తిరుమలలో ప్రత్యక్షమైన గోల్డ్‌మ్యాన్‌! | Devotees Were Shocked After Guntur Gold Man Spotted In Tirumala, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Gold Man Spotted In Tirumala: తిరుమలలో ప్రత్యక్షమైన గోల్డ్‌మ్యాన్‌!

Published Fri, Apr 5 2024 5:09 PM | Last Updated on Fri, Apr 5 2024 5:49 PM

Devotees Were Shocked By The Gold Man In Tirumala - Sakshi

పది గ్రాములు కాదు.. వంద గ్రాములు కాదు.. ఏకంగా మూడు వేల గ్రాముల బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు ఓ భక్తుడు.

సాక్షి, తిరుపతి: పది గ్రాములు కాదు.. వంద గ్రాములు కాదు.. ఏకంగా మూడు వేల గ్రాముల బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు ఓ భక్తుడు. చేతికి భారీ బంగారు కడియాలు, బ్రేస్‌లెట్లు.. వేళ్లకు పెద్దపెద్ద ఉంగరాలు… ఇక మెడలో అయితే అంతకుమించిన  గోల్డ్‌ చైన్స్‌.. మొత్తంగా మూడు కిలోలకు పైగా బంగారం అతని ఒంటిపై ధగధగ మెరిసిపోతోంది.

ఈ గోల్డ్‌మ్యాన్‌ పేరు గడ్డిపాటి సాంబశివరావు, సొంతూరు గుంటూరు జిల్లా మంగళగిరి. తిరుమలలో ప్రత్యక్షమైన గోల్డ్‌మ్యాన్‌ను ఆశ్చర్యంగా చూశారు మిగతా భక్తులు. గోల్డ్‌మ్యాన్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. వామ్మో ఇంత బంగారమా అంటూ అవాక్కయ్యారు. నగల దుకాణమే తరలివచ్చిందా అన్నట్టుగా బంగారు ధరించి వచ్చిన గడ్డిపాటి సాంబశివరావు తిరుమలలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement