durgam
-
శరన్నవరాత్రులు..తొమ్మిదో రోజు మహిషాసుర మర్దినిగా అలంకారం..!
అమ్మవారి ఆరాధనలతో సాగిన ఈ నవరాత్రులు అప్పుడే తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి. శరన్నవరాత్రులలో తొమ్మిదో రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి అత్యంత మహిమాన్వితమైంది. ఈరోజు అమ్మవారి అలంకారం మహిమాన్వితమైన మహిషాసుర మర్ధినీ దేవి అవతారం. అమ్మవారు ఉగ్రరూపంతో, చేతిలో త్రిశూలంతో సింహవాహినియై దుష్టశిక్షణ గావిస్తున్నట్లుగా భక్తులకు దర్శనమిస్తుంది. మహిషాసుర మర్ధిని స్తోత్రం, లలితాసహస్రనామ స్తోత్రంతో షోడశోపచార పూజలు చేసి అమ్మవారి కరుణాకటాక్షాలు పొందుతారు భక్తులు. మహిషాసురుడనే రాక్షసుడుతో అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా హోరాహోరీగా పోరు సలిపి.. ఆశ్వయుజ శుక్ల నవమి రోజున ఉగ్ర రూపంలో అంతమొందించిందని పురాణ కథనం. అందువల్లే దుర్గమ్మను మహిషాసుర మర్దినిగా కొలుచుకుంటున్నారు భక్తులుమరికొన్ని చోట్ల చివరి రోజున దుర్గమ్మను సిద్ధిధాత్రి రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈమె సర్వసిద్ధులను ప్రసాదించే శక్తి అవతారం. తామర పువ్వుపై కూర్చుని ఉంటుంది. ఈ మాతకు నాలుగు చేతులు ఉన్నాయి. కుడి చేతిలో శంఖం, చక్రం, ఎడమవైపున చేతిలో తామరపువ్వులు ఉంటాయి. గ్రంథాల ప్రకారం సిద్ధిదాత్రీ మాత అణిమ, ఇషిత్వ, వశిత్వ, లఘిమ, గరిమ, ప్రాకామ్య, మహిమ, ప్రాప్తి అని పిలువబడే ఎనిమిది సిద్ధులకు దేవత. ఈ మాతను ఆరాధించడం వల్ల అష్ట సిద్ధులన్నీ లభిస్తాయని, పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతోనే పొందినట్లుగా దేవీ పురాణంలో ఉంది. అంతేగాదు ఈ తల్లి తన భక్తుల జీవితంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుందనేది భక్తుల విశ్వాసం.ఈరోజున త్రిరాత్ర వ్రతం కొనసాగిస్తారు. బొమ్మలకొలువు పేరంటం జరుపుతారు. కొన్ని ప్రాంతాలవారు వాహన పూజ మహానవమినాడు చేసుకుంటారు.నైవేద్యంగా..వడపప్పు, పానకం, చలిమిడి, పులిహోర, పులగాన్నం, గారెలు, నిమ్మరసం, చక్కెర పొంగలి నివేదిస్తారు.(చదవండి: ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!) -
గోల్డ్‌మ్యాన్ దుర్గం శ్రవణ్..
రాయదుర్గం: ‘బంగారం’ అంటే ఎవరికి ప్రేమ, మమకారం ఉండదు చెప్పండి. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు అయితే బంగారంతో తయారుచేసిన ఆభరణాలు ధరించడం ఎంతో మక్కువ, మమకారం. కాగా మగవాళ్లకు ఇటీవలి కాలంలో బంగారం ధరించడం ఒక కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. ఆ ట్రెండ్ ఇటీవలి కాలంలో గుర్తింపు సాధించింది మాత్రం దుర్గం శ్రవణ్‌కుమార్ అని చెప్పక తప్పదు. గత 20 ఏళ్లుగా బంగారు నగలు, ఉంగరాలు ధరిస్తూ శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంకు చెందిన దుర్గం శ్రవణ్‌కుమార్ బంగారు ఆభరణాలు ధరిస్తూ మొదట్లో ‘హైదరాబాద్ గోల్డ్‌మ్యాన్’గా గుర్తింపు సాధించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బంగారు ఆభరణాలు ధరిస్తూ అగుపించడంతో రాష్ట్రమంతటా ప్రస్తుతం ‘తెలంగాణ గోల్డ్‌మ్యాన్’ గుర్తింపు సాధించడం విశేషం.గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో తాత ముత్తాతల నుంచి దుర్గం శ్రవణ్‌కుమార్ కుటుంబం నివాసముంటోంది. ప్రస్తుతం 51 ఏళ్ల వయస్సులో ఉండే శ్రవణ్‌కుమార్ తండ్రి దుర్గం లక్ష్మయ్య, తల్లి పెంటమ్మకు చిన్న తనం నుంచే బంగారంపై చాలా మక్కువ ఉండేది. ఆ తర్వాత ఒక వయస్సు వచి్చన తర్వాత 25 ఏళ్ల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆరంభం నుంచే డబ్బులు సంపాదించడం, ఆ తర్వాత ఫైనాన్స్ చేస్తూ రెండింటిలోనూ రాణిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.బంగారం ధరించేందుకు నాన్నే స్ఫూర్తి..మా నాన్న దుర్గం లక్ష్మయ్యనే బంగారం ధరించడానికి నాకు స్ఫూర్తి. ఒక గొలుసు, రెండు ఉంగరాలు ధరించే వాళ్లు. ఆయన వాటిని నాకు ఇచ్చేశారు. ఆయన నుంచి కష్టపడేతత్వాన్ని నేర్చుకున్నా. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల డబ్బులు సంపాదించే అవకాశం కలిగింది. దీంతోనే బంగారం కొనుగోలు మొదలైంది. మొదట హైదరాబాద్ గోల్డ్ మ్యాన్‌గా పిలిచేవారు. ప్రస్తుతం రాష్ట్రంలోనూ, ఇతర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్లినా తెలంగాణ గోల్డ్‌మ్యాన్‌గా పిలవడం సంతోషాన్నిస్తుంది. నా కష్టార్జితంతోనే వీటిని ధరించడం అలవాటుగా మారింది. ప్రతి ఒక్కరూ కష్టపడేతత్వం అలవర్చుకుంటే గుర్తింపు దానంతట అదే వస్తుందనేది నా నమ్మకం. రాయదుర్గం నాగార్జున ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకూ చదివాను. ఆపై చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాను. ప్రతి రూపాయి చెమటోడ్చి సంపాధించినదే, ఇందులో కొంత ఆపదలో ఉన్నవారికి నా వంతూ సేవా కార్యక్రమాలకు వెచ్చించడం అలవాటు. – దుర్గం శ్రవణ్‌కుమార్, తెలంగాణ గోల్డ్ మ్యాన్, రాయదుర్గం -
చంద్రగిరి కొండ.. అంతుచిక్కని ఎన్నో వింతలు, విశేషాలు
చంద్రగిరి(తిరుపతి జిల్లా): అబ్బుర పరిచే బురుజులు.. శత్రుదుర్భేద్యమైన కట్టడాలు.. మహావిష్ణువు దశావతారాలతో కూడిన శిల్పకళలలు.. సకల దేవతల ప్రతిమలతో నిర్మించిన మండపాలు.. ఒకే బండ నుంచి వచ్చే ఊటలో వేర్వేరు రుచులు.. భటుల విశ్రాంతి కోసం ప్రత్యేక ఆవాసాలు.. ఆశ్చర్యపరుస్తున్న రాతికంచాలు.. అంతుచిక్కని కోనేటి అందాలు.. ఇవీ చంద్రగిరి దుర్గం కోటని అద్భుత దృశ్యాలు.. శ్రీకృష్ణదేవరాయల నాటి శిల్పకళా సౌందర్యాలు, వింతలు, విశేషాలపై ఈ ఆదివారం ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. చదవండి: సాగర గర్భంలో పర్యాటకం చంద్రగిరి రాయలవారికోట ముందు భాగంలో ఉన్న ఎత్తైన కొండనే చంద్రగిరి దుర్గంగా పిలుస్తుంటారు. శ్రీకష్ణదేవరాయల వారు చంద్రగిరి కోటపై శత్రుమూకలు దాడులకు తెగబడకుండా ఉండేందుకు, ముష్కరుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు ఈ కొండను ఎంచుకున్నారు. కోట నుంచి దుర్గం కొండకు చేరుకునేలా నాడు ఐదు కిలోమీటర్ల దూరం దట్టమైన అటవీ ప్రాంతంలో దారిని ఏర్పాటు చేశారు. ఈ కొండపైకి వెళ్లే మార్గంలో నాటి రాజసం, వారి శిల్పాకళాకృతులు నేటికీ సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. శ్రీవారిపై అచెంచలమైన భక్తితో రాయలవారు రెండవ రాజధాని అయిన చంద్రగిరిలో అనేక కట్టడాలు నిర్మించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించినప్పుడు ఆయన ఇక్కడే విడిది చేసేవారు. గుర్రాల విశ్రాంతి కోసం నిర్మించిన చావిడి నిరంతరం నిఘా దుర్గం కొండపైకి చేరుకోగానే మనకు కనిపించేది శత్రువుల జాడ కోసం సైనికులు కాపాలాకాసేందుకు ఏర్పాటు చేసిన ఎత్తైన మండపం. అన్ని వేళల్లో ఇక్కడి నుంచే రాజ్యాన్ని పరిరక్షించేవారు. వర్షాకాలంలోనూ విడిది చేసేందుకు మండపం కింద భటులు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అబ్బురపరిచే కోనేరు వందల అడుగుల ఎత్తుతో ఉన్న దుర్గం కొండపైకి చేరుకోగానే.. అబ్బురపరిచే కోనేరు దర్శనమిస్తుంది. ఇది కేవలం వర్షపు నీటి ఆధారంగా ఉంటుంది. ఏడు నులక మంచాల దారాలంత లోతు ఉంటుందని చెబుతారు. అయితే ఇంత వరకు కోనేటి లోతును ఎవరూ అంచనా వేయలేదు. సైనికుల బసకు ప్రత్యేక మండపాలు రాయలవారి సామ్రాజ్యాన్ని రక్షించుకునేందుకు దుర్గం కొండపై నిత్యం భటులు షిఫ్ట్‌ల పద్ధతిలో విధులు నిర్వహించే వారు. వీరి విడిది కోసం రాయలవారు ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేశారు. కొండపై మట్టి, రాళ్లు లభించకపోయినప్పటికీ ఇంత పెద్ద మండపాలను ఎలా నిర్మించారో అన్న సందేహం కలగకమానదు. అదేవిధంగా గుర్రాల కోసం మండపాలను సైతం దుర్గం కొండపై నిర్మించడం నాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. బురుజు దాటిన తర్వాత మొదటగా కనిపించే మండపం నాటి ఉరికొయ్యే–నేటి ఉరిబండ చంద్రగిరి కోటలోకి ప్రవేశించే మార్గంలో కుడివైపున మనకు పెద్ద బండరాయి కనిపిస్తుంది. దానిపై ఉరికొయ్యిని రాయలవారు ఏర్పాటు చేశారు. తీవ్రవాదులు, ముష్కరులు, నేరస్థులను రాజ్యంలోని ప్రజలందరి ముందు ఆ బండపై ఉన్న ఉరికొయ్యిపై ఉరితీసేవారు. అయితే కొంత మంది వాటిని గంటా మండపంగా పిలుస్తుంటారు. తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టి గంట మోగిస్తారు. అ శబ్దం విన్న తర్వాత బండపై గంట మోగించడం ద్వారా రాయలవారు భోజనం చేసేవారని మరో వాదన వినిపిస్తోంది. పూర్తిగా నిషేధం దుర్గం కొండపైకి వెళ్లేందుకు కేంద్ర పురావస్తుశాఖ నిషేధం విధించింది. పూరి్వకుల ఆస్తులను పరిరక్షించేందుకు కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారిని కాదని అక్కడకు వెళ్లేందుకు యత్నిస్తే జైలు తప్పదు సుమీ. విశాలమైన కోనేరు ఉప్పు సట్టి–పప్పు సట్టి దుర్గం కొండకు పడమటి భాగంలో ఉప్పుసట్టి–పప్పుసట్టి ఉంది. ఇక్కడ ఒక బండలో నుంచి ఊటవస్తూ ఉంటుంది. లోపలికి వెళ్లిన తర్వాత నాలుగు ఇంచుల మందంతో ఒక చిన్న గోడ కనిపిస్తుంది. గోడకు ఇటువైపు ఉండేది పప్పు సట్టిగాను, అటువైపు ఉండేది ఉప్పు సట్టిగాను పిలుస్తుంటారు. పప్పుసట్టిలోని నీళ్లు తియ్యగా, ఉప్పు సట్టిలోని నీళ్లు ఉప్పగా ఉంటాయి. దుర్గం కొండపై రాతికంచాలు రాతి కంచాల్లోనే భోజనాలు దుర్గం కొండపై కాపాలాగా ఉండే సైనికులు రాతి కంచాల్లోనే భోజనాలు చేసేవారిని తెలుస్తోంది. కోనేటి నుంచి పది అడుగుల దూరంలోని బండపై అడుగున్నర వెడల్పుతో అంగుళం లోతుతో గుండ్రటి కంచాలు కనిపిస్తాయి. వీటికి రెండువైపులా కూరలను ఉంచుకునేందుకు చెక్కిన తీరు ఆశ్చర్యమేస్తోంది. భటులందరూ వీటిపైనే భోజనాలు చేసుకుని, కోనేటిలోని నీటిని తాగేవారు. దుర్గం కొండకు వెళ్లే మార్గంలో నిర్మించిన భారీ ప్రహరీగోడ అక్కగార్లు, నాగాలమ్మకు పూజలు కోనేటి నుంచి కాసింత దూరం నడుచుకుంటూ వేళ్తే మనకు అక్కగార్ల దేవతలు, నాగాలమ్మ విగ్రహాలు కనిపిస్తాయి. నాగాలమ్మ ఆలయం వద్ద ఉన్న నీటిలో కర్పూరం వెలిగితే, అది రగులుతూ లోపలకి వెళ్లడం అక్కడి అమ్మవారి శక్తికి ప్రతిరూపంగా నిలుస్తోంది. భటుల విశ్రాంతి కోసం కొండపై నిర్మించిన ప్రత్యేక మండపాలు -
ఆటో బోల్తా : వృద్ధుడి దుర్మరణం
నార్పల : ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయాలపాలైన సంఘటన ఆదివారం మండలంలోని దుర్గం గ్రామ సమీపంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఓ ఆటో ప్రయాణికులతో దుర్గం నుంచి అనంతపురం వైపు వెళ్తోంది. ఈ క్రమంలో ఆటో అతి వేగంగా వెలుతూ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో అనంతపురంలోని పాతపూరుకు చెందిన కొండన్న(65) తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఇటుకలపల్లి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.