నా కోరిక తీర్చు
► ఇద్దరిపై నిర్భయ కేసు
► వివాహితను వేధించిన యువకులు
జమ్మికుంట: వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఓ వివాహితను లైంగింకంగా వేధించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఇరువురిపై నిర్భయ కేసు నమోదుచేశారు. జమ్మికుంట టౌన్ సీఐ పింగిళి ప్రశాంత్‌రెడ్డి కథనం.. పట్టణంలోని ఐబీ అతిథి గృహం సమీపంలో గణేశ్‌నగర్‌కు చెందిన భార్యాభర్తలు హోటల్ నడుపుకుంటున్నారు. వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన తడిగొప్పుల రవి హోటల్‌కు వ చ్చిన సమయంలో హోటల్ యాజమాని భార్య ఫోన్‌నంబర్ ఆమెకు తెలియకుండా తీసుకున్నాడు. ఆ మరుసటి రోజు నుంచి ఆమెకు ఫోన్ చేసి వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు.
ఈనెల 6న సాయంత్రం తన స్నేహితుడు చిట్టిరెడ్డి సురేష్‌ను వెంటపెట్టుకొని బైక్‌పై వచ్చాడు. బైక్ ఎక్కాలంటూ బెదిరించాడు. కోరిక తీర్చాలంటూ వేధించాడు. ఇదే సమయంలో భర్త రావడంతో విషయం చెప్పి రవి, సురేష్‌లను పట్టుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఇరువురు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లైగింకంగా వేధించిన రవి, సురేష్‌లపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. నిందుతులు పరార్‌లో ఉన్నారని చెప్పారు.