
'సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.50 కోట్లు'
సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కావాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
హైదరాబాద్: సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కావాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సీసీ పుటేజీ ఆధారంగా అనేక కేసులు ఛేదించామని చెప్పారు. కొత్తగా సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.50 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు.
ఏడాది సైబరాబాద్ పరిధిలో 2 వేల కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఐటీ కారిడార్ లో ప్రస్తుతం 40 కెమెరాలు ఉన్నాయని, మరో 85 ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 1000 జంక్షన్లు, 10 హైవేలను కవర్ చేసేలా కెమెరాలు పెడతామని ఆనంద్ తెలిపారు.