Cyberabad: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్‌ వేటు.. కారణం ఇదే.. | Suspension Of Two Inspectors In Cyberabad | Sakshi
Sakshi News home page

సైబరాబాద్‌: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్‌ వేటు.. కారణం ఇదే..

Published Thu, Dec 28 2023 12:49 PM | Last Updated on Thu, Dec 28 2023 2:59 PM

Suspension Of Two Inspectors In Cyberabad - Sakshi

సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు కమిషనర్‌ అవినాష్‌ మహంతి. తాజాగా కేపీహెచ్‌బీ పరిధిలో సీఐ వెంకట్, ఆర్జీఐ సీఐ శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు  గురి చేశారనే ఆరోపణల నేపథ్యంలో సీపీ వీరిని సస్పెండ్‌ చేశారు.

వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ పరిధిలో ఓ కేసులో ఎంక్వయిరీ నిమిత్తం ప్రణీత్ అనే యువకుడిని స్టేషన్‌కు తీసుకువచ్చి దారుణంగా కొట్టడమే కాకుండా థర్ద్ డిగ్రీ ఉపయోగించారని బాధితుడు ఆరోపించాడు. ఈ విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్లారు బాధితుడి కుటుంబ సభ్యులు. తీవ్రమైన గాయాలతో కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని.. అనంతరం గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 

దీంతో, వెంటనే సీపీ విచారణకు ఆదేశించారు. దీనిపై దర్యాప్తు జరిపి పూర్తి స్థాయిలో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే వీరిని సస్పెండ్‌ చేశారు. ఒకే కేసులో సరిగా విచారణ చేయనందుకే శ్రీనివాసులను సస్పెండ్‌ చేసినట్టు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement