. బంగారంపై కేంద్రం పరిమితి విధించడాన్ని తప్పుబడుతూ.. ‘ప్రభుత్వమంటే ప్రతి ఒక్కరికీ గౌరవముంది. కానీ ఇలా చూస్తూ పోతే.. ఆఖరికీ గురక మీద, దగ్గు మీద కూడా పరిమితి విధించేలా కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. తన వద్ద ఎంత బంగారం ఉందో చెప్పడానికి నిరాకరించిన ఆయన.. ఈ బంగారం ఎక్కడిదంటే.. ‘తాతలు, తండ్రులు ఇచ్చింది. దానిని అమ్మకుండా ఇలా భద్రపరుచుకున్నా’ అని చెప్పారు. ‘ ఈ బంగారం గురించి బిల్లులు అడిగితే.. నేను స్వర్గానికి వెళ్లి మా తాతలు, ముత్తాతలను అడుగాల్సి ఉంటుంది’ అంటూ సెంగార్ నవ్వులొలికారు. పెళ్లయిన మహిళల వద్ద 500 గ్రాములు, పెళ్లికాని మహిళల వద్ద 250గ్రాములు, పురుషుల వద్ద 100 గ్రాముల బంగారం ఉంటే లెక్కలు అడగబోమని, అంతకుమించి లెక్కలు చూపాల్సిందేనన్న కేంద్రం ప్రకటనపై సెంగార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
బంగారు కొండతో స్పెషల్ చిట్ చాట్