సైబరాబాద్‌లో 110 ‘నిర్భయ’ కేసులు | 110 nirbhaya cases in Cyberabad | Sakshi
Sakshi News home page

సైబరాబాద్‌లో 110 ‘నిర్భయ’ కేసులు

Published Mon, Dec 16 2013 1:49 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్భయ చట్టం కింద ఈ ఏడాది 110 కేసులు నమోదయ్యాయి.

సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్భయ చట్టం కింద ఈ ఏడాది 110 కేసులు నమోదయ్యాయి. గతేడాది డిసెంబర్ 16న ఢిల్లీ బస్సులో ప్రయాణిస్తున్న మెడికల్ విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన యావత్‌దేశాన్ని కదిలించిం ది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలన్న ఉద్దేశంతో కొత్తగా నిర్భయ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సైబరాబాద్‌లో 110 కేసులు నమోదయ్యా యి.
 
  సైబరాబాద్‌లో మొత్తం 40 శాంతిభద్రతల పోలీసుస్టేషన్లు ఉండగా.. వీటిలో 26 ఠాణాల్లో ‘నిర్భయ’ కేసులు నమోదయ్యాయి.  హయత్‌నగర్, మంచాల, యాచారం, నా ర్సింగి, మైలార్‌దేవులపల్లి, మొయినాబాద్, శామీర్‌పేట, మియాపూర్, అల్వాల్, కుషాయిగూడ, కీసర, ఉప్పల్, ఘట్‌కేసర్, మేడిపల్లి ఠాణాల్లో ఈ చట్టం కింద ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. లైంగిక దాడి ఘటనల్లో మహిళలు, బాలికల్లో ఆత్మస్థైర్యం పెంపొం దించేందుకు మహిళా పోలీసు అధికారులతో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. బాధితులు కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండేం దుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే బాధితులు అందరి ముందు కోర్టుకు హాజరయ్యే పరిస్థితి తొలగిపోతుంది.  ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు హాజరై తమకు జరిగిన ఘోరం గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడ మీడియాతో పాటు ఇతరులెవ్వరినీ అనుమతించరు కాబట్టి.. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా న్యాయమూర్తికి చెప్పుకోగలుగుతారు.
 
 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు వస్తే చాలా మంచిది: బాధితులు
 లైంగిక దాడి ఘటనల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తే బాధితులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇలాంటి కోర్టులకు రావడానికి బాధితులకు ఎలాంటి ఇబ్బందులుండ వ్. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల వల్ల విచారణ త్వరగా పూర్తైనిందితులకు త్వరగా శిక్షపడుతుంది.
 
 శిక్ష పడే విధంగా చార్జిషీట్లు:
 నిర్భయ చట్టం కింద నమోదైన కేసులో కఠినంగా వ్యవహరిస్తాం. నిందితులకు శిక్ష పడే విధంగా సాక్ష్యాలను సేకరించి, సకాలంలో ఛార్జిషీట్లు వేస్తాం.  మహిళలు, బాలికపై లైంగిక దాడి జరిగినప్పుడు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. పరువు పోతుందనే భయంతో కొందరు ఫిర్యాదు చేయడంలేదు. అలాంటి వారికి మహిళా పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తాం.     
             - సీవీ ఆనంద్, పోలీసు కమిషనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement