ముగ్గురు పోలీసు అధికారుల రిటైర్మెంట్
Published Thu, Sep 29 2016 4:30 PM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
హైదరాబాద్: సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషరేట్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు పోలీసు అధికారులు గురువారం పదవీ విరమణ చేశారు. మియాపూర్ ట్రాఫిక్ ఎస్‌ఐ ఎం.రాంచందర్, ఎల్‌బీనగర్ ట్రాఫిక్ ఏఎస్‌ఐ బి.వీరేశం, కార్ అంబర్‌పేటలోని ఏఆర్‌హెచ్‌సీ ఎం.జగన్ రెడ్డిల పదవీ విరమణ చేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కమిషనర్ సందీప్ శాండిల్యా సన్మానించారు. స్పెషల్ పోలీసు ఆఫీసర్లుగా పనిచేయాలని ఈ సందర్భంగా కమిషనర్ వారిని కోరారు.
Advertisement
Advertisement