పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్ట్! | Junior Artist arrested in cyberabad SOT raids | Sakshi
Sakshi News home page

పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్ట్!

Published Tue, Jun 17 2014 2:06 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

Junior Artist arrested in cyberabad SOT raids

హైదరాబాద్: నగరంలో సైబరాబాద్ పోలీసులు జరిపిన దాడుల్లో ఓ జూనియర్ ఆర్టిస్టును, ఇద్దరు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో వ్యభిచారం జరుగుతోందని పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఉప్పల్, భరత్‌నగర్‌ ప్రాంతాల్లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తూ అనూష అనే జూనియర్ ఆర్టిస్టుతోపాటు, ఇద్దరు విటులను స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ పట్టుకున్నారు. 
 
ఇటీవలి కాలంలో ఎక్కువగా శివారు ప్రాంతాల్లోనే ఈ తరహా కార్యకలాపాలు సాగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులందుతున్నాయి. ఉప్పల్, భరత్ నగర్ తోపాటు ఇతర ప్రాంతాల్లో పోలీసుల నిఘా చాలా తక్కువగా ఉంటుందని వ్యభిచార ముఠాలు ఈ ప్రాంతాలను ఎంచుకుంటున్నట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement