kinetic Group
-
ఈ–లూనా వచ్చేసింది
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లోకి ఈ–లూనా అడుగు పెట్టింది. కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ఆవిష్కరించారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ–లూనా ఎలక్ట్రిక్ రవాణాకు వీలు కలి్పస్తుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష ఈ–లూనాలను విక్రయించనున్నట్టు కినెటిక్ గ్రీన్ వ్యవస్థాపకురాలు, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ తెలిపారు. బీటూబీ కస్టమర్లు, ఈ–కామర్స్ సంస్థల నుంచి మంచి స్పందన వచ్చిందని, వారికి 50,000 యూనిట్లు విక్రయిస్తామనే అంచనాతో ఉన్నట్టు చెప్పారు. ఈ–లూనా ఆరంభ ధర రూ.69,990 (ఎక్స్‌షోరూమ్). 2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీతో వచ్చే ఈ–లూనా ఒక్కసారి చార్జింగ్‌తో 110 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల టర్నోవర్ సాధించాలని.. ఇందులో రూ.800 కోట్ల ఆదాయం ఈ–లూనా నుంచే వస్తుందన్న అంచనాతో కంపెనీ ఉంది. -
చల్ మేరి ఈ–లూనా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లూనా.. చాలా మందికి సుపరిచితమైన చిన్న మోపెడ్. చల్ మేరీ లూనా పేరుతో మధ్య తరగతికి దగ్గరైంది. కొద్ది రోజుల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ రూపంలో భారత రోడ్లపై పరుగుపెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న కినెటిక్ గ్రీన్ ఈ–లూనా అభివృద్ధి చేసింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ ప్రారంభం. ఫిబ్రవరి నుంచి మార్కెట్లో ఈ వాహనం దూసుకెళ్లనుంది. కంపెనీ వెబ్సైట్ ద్వారా రూ.500 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. నెలకు 5,000 యూనిట్లను విక్రయించాలన్నది సంస్థ టార్గెట్. మూడు బ్యాటరీ ప్యాక్‌లలో రంగ ప్రవేశం చేయనుంది. తొలుత 2 కిలోవాట్ అవర్ వేరియంట్ రానుంది. ఒకసారి చార్జింగ్‌తో 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 150 కిలోల బరువు మోయగలదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం 40–45 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో మరో వేరియంట్ పరిచయం చేస్తారు. అలాగే 100–125 కిలోమీటర్లు ప్రయాణించగలిగే 3 కిలోవాట్ అవర్ బ్యాటరీతోనూ వేరియంట్ రంగ ప్రవేశం చేయనుంది. వచ్చే మూడేళ్లలో సామర్థ్యం పెంపు, కొత్త మోడళ్లకై కినెటిక్ గ్రీన్ రూ.500 కోట్లు పెట్టుబడి చేస్తోంది. రెండేళ్లలో రూ.100 కోట్లు.. ఈ–లూనా బ్రాండ్కై వచ్చే రెండేళ్లలో రూ.100 కోట్లు వెచి్చస్తున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ వెల్లడించారు. సరైన సమయంలో ఈ–లూనా అడుగుపెడుతోందని చెప్పారు. ప్యాసింజర్ విభాగంతోపాటు సరుకు డెలివరీ సేవల కోసం కస్టమర్ల నుంచి మంచి స్పందన ఉందన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సరుకు రవాణాకై 1,500 ఈ–మోపెడ్స్ అందుబాటులోకి తెచి్చనట్టు వెల్లడించారు. ప్యాసింజర్ బీటూసీ నెట్‌వర్క్‌లో 50–70 వేల ఈ–లూనాలు, లాస్ట్ మైల్ డెలివరీకై 20–30 వేల యూనిట్లకు డిమాండ్ ఉండొచ్చని అంచనాగా చెప్పారు. కినెటిక్ గ్రీన్‌కు దేశవ్యాప్తంగా 300 డీలర్íÙప్ కేంద్రాలు ఉన్నాయి. మూడేళ్లలో ఈ సంఖ్యను అయిదు రెట్లకు పెంచాలన్నది సంస్థ లక్ష్యం. ఏటా అయిదు లక్షల యూనిట్ల ఈ–లూనా తయారీ సామర్థ్యంతో కొత్త ప్రొడక్షన్ లైన్‌ను కంపెనీ ప్రారంభించింది. కినెటిక్ ఇంజనీరింగ్ ద్వారా 50 సీసీ ఇంజన్ కలిగిన లూనా మోపెడ్ 1972 నుంచి భారత రోడ్లపై పరుగు ప్రారంభించింది. గరిష్టంగా రోజుకు 2,000 యూనిట్ల విక్రయాలు సంస్థ ఖాతాలో ఉన్నాయి. మోపెడ్స్ మార్కెట్లో ఏకంగా 95 శాతం వాటా ఉండేది. 2000 సంవత్సరం నుంచి తయారీ నిలిచిపోయింది. -
మార్కెట్లలోకి సరికొత్తగా కైనెటిక్ లూనా..!
కైనెటిక్ లూనా బైక్ గురించి తెలియని వారు ఎవరు ఉండరనుకుంటా..! 1972 సంవత్సరంలో భారత వాహన రంగంలోకి అడుగుపెట్టి సంచలనాన్ని సృష్టించింది. ఈ బైక్‌ను కైనెటిక్ ఇంజనీరింగ్ సంస్థ రూపొందించింది. 50 సీసీ ఇంజన్‌తో 30 సంవత్సరాలపాటు కైనెటిక్ లూనా భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసించింది. కొన్ని రోజుల తరువాత మార్కెట్లలోకి కొత్త బైక్‌ల రాకతో కైనెటిక్ లూనా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో 2000 సంవత్సరంలో కైనెటిక్ లూనా బైక్‌ల ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసింది. కైనెటిక్ మోటర్ సైకిల్స్ లిమిటిడ్ తన కంపెనీ షేర్లను పూర్తిగా అమ్మివేసింది. గత నెలలో కైనెటిక్ లూనా తిరిగి భారత మార్కెట్లలోకి వస్తోందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా కైనెటిక్ లూనా సరికొత్తగా ఎలక్ట్రిక్ బైక్ రూపంలో భారత ఆటోమొబైల్ రంగంలో తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ బైక్ ఈ సంవత్సరం లాంచ్ జరగనుంది. భారత టూవిలర్ ఎలక్ట్రిక్ మార్కెట్లలోకి లూనా సరికొత్తగా ఎంట్రీ ఇవ్వనుందని కైనెటిక్ గ్రూప్‌లో భాగంగా ఉన్న మోటోరాయల్ ఎమ్డీ అజింక్యా ఫిరోడియా సోషల్ మీడియాలో వెల్లడించారు. వచ్చే రెండునెలల్లో కైనెటిక్ లూనా భారత మార్కెట్లలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ బైక్‌లను ఇప్పటికే అహ్మదాబాద్ కేంద్రంగా ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కైనెటిక్ లూనా బైక్‌కు స్వాపబుల్ లిథియం అయాన్ బ్యాటరీలను అమర్చనున్నారు. కైనెటిక్ లూనా బైక్‌లకు 1kW శక్తిని అందించనుంది. ఈ బైక్ టాప్‌స్పీడ్ 25 కెఎమ్‌పీహెచ్. సింగిల్ ఛార్జ్‌తో 70 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్‌ను సపోర్ట్‌ను చేయనున్నట్లు తెలుస్తోంది. కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ బైక్‌లకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. కైనెటిక్ లూనా బైక్ రెండు వేరియంట్లలో మార్కెట్లలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. కైనెటిక్ లూనా టూవిలర్, కైనెటిక్ లూనా త్రీవీలర్ లంబోర్ఘిణి బగ్గీరేంజ్ వేరియంట్లలో రానుంది. కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ బైక్ ధర సుమారు రూ. 50 వేలకు మించి ఉండదని మార్కెటు వర్గాలు భావిస్తున్నారు. -
ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్టులతో పాటు బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ ఏర్పాటు కోసం రూ. 1,750 కోట్లు పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ కార్గో 3 వీలర్ సఫర్ జంబో వాహనాన్ని మంగళవారం ఆవిష్కరించిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ ఈ విషయాలు వెల్లడించారు. ‘గోల్ఫ్ కార్ట్ ప్రాజెక్ట్ కోసం సెజ్‌లో యూనిట్ ఏర్పాటును పరిశీలిస్తున్నాం. సెజ్‌లో యూనిట్‌తో పాటు బ్రాండ్‌తో సంబంధం లేకుండా ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల బ్యాటరీల స్వాపింగ్ (మార్పిడి)కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం’ అని ఆమె తెలిపారు. దీనిపై ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించారు. భారత్‌లో ప్రీమియం సెగ్మెంట్ గోల్ఫ్‌కార్టులు, ఇతరత్రా ఎలక్ట్రిక్ ఆఫ్–రోడ్ వాహనాల డిజైన్, తయారీకి సంబంధించి టొనినో లంబోర్గినితో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు కైనెటిక్ గ్రూప్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ‘దేశంలోనే అతి పెద్ద త్రిచక్ర వాహనాల మార్కెట్లలో ఒకటైనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి ఈ–రిక్షాలకు పెద్ద గా మార్కెట్ లేదు. హై–స్పీడ్ త్రీవీలర్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటోంది. ఈ నేపథ్యంలో బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాలను అందుబాటులోకి తెస్తే ఎలక్ట్రిక్ వాహనాలకూ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది‘ అని సులజ్జా చెప్పారు. మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్గో... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్.. సరుకు రవాణా కోసం సఫర్ జంబో పేరుతో పూర్తిగా దేశీయంగా తయారు చేసిన కార్గో త్రీ వీలర్ మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ–కామర్స్ రంగంలో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో కంపెనీ ఈ వాహనాన్ని రూపొందించింది. 500 కిలోల బరువు మోయగలదు. టాప్ స్పీడ్ 55 కిలోమీటర్లు. ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. స్టీల్ బాడీ, డిజిటల్ క్లస్టర్, కైనెటిక్ కనెక్ట్ యాప్, జీపీఎస్, ఇండిపెండెంట్ రేర్ సస్పెన్షన్, హైడ్రాలిక్ బ్రేక్స్ వంటి హంగులు ఉన్నాయి. ఫేమ్–3 కింద కస్టమర్లు సబ్సిడీ పొందవచ్చు. మూడేళ్ల వారంటీ ఉంది. విభిన్న వేరియంట్లు సైతం.. వచ్చే 6–7 నెలల్లో 5,000లకుపైగా సఫర్ జంబో యూనిట్లను అందించాలన్నది సంస్థ భావన అని ౖMðనెటిక్ గ్రీన్ ఎనర్జీ ఫౌండర్, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ మంగళవారం ఆన్లైన్ వేదికగా మీడియాకు తెలిపారు. డీజిల్ కార్గో త్రీ వీలర్‌కు కిలోమీటరుకు రూ.3 ఖర్చు అయితే, సఫర్ జంబోకు 50 పైసలు మాత్రమేనని వివరించారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీ, వ్యర్థాల సేకరణ కోసం ఉపయోగపడే విధంగా పలు కొత్త మోడళ్లకు రూపకల్పన చేయనున్నట్టు వెల్లడించారు. సంస్థ అనుబంధ కంపెనీ కైనెటిక్ మొబిలిటీ లీజు ప్రాతిపదికన ఈ–కార్గో వాహనాలను సమకూరుస్తోందని ఆమె గుర్తుచేశారు. -
కైనటిక్ నుంచి ఎలక్ట్రిక్ 3 వీలర్
న్యూఢిల్లీ: పుణేకి చెందిన ‘కైనటిక్ గ్రూప్’ అనుబంధ కంపెనీ ‘కైనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్’ తాజాగా ‘కైనటిక్ సఫర్’ అనే ఎలక్ట్రిక్ 3 వీలర్ వాహనాన్ని మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.1.38 లక్షలు (ఆన్ రోడ్ ఢిల్లీ). దీంతో కంపెనీ ఎలక్ట్రానిక్ వాహన విభాగంలోకి ప్రవేశించినట్లయ్యింది. కైనటిక్ కంపెనీ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ.400 కోట్ల విలువైన ఆర్డరును కైవసం చేసుకుంది. కంపెనీ ఈ ఆర్డర్లో భాగంగా 27,000 యూనిట్ల ‘కైనటిక్ సఫర్’ వాహనాలను ఆ ప్రభుత్వానికి సరఫరా చేయనున్నది. ప్రజలకు అందుబాటు ధరల్లో, కాలుష్య రహిత వాహనాల తయారీకి తాము ఎంతగానో శ్రమించామని ‘కైనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్’ కంపెనీ సీఈవో సులజా ఫిరోడియా మోత్వాని తెలిపారు. ‘కైనటిక్ సఫర్’ ప్రత్యేకతలు ‘కైనటిక్ సఫర్’ను ఒకసారి చార్జ్ చేస్తే 115 కిలోమీటర్ల దూరం వెళ్తుందని మోత్వాని తెలిపారు. అలాగే గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని చెప్పారు. వాహనంలో డ్రైవర్‌తోపాటు మరో నలుగురు ప్రయాణించవచ్చని తెలిపారు. హోమ్ డెలివరీస్ కోసం ఈ-కార్ట్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ఆమె వెల్లడించారు.