ప్రజలకు మరింత చేరువ | Police services Reach more people | Sakshi

ప్రజలకు మరింత చేరువ

Dec 31 2016 3:44 AM | Updated on Apr 3 2019 8:28 PM

ప్రజలకు మరింత చేరువ - Sakshi

ప్రజలకు మరింత చేరువ

సైబరాబాద్ పరిధిలో పోలీసుల సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.

 చేవెళ్ల రూరల్: సైబరాబాద్ పరిధిలో పోలీసుల సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో మంగళవారం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సందీప్‌శాండిల్య, డీసీపీ పద్మాజారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కొనసాగుతోందన్నారు. చేవెళ్ల డీఎస్పీ కార్యాలయ స్థానంలో ఏసీపీ కార్యాలయం కొనసాగుతుందన్నారు. అంతకుముందు సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, డీసీపీ పద్మాజారెడ్డి చేవెళ్ల పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.
 
  అక్కడికి వచ్చిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులతో సీపీ మాట్లాడి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా నగరానికి కూరగాయలను తీసుకొని వెళ్తుంటారని, వారి వాహనాల్లో తిరిగి వచ్చే సమయంలో పోలీసులు జరిమానాలు విధిస్తున్నారని సీపీకి వారు వివరించారు. రైతులకు మినహారుుంపు ఇవ్వాలని ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు గంగారెడ్డి, శృతకీర్తి, ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, జేడ్పీటీసీ సభ్యురాలు శైలజ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ దేవుని విజయలక్ష్మి, శర్వలింగం, వైస్ చైర్మన్ మానిక్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement