హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లూనా.. చాలా మందికి సుపరిచితమైన చిన్న మోపెడ్. చల్ మేరీ లూనా పేరుతో మధ్య తరగతికి దగ్గరైంది. కొద్ది రోజుల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ రూపంలో భారత రోడ్లపై పరుగుపెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న కినెటిక్ గ్రీన్ ఈ–లూనా అభివృద్ధి చేసింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ ప్రారంభం. ఫిబ్రవరి నుంచి మార్కెట్లో ఈ వాహనం దూసుకెళ్లనుంది.
కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రూ.500 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. నెలకు 5,000 యూనిట్లను విక్రయించాలన్నది సంస్థ టార్గెట్. మూడు బ్యాటరీ ప్యాక్‌లలో రంగ ప్రవేశం చేయనుంది. తొలుత 2 కిలోవాట్ అవర్ వేరియంట్ రానుంది. ఒకసారి చార్జింగ్‌తో 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 150 కిలోల బరువు మోయగలదు.
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం 40–45 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో మరో వేరియంట్ పరిచయం చేస్తారు. అలాగే 100–125 కిలోమీటర్లు ప్రయాణించగలిగే 3 కిలోవాట్ అవర్ బ్యాటరీతోనూ వేరియంట్ రంగ ప్రవేశం చేయనుంది. వచ్చే మూడేళ్లలో సామర్థ్యం పెంపు, కొత్త మోడళ్లకై కినెటిక్ గ్రీన్ రూ.500 కోట్లు పెట్టుబడి చేస్తోంది.
రెండేళ్లలో రూ.100 కోట్లు..
ఈ–లూనా బ్రాండ్‌కై వచ్చే రెండేళ్లలో రూ.100 కోట్లు వెచి్చస్తున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ వెల్లడించారు. సరైన సమయంలో ఈ–లూనా అడుగుపెడుతోందని చెప్పారు. ప్యాసింజర్ విభాగంతోపాటు సరుకు డెలివరీ సేవల కోసం కస్టమర్ల నుంచి మంచి స్పందన ఉందన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సరుకు రవాణాకై 1,500 ఈ–మోపెడ్స్ అందుబాటులోకి తెచి్చనట్టు వెల్లడించారు. ప్యాసింజర్ బీటూసీ నెట్‌వర్క్‌లో 50–70 వేల ఈ–లూనాలు, లాస్ట్ మైల్ డెలివరీకై 20–30 వేల యూనిట్లకు డిమాండ్ ఉండొచ్చని అంచనాగా చెప్పారు.
కినెటిక్ గ్రీన్‌కు దేశవ్యాప్తంగా 300 డీలర్íÙప్ కేంద్రాలు ఉన్నాయి. మూడేళ్లలో ఈ సంఖ్యను అయిదు రెట్లకు పెంచాలన్నది సంస్థ లక్ష్యం. ఏటా అయిదు లక్షల యూనిట్ల ఈ–లూనా తయారీ సామర్థ్యంతో కొత్త ప్రొడక్షన్ లైన్‌ను కంపెనీ ప్రారంభించింది. కినెటిక్ ఇంజనీరింగ్ ద్వారా 50 సీసీ ఇంజన్ కలిగిన లూనా మోపెడ్ 1972 నుంచి భారత రోడ్లపై పరుగు ప్రారంభించింది. గరిష్టంగా రోజుకు 2,000 యూనిట్ల విక్రయాలు సంస్థ ఖాతాలో ఉన్నాయి. మోపెడ్స్ మార్కెట్లో ఏకంగా 95 శాతం వాటా ఉండేది. 2000 సంవత్సరం నుంచి తయారీ నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment