moped
-
చల్ మేరి ఈ–లూనా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లూనా.. చాలా మందికి సుపరిచితమైన చిన్న మోపెడ్. చల్ మేరీ లూనా పేరుతో మధ్య తరగతికి దగ్గరైంది. కొద్ది రోజుల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ రూపంలో భారత రోడ్లపై పరుగుపెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న కినెటిక్ గ్రీన్ ఈ–లూనా అభివృద్ధి చేసింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ ప్రారంభం. ఫిబ్రవరి నుంచి మార్కెట్లో ఈ వాహనం దూసుకెళ్లనుంది. కంపెనీ వెబ్సైట్ ద్వారా రూ.500 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. నెలకు 5,000 యూనిట్లను విక్రయించాలన్నది సంస్థ టార్గెట్. మూడు బ్యాటరీ ప్యాక్‌లలో రంగ ప్రవేశం చేయనుంది. తొలుత 2 కిలోవాట్ అవర్ వేరియంట్ రానుంది. ఒకసారి చార్జింగ్‌తో 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 150 కిలోల బరువు మోయగలదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం 40–45 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో మరో వేరియంట్ పరిచయం చేస్తారు. అలాగే 100–125 కిలోమీటర్లు ప్రయాణించగలిగే 3 కిలోవాట్ అవర్ బ్యాటరీతోనూ వేరియంట్ రంగ ప్రవేశం చేయనుంది. వచ్చే మూడేళ్లలో సామర్థ్యం పెంపు, కొత్త మోడళ్లకై కినెటిక్ గ్రీన్ రూ.500 కోట్లు పెట్టుబడి చేస్తోంది. రెండేళ్లలో రూ.100 కోట్లు.. ఈ–లూనా బ్రాండ్కై వచ్చే రెండేళ్లలో రూ.100 కోట్లు వెచి్చస్తున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ వెల్లడించారు. సరైన సమయంలో ఈ–లూనా అడుగుపెడుతోందని చెప్పారు. ప్యాసింజర్ విభాగంతోపాటు సరుకు డెలివరీ సేవల కోసం కస్టమర్ల నుంచి మంచి స్పందన ఉందన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సరుకు రవాణాకై 1,500 ఈ–మోపెడ్స్ అందుబాటులోకి తెచి్చనట్టు వెల్లడించారు. ప్యాసింజర్ బీటూసీ నెట్‌వర్క్‌లో 50–70 వేల ఈ–లూనాలు, లాస్ట్ మైల్ డెలివరీకై 20–30 వేల యూనిట్లకు డిమాండ్ ఉండొచ్చని అంచనాగా చెప్పారు. కినెటిక్ గ్రీన్‌కు దేశవ్యాప్తంగా 300 డీలర్íÙప్ కేంద్రాలు ఉన్నాయి. మూడేళ్లలో ఈ సంఖ్యను అయిదు రెట్లకు పెంచాలన్నది సంస్థ లక్ష్యం. ఏటా అయిదు లక్షల యూనిట్ల ఈ–లూనా తయారీ సామర్థ్యంతో కొత్త ప్రొడక్షన్ లైన్‌ను కంపెనీ ప్రారంభించింది. కినెటిక్ ఇంజనీరింగ్ ద్వారా 50 సీసీ ఇంజన్ కలిగిన లూనా మోపెడ్ 1972 నుంచి భారత రోడ్లపై పరుగు ప్రారంభించింది. గరిష్టంగా రోజుకు 2,000 యూనిట్ల విక్రయాలు సంస్థ ఖాతాలో ఉన్నాయి. మోపెడ్స్ మార్కెట్లో ఏకంగా 95 శాతం వాటా ఉండేది. 2000 సంవత్సరం నుంచి తయారీ నిలిచిపోయింది. -
నాడు ‘చల్ మేరీ లూనా’.. త్వరలో ఏం అనబోతున్నారంటే..
దేశంలో ఎలక్ట్రికల్ వాహనాలకు అంతకంతకూ డిమాండ్ పెరుగుతోంది. దీంతో నూతన స్టార్టప్‌లు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇదేసమయంలో పలు పాత కంపెనీలు కూడా మార్కెట్లో నూతన హంగులతో తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 80-90 దశాబ్ధాలలో తన హవా చాటిన లూనా గురించి అందరికీ తెలిసేవుంటుంది. అదే లూనా ఇప్పుడు మార్కెట్లోకి కొత్త హంగులతో వచ్చేందుకు సకల సన్నాహాలు చేస్తోంది. అయితే ఈసారి లూనా ఎలక్ట్రిక్ అవతారంలో పరుగులు తీయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ సులజ్జా ఫిరోదియా మోత్వానీ సోషల్ మీడియా మాధ్యమంలో తెలియజేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తన తండ్రికి సంబంధించిన పాత ఫొటోతో పాటు లూనా వింటేజ్ వీడియోను పోస్ట్ చేశారు. దానిలో బ్లాస్ట్ ఫ్రమ్ ద పోస్ట్!!‘చల్ మేరీ లూనా’. దీని రూపకర్త నా తండ్రి, పద్మశ్రీ అరుణ్ ఫిరోదియా!కైనెటిక్ గ్రీన్ కు ఆధునిక మార్పులు చేస్తూ‘ఈ- లూనా’ పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా దీనికిముందు బజాజ్ ఆటో కూడా తన ప్రముఖ స్కూటర్ చేతక్‌ను పాత నేమ్ ప్లేట్‌తోనే ఎలక్ట్రిక్ వాహనంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. అలాగే ఎల్ఎంఎల్ కూడా ఇదే ఏడాది తన స్టార్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ అవతార్‌లో తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ లూనా అంటే ఈ- లూనా.. ఇది కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ వవర్ సొల్యూషన్ ద్వారా మార్కెట్లోకి ప్రవేశించనున్న తొలి మోడల్. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కంపెనీ నెలకు 5 వేల ‘ఈ లూనా’లను ఉత్పత్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కైనెటిక్ తన ఎలక్ట్రిక్ లూనా కోసం మరో అసెంబ్లీ లైన్ నెలకొల్పుతోంది. కంపెనీ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ఈ- లూనాలను ఉత్పత్తి చేయనుంది. కాగా కైనెటిక్ లూనా నాటి కాలంలో ఎంతో ఆదరణ పొందింది. దీనిని కైనెటిక్ ఇంజినీరింగ్ తొలిసారి 1972లో మార్కెట్లోకి తీసుకువచ్చింది. సుమారు 50 సీసీ ఇంజను సామర్థ్యం కలిగిన ఈ వాహనం దేశంలో తొలి మోపెడ్‌గా పేరొందింది. తరువాతి కాలంలో టీఎఫ్ఆర్, డబల్ ప్లస్, వింగ్స్, మేగ్నం, సూపర్ పేర్లతో రకరకాల వేరియంట్స్‌లో ఈ వాహనం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం లూనాను తొలిసారి మార్కెట్లోకి తీసుకువచ్చినప్పుడు దీని ధర రూ.2,000. 1972లో వచ్చిన ఒరిజినల్ లూనా పియాజియో సియావో మోపెడ్‌కు చెందిన లైసెన్స్డ్ వెర్షన్. దీని తరువాత 2000 దశకం తొలినాళ్లలో లూనా ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు కైనెటిక్ తెలిపింది. -
చైనా మార్కెట్ కోసం హోండా.. ముచ్చటగా మూడు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'హోండా' చైనీస్ మార్కెట్ కోసం మూడు ఎలక్ట్రిక్ రెట్రో స్కూటర్లను పరిచయం చేసింది. ఈ మూడు స్కూటర్లు సింపుల్ డిజైన్ కలిగి మినిబైకుల మాదిరిగా ఉన్నాయి. ఇవి గతంలో పెట్రోల్ బేస్డ్ మోడల్స్‌గా అందుబాటులో ఉండేవి. చైనా కోసం రూపొందిన 'కబ్ ఈ (Cub e), డాక్స్ ఈ (Dax e) జూమర్ ఈ (Zoomer e)' ఎలక్ట్రిక్ స్కూటర్లు గతంలో ఎక్కువగా అమ్ముడైన పాపులర్ టూవీలర్స్. ఇవి 1958 నుంచి 2018 వరకు నిరంతరం సిరీస్‌లో భాగంగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. హోండా కబ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఛార్జ్‌తో 64 కిమీ రేంజ్, డాక్స్ ఈ 80 కిలోమీటర్లు, జూమర్ ఇ సుమారు 90కి.మీ రేంజ్ అందిస్తుంది. కబ్ ఇ అనేది హోండా కబ్ ఆధారంగా రూపొందించబడింది. ఆ తరువాత ఆధునిక అప్డేట్స్ పొందింది. డాక్స్ ఈ దాని దాని మునుపటి మోడల్స్ ఆధారంగా రూపుదిద్దుకుంది. జూమర్ ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ రక్కస్ స్కూటర్ ప్రేరణ పొందింది. ఇది (రక్కస్) 49 సీసీ ఇంజన్‌తో అందుబాటులో ఉండేది. అయితే కంపెనీ ఇప్పుడు పరిచయం చేసిన మూడు మోడల్స్ పెట్రోల్ వెర్షన్స్ కాదు, ఇవి పూర్తిగా ఎలక్టిక్ మోపెడ్ స్కూటర్లు. ఇవి చైన్ ఫైనల్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి పవర్ డెలివరీ చేస్తాయి. కొత్త హోండా ఎలక్ట్రిక్ మోపెడ్ స్కూటర్లలో ఛార్జింగ్ అయిపోతే పెడల్ సహాయంతో సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్ళవచ్చు. ఈ స్కూటర్ల యొక్క గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఇవి కేవలం చైనీస్ మార్కెట్లో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఇతర దేశాల్లో విక్రయించే అవకాశం లేదు. -
కూతురి మృతదేహంతో మోపెడ్‌పై 30 కి.మీ
తుమకూరు: తీవ్రమైన జ్వరంతో ఓ యువతి మరణించగా మృతదేహాన్ని తరలించేందుకు డబ్బుల్లేక 30 కి.మీ మోపెడ్‌పై తీసుకెళ్లిన ఘటన కర్ణాటకలో జరిగింది. తుమకూరు జిల్లా కోడిగేనహళ్ళి వీరాపుర గ్రామానికి చెందిన రైతు కూలీలు తిమ్మప్ప, గౌరమ్మ దంపతుల కుమార్తె నాగరత్న (25) పుట్టుకతోనే మూగచెవిటి. మూడురోజుల నుంచి ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఆదివారం ఓ ఆర్ఎంపీ వైద్యుడి ఆసుపత్రి వద్ద మరణించింది. 108 అంబులెన్సు అందుబాటులో లేకపోగా మృతదేహాన్ని ఆటోలో తరలించేందుకు వారి వద్ద ఉన్న డబ్బులు సరిపోలేదు. దీంతో 30 కి.మీ.ల దూరంలోని ఇంటికి మృతదేహాన్ని మోపెడ్‌పై తీసుకెళ్లినట్లు నాగరత్న తండ్రి తిమ్మప్ప తెలిపాడు. -
తెలుగు రాష్ట్రాల్లో టీవీఎస్ ఎక్స్ఎల్ 100
మోపెడ్ ధర రూ.30,074 చెన్నై: టీవీఎస్ మోటార్ కంపెనీ ఫోర్ స్ట్రోక్ టీవీఎస్ ఎక్స్ఎల్ 100 మోపెడ్‌ను తెలుగు రాష్ట్రాల్లో గురువారం విడుదల చేసింది. ఈ మోపెడ్ ధర రూ.30,074(ఎక్స్ షోరూమ్, ఆంధ్రప్రదేశ్) అని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. 99.7 సీసీ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ మోపెడ్ 4.2 పీఎస్ పవర్‌ను ఇస్తుందని, 67 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని టీవీఎస్ మోటార్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ సర్వీస్) జె.ఎస్. శ్రీనివాసన్ చెప్పారు. ఈ మోపెడ్ ఆకుపచ్చ, నలుపు, ఎరుపు, నీలం, గ్రే-ఐదు రంగుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని తమ డీలర్ల వద్ద లభ్యమవుతుందని పేర్కొన్నారు. వినియోగదారుల అభిరుచులకనుగుణంగా అత్యున్నత నాణ్యత గల వాహనాలను అందిస్తున్నామని వివరించారు. టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్ హెవీ డ్యూటీ మోడల్‌ను కూడా విక్రయిస్తున్నామని తెలిపారు. -
ఏమిటి కృష్ణా?.... రథం మారిపోయే!
కృష్ణార్జునల వాహనం మారిందేంటి? అని ఆశ్చర్యపోతున్నారా...! కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు రథం తోలుతూ అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు... అది ద్వాపర యుగం. మరి ఇది కలియుగం కదా...కృష్ణార్జున పాత్రధారులైన కళాకారులు వేషధారణతోనే ఇలా మోపెడ్‌పై నగరంలో జరిగే ఒక కార్యక్రమానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ముషిరాబాద్లో కెమెరా కంటికి చిక్కారు.