Forex Trading
-
ట్రేడింగ్ చేస్తున్నారా? ఆర్బీఐ హెచ్చరిక
ముంబై: అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది. ఈ మేరకు ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల అలర్ట్ లిస్ట్‌లో మరో 13 కంపెనీలను జోడించింది. తద్వారా అలర్ట్ లిస్ట్‌లో చేరిన కంపెనీల సంఖ్య 88కి చేరుకుంది.రేంజర్ క్యాపిటల్, టీడీఎఫ్ఎక్స్, ఐనెఫెక్స్, యార్కర్ఎఫ్ఎక్స్, గ్రోలైన్, థింక్ మార్కెట్స్, స్మార్ట్ ప్రాప్ ట్రేడర్, ఫండెడ్నెక్ట్స్, వెల్ట్రేడ్, ఫ్రెష్ఫారెక్స్, ఎఫ్ఎక్స్ రోడ్, డీబీజీ మార్కెట్స్, ప్లస్వన్ట్రేడ్ వీటిలో ఉన్నాయి. అలర్ట్ లిస్ట్ సమగ్రమైనది కాదని, జాబితాలో లేనంత మాత్రాన ఆ కంపెనీని అధీకృతమని భావించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్‌పై భారీ జరిమానాఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్–1999 (ఫెమా) ప్రకారం ఫారెక్స్‌లో డీల్ చేయడానికి అధికారం లేని లేదా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ (రిజర్వ్ బ్యాంక్) ఆదేశాలు–2018 ప్రకారం ఫారెక్స్ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ (ఈటీపీ) ఆపరేట్ చేయడానికి అధికారం లేని కంపెనీల పేర్లను అలర్ట్ లిస్ట్‌లో చేరుస్తారు. -
టీపీ గ్లోబల్ కేసు: భారీగా నగలు,నగదు, లగ్జరీ కార్లు సీజ్
TP Global FX: టీపీ గ్లోబల్ ఎఫ్ఎక్స్ ఫారెక్స్ ట్రేడింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ ఆరోపణల కింద అహ్మదాబాద్‌లో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు మంగళవారం అధికారిక ప్రకటన తెలిపింది. ఈ సోదాల్లో వివిధ నేరారోపణ పత్రాలు, భారీ ఎత్తున నగదు, నగలు, విలువైన కార్లను స్వాధినంచేసుకుంది. (Jio AirFiber: జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసింది..లాంచింగ్ ధర, ఆఫర్లు) టీపీ గ్లోబల్ ఎఫ్ఎక్స్ అక్రమ ఫారెక్స్ ట్రేడింగ్‌కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఈ దాడులు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 ప్రకారం రూ. 1.36 కోట్లు, 1.2 కిలోల బంగారం (సుమారు రూ. 71 లక్షలు), రెండు లగ్జరీ వాహనాలు, హ్యుందాయ్ ఆల్కాజర్ , మెర్సిడెస్ GLS 350D (సుమారు రూ. 89 లక్షలు) కార్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు, బ్యాంక్ ఖాతాలో రూ. 14.72 లక్షలు స్తంభింప జేశామని ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు రూ.242.39 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు లేదా అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. (గణపయ్యకు ఈ ఏడాది అంబానీ అదిరిపోయే గిఫ్ట్) ఇప్పటికే ఈ కేసులో టీపీ గ్లోబల్ ఎఫ్ఎక్స్ కంపెనీ ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారంటూ ప్రసేన్‌జిత్ దాస్, శైలేష్ పాండే, తుషార్ పటేల్ ఆరోపణలు నమోదైనాయి.డమ్మీ కంపెనీలు/సంస్థలు/ఎంటిటీలద్వారా ఫారెక్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో మోసగించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. గతంలో అరెస్ట్ అయిన వీరు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పటికే రూ.118.27 కోట్ల విలువైన స్థిరాస్తులను హోటల్ రిసార్ట్స్, వాహనాలు, అటాచ్ చేసింది. ED has conducted search operations in Ahmedabad under the provisions of PMLA, 2002 in case of illegal Forex Trading by TP Global FX. During the search, various incriminating documents, cash amounting to Rs 1.36 Crore, 1.2 Kg of Gold (Approx Rs 71 Lakh), two Luxury Vehicle namely… pic.twitter.com/QQFczwKvJ9 — ED (@dir_ed) September 19, 2023 -
ఫారెక్స్ ట్రేడింగ్‌పై ఆర్బీఐ హెచ్చరికలు
ముంబై: దేశీయంగా ఫారెక్స్‌లో లావాదేవీలు నిర్వహించేందుకు అధికారిక అనుమతులులేని సంస్థల జాబితాను ఆర్బీఐ తాజాగా విడుదల చేసింది. వీటిపట్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా హెచ్చరించింది. అక్టాఎఫ్ఎక్స్, అల్పారి, హాట్ఫారెక్స్, ఒలింప్ ట్రేడ్సహా మొత్తం 34 సంస్థలతో జాబితాను ప్రకటించింది. ఫారెక్స్‌లో లావాదేవీలు చేపట్టడం, ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణకు వీటికి అధికారిక అనుమతులులేవని తెలియజేసింది. అధీకృత వ్యక్తుల ద్వారా మాత్రమే విదేశీ మారక చట్ట(ఫెమా) నిబంధనల ప్రకారం అనుమతించిన కారణాలతో ఫారెక్స్ లావాదేవీలు చేపట్టవచ్చని వివరించింది. ఇలాకాకుండా అనధికారికంగా ఫారెక్స్ లావాదేవీలు చేపట్టిన వారు ఫెమా చట్టం ప్రకారం న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ఫారెక్స్‌లో డీల్ చేసేందుకు అధీకృతంకాని సంస్థలతో తమ వెబ్సైట్లో అలర్ట్ లిస్ట్‌ను ఉంచేందుకు నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలియజేసింది. జాబితాలో ఫారెక్స్4మనీ,ఈటోరో,ఎఫ్ఎక్స్సీఎం,ఎన్టీఎస్ ఫారెక్స్ ట్రేడింగ్,అర్బన్ ఫారెక్స్,ఎక్స్ఎమ్ తదితరాలున్నాయి. -
అయ్యో రూపాయి! వరుసగా మూడోరోజూ క్రాష్..!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి పతనం కొనసాగుతోంది. మంగళవారం మరో 16 పైసలు క్షీణించి 75.52 వద్ద ముగిసింది. రూపాయికిది వరసగా మూడోరోజూ నష్టాల ముగింపు కాగా.., మొత్తం 73 పైసలు పతనమైంది. ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం ఉదయం 75.41 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 75.66 వద్ద కనిష్టాన్ని 75.16 గరిష్టాన్ని తాకింది. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ కొన్నేళ్ల గరిష్టస్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ 1.6% పెరిగింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల స్థాయిని దాటింది. ఈ అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడిని పెంచాయి. స్వల్పకాలం పాటు రూపాయి 74.90 – 75.80 పరిధిలో ట్రేడ్ అవ్వొచ్చు’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ హెడ్ శ్రీరామ్ అయ్యర్ తెలిపారు. గతేడాది(202) ఏప్రిల్‌లో రూపాయి 76.87 స్థాయి వద్ద జీవితకాల కనిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. చదవండి: Economy: ఎకానమీలో వెలుగు రేఖలు -
ఆన్లైన్ మోసం: ఐదుకోట్లు హాంఫట్
సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో మోసానికి పాల్పడిన ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో నలుగురు వ్యక్తులు కలిసి దేశ వ్యాప్తంగా 120 మంది నుంచి 5 కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఓ మహిళ వీరి వద్ద 7.26,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి మోసపోయింది. ఇన్వెస్ట్మెంట్ అంతా హవాలా రూపంలో జరిగింది. సదరు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేసి నిందితులను పట్టుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుల నుంచి 13 లక్షల రూపాయలు, ఒక ల్యాప్‌టాప్, 6 సెల్పోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ట్రేడింగ్ సెంటర్స్ ద్వారా వచ్చే బల్క్ ఎస్ఎంఎస్ల పట్ల జాగ్రత్తగా మెలగాలని, సీఐబీఐలో రిజిస్టర్ అయిన వాళ్ల దగ్గర మాత్రమే పెట్టుబడులు పెట్టాలని సూచించారు. -
‘డబుల్’ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: వారం కాదు.. నెల కాదు.. ఏడాది కాదు... కేవలం 24 గంటలు...ఫారెక్స్ ట్రేడింగ్ ద్వారా ఒక్క రోజులో పెట్టుబడి రెట్టింపు అవుతుందట! ఇలా చెప్పిన ఉత్తరాది వ్యక్తులు నగరవాసికి రూ.11 లక్షల టోకరా వేశారు. ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ) వస్తున్న వడ్డీతో జీవిస్తున్న అతను వాటిపైనే రుణం తీసుకుని సైబర్ నేరగాళ్లకు అప్పగించాడు. చివరకు మోసపోయానని గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో గురువారం కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ కేసు దర్యాప్తు చేపట్టారు. నగరానికి చెందిన మరియాదాస్ ఫ్రాన్సిస్ జయరాజ్ గతంలో ఓ చిన్న తరహా పరిశ్రమ నిర్వహించారు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని కొన్ని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ప్రస్తుతం వాటిపై వచ్చే వడ్డీతో జీవించడంతో పాటు కొన్ని రకాలైన మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులూ పెట్టారు. ఆగస్టు 14న అతడికి రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి. సూరత్‌కు చెందిన క్రిస్టోఫర్, ముంబై వాసి షా పేరుతో పరిచయం చేసుకున్న వారు జయరాజ్‌ను క్రిస్టల్స్ ట్రేడర్స్ ద్వారా ఫారెక్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టాలని కోరారు. రూ.12.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే కేవలం 24 గంటల్లో ఆ మొత్తం రెట్టింపు అవుతుందంటూ ఆశపెట్టారు. ఆసక్తి చూపిన జయరాజ్ తన వద్ద అంత మొత్తం లేదని, ఎఫ్డీలపై రూ.10 లక్షల వరకు మాత్రమే రుణం వస్తుందని చెప్పాడు. అనేక బేరసారాల తర్వాత ఆ మొత్తం పెట్టుబడిగా పెట్టడానికి సైబర్ నేరగాళ్లు అంగీకరించారు. తొలుత ప్రాసెసింగ్ ఫీజుగా రూ.లక్ష చెల్లించాలని, ఆపై రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని చెప్పడంతో జయరాజ్ అందుకు సమ్మతించాడు. సైబర్ నేరగాళ్లు వివరాలు అందించిన ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతా క్రిస్టల్ ట్రేడర్స్ పేరుతోనే ఉంది. జయరాజ్ ఆగస్టు 18న రూ.లక్ష, 28న రూ.10 లక్షలు ఆ ఖాతాలో డిపాజిట్ చేశాడు. మోసగాళ్లు చెప్పినట్లు 24 గంటలు దాటిన తర్వాత వారికి ఫోన్ చేయగా, అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇలా నెల రోజులైనా ఎలాంటి ఫలితం లేకపోవడంతో జయరాజ్ గురువారం సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ బాధితుడు నగదు డిపాజిట్ చేసిన ఖాతా గుజరాత్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమికంగా ఇది మెట్రో నగరాల్లో ఉంటున్న నైజీరియన్లు చేసిన పనిగా అనుమానిస్తున్నారు. -
కరెన్సీ మోసం జరిగింది కెయిర్న్ డీల్లోనే!!
-
కరెన్సీ మోసం జరిగింది కెయిర్న్ డీల్లోనే!!
♦ ఇద్దరు హెచ్ఎస్బీసీ అధికార్లపై కేసులు ♦ లావాదేవీకి ముందే పౌండ్ల కొనుగోలు లండన్: బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం ‘హెచ్ఎస్బీసీ’కి సంబంధించిన 3.5 బిలియన్ డాలర్ల ఫారెక్స్ ట్రేడింగ్ మోసంలో భారతీయ కంపెనీ లింకులు బయటపడ్డాయి. ఫారెక్స్ మోసానికి సంబంధించి బ్యాంక్‌కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లపై అభియోగాలు నమోదయ్యాయి. ఒక కంపెనీ (క్లయింట్) తన భారతీయ వ్యాపారాన్ని వేరొక కంపెనీకి విక్రయించిన ఘటనలో వీరిద్దరూ ఆ క్లయింట్‌ను మోసం చేశారనేది ప్రధాన అభియోగం. ఆ క్లయింట్ ఎవరన్నది అధికారికంగా బయటపడకపోయినా యూకే మీడియా నివేదికల ప్రకారం అది కెయిర్న్ ఎనర్జీగా వెల్లడవుతోంది. ఇది 2010లో కెయిర్న్ ఇండియాలోని తన వాటాను 3.5 బిలియన్ డాలర్లకు వేదాంతాకు విక్రయించింది. దీంతో ఈ కొనుగోలు లావాదేవీకి సంబంధించి కెయిర్న్ ఎనర్జీ... హెచ్ఎస్బీసీని ఫారెక్స్ కన్వర్టర్గా (3.5 బిలియన్ డాలర్లని పౌండ్లలోకి మార్చడానికి) నియమించుకుంది. దీన్ని గురించి తెలిసిన హెచ్ఎస్బీసీ ఫారెక్స్ ట్రేడింగ్ విభాగం హెడ్ మార్క్ జాన్సన్, హెచ్ఎస్బీసీ మాజీ ఉద్యోగి స్ట్రాట్ స్కాట్ దీనిద్వారా లబ్ధి పొందాలనుకున్నారు. లావాదేవీ జరగటానికి ముందే భారీగా పౌండ్లను కొనుగోలు చేశారు.