
ముంబై: దేశీయంగా ఫారెక్స్‌లో లావాదేవీలు నిర్వహించేందుకు అధికారిక అనుమతులులేని సంస్థల జాబితాను ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసింది. వీటిపట్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా హెచ్చరించింది. అక్టాఎఫ్‌ఎక్స్, అల్పారి, హాట్‌ఫారెక్స్, ఒలింప్ ట్రేడ్‌సహా మొత్తం 34 సంస్థలతో జాబితాను ప్రకటించింది. ఫారెక్స్‌లో లావాదేవీలు చేపట్టడం, ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణకు వీటికి అధికారిక అనుమతులులేవని తెలియజేసింది.
అధీకృత వ్యక్తుల ద్వారా మాత్రమే విదేశీ మారక చట్ట(ఫెమా) నిబంధనల ప్రకారం అనుమతించిన కారణాలతో ఫారెక్స్ లావాదేవీలు చేపట్టవచ్చని వివరించింది. ఇలాకాకుండా అనధికారికంగా ఫారెక్స్ లావాదేవీలు చేపట్టిన వారు ఫెమా చట్టం ప్రకారం న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ఫారెక్స్‌లో డీల్ చేసేందుకు అధీకృతంకాని సంస్థలతో తమ వెబ్‌సైట్‌లో అలర్ట్ లిస్ట్‌ను ఉంచేందుకు నిర్ణయించినట్లు ఆర్‌బీఐ తెలియజేసింది. జాబితాలో ఫారెక్స్4మనీ,ఈటోరో,ఎఫ్‌ఎక్స్‌సీఎం,ఎన్‌టీఎస్ ఫారెక్స్ ట్రేడింగ్,అర్బన్ ఫారెక్స్,ఎక్స్‌ఎమ్ తదితరాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment