Special Operating Team
-
HYD: బర్త్‌డే పార్టీలో డ్రగ్స్.. గంజాయితో మరో బ్యాచ్
హైదరాబాద్, సాక్షి: నగరంలో మరోసారి మాదకద్రవ్యాల ముఠాల గుట్టు రట్టు అయ్యింది. పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడ్డారు పలువురు. విద్యార్థులే లక్ష్యంగా.. గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి మరీ కేటుగాళ్లు ఈ దందా నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సనత్‌నగర్‌లో డ్రగ్స్ పార్టీ సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్వోటీ(Special Operation Team) బృందం దాడులు జరిపింది. ఈ తనిఖీల్లో MDMA(methylenedioxy-methylamphetamine)తో పట్టుబడ్డారు యువకులు. మొత్తం 4 గ్రాముల MDMA, 5 గ్రాముల గంజాయి తో పాటు OCB ప్లేవర్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది ఎస్ఓటీ బృందం. ఈ దాడులకు సంబంధించి ఐదుగురు యువకుల్ని అరెస్ట్ చేసింది. మరోవైపు.. మేడ్చెల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో గంజాయి బ్యాచ్‌ను పోలీసులు పట్టుకున్నారు. రూ. 33,750 విలువ గల 1.35కేజీల గంజాయి సీజ్ చేశారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బుల సంపాదన ఆశతో గంజాయి దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో.. ఒడిషాకు చెందిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు మేడ్చెల్ ఎస్వోటీ పోలీసులు. వీళ్లంతా నగరంలో సెంట్రింగ్ వర్క్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్ట్!
-
పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్ట్!
హైదరాబాద్: నగరంలో సైబరాబాద్ పోలీసులు జరిపిన దాడుల్లో ఓ జూనియర్ ఆర్టిస్టును, ఇద్దరు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో వ్యభిచారం జరుగుతోందని పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఉప్పల్, భరత్‌నగర్ ప్రాంతాల్లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తూ అనూష అనే జూనియర్ ఆర్టిస్టుతోపాటు, ఇద్దరు విటులను స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ పట్టుకున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా శివారు ప్రాంతాల్లోనే ఈ తరహా కార్యకలాపాలు సాగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులందుతున్నాయి. ఉప్పల్, భరత్ నగర్ తోపాటు ఇతర ప్రాంతాల్లో పోలీసుల నిఘా చాలా తక్కువగా ఉంటుందని వ్యభిచార ముఠాలు ఈ ప్రాంతాలను ఎంచుకుంటున్నట్లు తెలిసింది.