కూతురి మృతదేహంతో మోపెడ్‌పై 30 కి.మీ | Poor man travelled on moped to 30kms with her daughter's dead body | Sakshi
Sakshi News home page

కూతురి మృతదేహంతో మోపెడ్‌పై 30 కి.మీ

Published Tue, Feb 21 2017 1:48 AM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM

కూతురి మృతదేహంతో  మోపెడ్‌పై 30 కి.మీ

కూతురి మృతదేహంతో మోపెడ్‌పై 30 కి.మీ

తుమకూరు: తీవ్రమైన జ్వరంతో ఓ యువతి మరణించగా మృతదేహాన్ని తరలించేందుకు డబ్బుల్లేక 30 కి.మీ మోపెడ్‌పై తీసుకెళ్లిన ఘటన కర్ణాటకలో జరిగింది. తుమకూరు జిల్లా కోడిగేనహళ్ళి వీరాపుర గ్రామానికి చెందిన రైతు కూలీలు తిమ్మప్ప, గౌరమ్మ దంపతుల కుమార్తె నాగరత్న (25) పుట్టుకతోనే మూగచెవిటి.

మూడురోజుల నుంచి ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఆదివారం ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి ఆసుపత్రి వద్ద  మరణించింది. 108 అంబులెన్సు అందుబాటులో లేకపోగా మృతదేహాన్ని ఆటోలో తరలించేందుకు వారి వద్ద ఉన్న డబ్బులు సరిపోలేదు. దీంతో 30 కి.మీ.ల దూరంలోని ఇంటికి మృతదేహాన్ని మోపెడ్‌పై తీసుకెళ్లినట్లు నాగరత్న తండ్రి తిమ్మప్ప తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement