న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లోకి ఈ–లూనా అడుగు పెట్టింది. కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ఆవిష్కరించారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ–లూనా ఎలక్ట్రిక్ రవాణాకు వీలు కలి్పస్తుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష ఈ–లూనాలను విక్రయించనున్నట్టు కినెటిక్ గ్రీన్ వ్యవస్థాపకురాలు, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ తెలిపారు.
బీటూబీ కస్టమర్లు, ఈ–కామర్స్ సంస్థల నుంచి మంచి స్పందన వచ్చిందని, వారికి 50,000 యూనిట్లు విక్రయిస్తామనే అంచనాతో ఉన్నట్టు చెప్పారు. ఈ–లూనా ఆరంభ ధర రూ.69,990 (ఎక్స్‌షోరూమ్). 2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీతో వచ్చే ఈ–లూనా ఒక్కసారి చార్జింగ్‌తో 110 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల టర్నోవర్ సాధించాలని.. ఇందులో రూ.800 కోట్ల ఆదాయం ఈ–లూనా నుంచే వస్తుందన్న అంచనాతో కంపెనీ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment