middle class peoples
-
చల్ మేరి ఈ–లూనా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లూనా.. చాలా మందికి సుపరిచితమైన చిన్న మోపెడ్. చల్ మేరీ లూనా పేరుతో మధ్య తరగతికి దగ్గరైంది. కొద్ది రోజుల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ రూపంలో భారత రోడ్లపై పరుగుపెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న కినెటిక్ గ్రీన్ ఈ–లూనా అభివృద్ధి చేసింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ ప్రారంభం. ఫిబ్రవరి నుంచి మార్కెట్లో ఈ వాహనం దూసుకెళ్లనుంది. కంపెనీ వెబ్సైట్ ద్వారా రూ.500 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. నెలకు 5,000 యూనిట్లను విక్రయించాలన్నది సంస్థ టార్గెట్. మూడు బ్యాటరీ ప్యాక్‌లలో రంగ ప్రవేశం చేయనుంది. తొలుత 2 కిలోవాట్ అవర్ వేరియంట్ రానుంది. ఒకసారి చార్జింగ్‌తో 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 150 కిలోల బరువు మోయగలదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం 40–45 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో మరో వేరియంట్ పరిచయం చేస్తారు. అలాగే 100–125 కిలోమీటర్లు ప్రయాణించగలిగే 3 కిలోవాట్ అవర్ బ్యాటరీతోనూ వేరియంట్ రంగ ప్రవేశం చేయనుంది. వచ్చే మూడేళ్లలో సామర్థ్యం పెంపు, కొత్త మోడళ్లకై కినెటిక్ గ్రీన్ రూ.500 కోట్లు పెట్టుబడి చేస్తోంది. రెండేళ్లలో రూ.100 కోట్లు.. ఈ–లూనా బ్రాండ్కై వచ్చే రెండేళ్లలో రూ.100 కోట్లు వెచి్చస్తున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ వెల్లడించారు. సరైన సమయంలో ఈ–లూనా అడుగుపెడుతోందని చెప్పారు. ప్యాసింజర్ విభాగంతోపాటు సరుకు డెలివరీ సేవల కోసం కస్టమర్ల నుంచి మంచి స్పందన ఉందన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సరుకు రవాణాకై 1,500 ఈ–మోపెడ్స్ అందుబాటులోకి తెచి్చనట్టు వెల్లడించారు. ప్యాసింజర్ బీటూసీ నెట్‌వర్క్‌లో 50–70 వేల ఈ–లూనాలు, లాస్ట్ మైల్ డెలివరీకై 20–30 వేల యూనిట్లకు డిమాండ్ ఉండొచ్చని అంచనాగా చెప్పారు. కినెటిక్ గ్రీన్‌కు దేశవ్యాప్తంగా 300 డీలర్íÙప్ కేంద్రాలు ఉన్నాయి. మూడేళ్లలో ఈ సంఖ్యను అయిదు రెట్లకు పెంచాలన్నది సంస్థ లక్ష్యం. ఏటా అయిదు లక్షల యూనిట్ల ఈ–లూనా తయారీ సామర్థ్యంతో కొత్త ప్రొడక్షన్ లైన్‌ను కంపెనీ ప్రారంభించింది. కినెటిక్ ఇంజనీరింగ్ ద్వారా 50 సీసీ ఇంజన్ కలిగిన లూనా మోపెడ్ 1972 నుంచి భారత రోడ్లపై పరుగు ప్రారంభించింది. గరిష్టంగా రోజుకు 2,000 యూనిట్ల విక్రయాలు సంస్థ ఖాతాలో ఉన్నాయి. మోపెడ్స్ మార్కెట్లో ఏకంగా 95 శాతం వాటా ఉండేది. 2000 సంవత్సరం నుంచి తయారీ నిలిచిపోయింది. -
మధ్యతరగతి విస్ఫోటం
డి.శ్రీనివాసరెడ్డి: మధ్య తరగతి జన విస్ఫోటనం. కొంతకాలంగా ప్రపంచమంతటా శరవేగంగా జరుగుతున్న పరిణామమిది! మార్కెట్ల విస్తరణ, ఆదాయ వనరుల పెరుగుదల తదితర కారణాలతో ఏ దేశంలో చూసినా మధ్య తరగతి జనం ఏటా విపరీతంగా పెరుగుతున్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రపంచ జనాభాలో 40 శాతం పైగా వాటా మధ్యతరగతిదే. దాదాపుగా అన్ని దేశాల్లోనూ ప్రభుత్వాలు నడవడానికి వీరి ఆదాయ వ్యయాలే ఇంధనంగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు! ప్రఖ్యాత వ్యాపార దిగ్గజాలు కూడా వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో మిడిల్ క్లాస్‌ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది! ఏటా 14 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా మధ్య తరగతి జనాభా ఏటా ఏకంగా 14 కోట్ల చొప్పున పెరిగిపోతోందని, ప్రస్తుతం 320 కోట్లుగా ఉందని ప్రపంచ బ్యాకు తాజా నివేదిక వెల్లడించింది. 2030 నాటికి వీరి సంఖ్య 520 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అంటే ప్రపంచ జనాభాలో ఏకంగా 65 శాతానికి చేరనుందన్నమాట! మొత్తం ప్రపంచ ఆదాయంలో మూడో వంతు ఈ మధ్యతరగతి మహాజనుల నుంచే సమకూరుతోందట! సింహభాగం ఆసియాదే... ఈ శతాబ్దారంభంలో అమెరికా తదితర సంపన్న యూరప్ దేశాల్లో అధిక సంఖ్యాకులు మధ్యతరగతి వారే ఉండేవారు. క్రమంగా అక్కడ వారి వృద్ధి తగ్గుతూ ఆదియా దేశాల్లో శరవేగగంగా పెరుగుతోంది. వరల్డ్ డేటా లాబ్ అంచనా ప్రకారం వచ్చే ఎనిమిదేళ్లలో కొత్తగా రానున్న 100 కోట్ల మంది మధ్యతరగతి జనంలో ఏకంగా 90 శాతం ఆసియాకు చెందినవారే ఉండనున్నారు! భారత్, చైనాతోపాటు ఇండొనేసియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌వంటి ఆసియా దేశాలు మిడిల్ క్లాస్ జనంతో మరింతగా కళకళలాడతాయట. ఆ దేశాల్లో శరవేగంగా సాగుతున్న పట్టణీకరణే అక్కడ మధ్యతరగతి ప్రాబ ల్యానికి తార్కాణం. వీరు చైనాలో 2010 నాటికి జనాభాలో 49 శాతముండగా ఇప్పటికే 56 శాతానికి పెరిగారు. 2035 నాటికి చైనా జనాభాలో ఏకంగా 100 కోట్ల మంది పట్టణవాసులే ఉంటారని అంచనా. భారత్‌లోనూ 2035 నాటికి 67.5 కోట్ల మంది (45 శాతం) పట్టణాల్లో నివసిస్తారట. ఆసియాలో ఈ సంఖ్య 300 కోట్లుగా ఉండనుంది. యూఎస్‌లో పాపం మిడిల్‌క్లాస్... ఒకప్పుడు మధ్యతరగతి ఆదాయ వర్గాల దేశంగా నిలిచిన అమెరికాలో వారి సంఖ్య బాగా తగ్గుతోంది. అక్కడ 35 వేల నుంచి 1.06 లక్షల డాలర్ల వార్షికాదాయముంటే మధ్యతరగతిగా పరిగణిస్తారు. 1971లో దేశ జనాభాలో 61 శాతం మిడిల్ క్లాసే కాగా గతేడాదికి 50 శాతానికి తగ్గిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఇక రష్యా, ఉక్రెయిన్లలో యుద్ధం దెబ్బకు ఒక్క ఈ ఏడాదే ఏకంగా కోటి మంది దాకా మధ్య తరగతి నుంచి దిగువ తరగతికి దిగజారినట్టు ప్యూ నివేదిక వెల్లడించింది. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని తేడాలున్నా మొత్తమ్మీద ఒక వ్యక్తి తన అన్ని అవసరాలకు కలిపి రోజుకు దాదాపు రూ.1,000, ఆ పైన వెచ్చించగలిగితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అతన్ని మధ్యతరగతిగా లెక్కిస్తారు. రూ.5 లక్షల నుంచి 30 లక్షల వార్షికాదాయం ఉన్నవారిని మధ్యతరగతిగా పరిగణిస్తారు. మన దగ్గర కూడా... మధ్యతరగతి మందహాసమే భారత్‌లో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరు మిడిల్ క్లాస్ జీవులే. 2047 నాటికి వీరి సంఖ్య రెట్టింపై ప్రతి ముగ్గురిలో ఇద్దరు వాళ్లే ఉంటారని పీపుల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియాస్ కన్సూ్యమర్ ఎకానమీ (ప్రైజ్) అంచనా. 2005లో దేశ జనాభాలో కేవలం 14 శాతమున్న మధ్యతరగతి ఇప్పుడు ఏకంగా 31 శాతానికి పెరిగింది. 2035 కల్లా 43.5 శాతానికి వృద్ధి చెందనుంది! -
కాఫీ విత్ ఖతీక్!
సాక్షి, హైదరాబాద్: బాధితులు అంతా మధ్య, దిగువ మధ్య తరగతికి చెందిన వారు... ఒక్కో రూపాయి కూడగట్టుకుంటేనే తులం బంగారం చేకూరేది... స్నాచింగ్‌లో పోగొట్టుకున్నది సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న మంగళసూత్రాలు... సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతీక్‌ను కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఇవే కనిపించాయి. కేవలం తమ ఠాణా పరిధిలోని బాధితులే కాకుండా మూడు కమిషనరేట్లకు చెందిన వారికీ న్యా యం చేయాలని భావించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఉమేష్‌ను చాకచక్యంగా విచారించారు. చివరకు ‘కాఫీ విత్ ఖతీక్’తో అసలు గుట్టు బయటపెట్టేలా చేశారు. మూడు నేరాలు పేట్ బషీరాబాద్‌లోనే... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో ఐదు స్నాచింగ్స్ సహా ఎనిమిది నేరాలు చేసిన సింగిల్... సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతీక్‌ను ఈ నెల రెండో వారంలో పేట్ బషీరాబాద్ పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకువచ్చారు. ఎనిమిదింటిలో మూడు నేరాలు ఈ ఠాణా పరిధిలోనివే కావడంతో ఈ అధికారులే ముందడుగు వేశారు. విచార ణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతి కోరు తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు కోర్టు అనుమతించడంతో ఈ నెల 20న కస్టడీలోకి తీసుకుని తమ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. అతడి ఆరోగ్యం, గత చరిత్ర నేపథ్యంలో... ఉమేష్‌కు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు గతంలో పోలీసు కస్టడీ నుంచి పారిపోయిన చరిత్ర కూడా ఉంది. పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రాథమికంగా ఈ రెండు అంశాలు దృష్టిలో పెట్టుకున్నారు. కస్టడీలోకి వచ్చిన తొలి రోజు ఉమేష్ పారిపోవడానికి ప్రయత్నాలు చేశాడు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న అధికారులు మరో రెండు రోజుల పాటు సాధారణంగా ప్రశ్నించారు. ఏమాత్రం తొణకని, బెణకని అతగాడు అహ్మదాబాద్ పోలీసులకు చెప్పినట్టే ‘తెంచినవన్నీ పడిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అధికారులు తమ శైలి మార్చాలని భావించారు. లాకప్‌లో కూర్చుని కాఫీ తాగుతూ... నేరాలు చేయడంతో ఆరి తేరిన, ఇప్పటికే అనేకసార్లు అరెస్టు అయిన, ఓ సందర్భంలో గురజాత్ పోలీసుల పైనే ఆరోపణలు చేసిన ఉమేష్ ఖతీక్‌ను రోటీన్‌కు భిన్నంగా ‘బ్రేక్’ చేయించాలని పేట్ బషీరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఓ నేరగాడి నుంచి నిజాలు రాబట్టడాన్ని పోలీసు పరిభాషలో బ్రేక్ చేయడం అంటారు. దీంతో ఒక రోజు అతడితో ప్రేమ పూర్వకంగా మెలిగిన అధికారులు ఎలాంటి హాని ఉండదనే నమ్మకం కలిగించారు. ఆపై అతడితో కలిసి లాకప్ గదిలోనే కూర్చుని కాఫీ కూడా తాగారు. ఈ పరిణామంతో ఉమేష్ వ్యవహారశైలిలో మార్పు రావడాన్ని అధికారులు గుర్తించారు. ఐదో రోజు నోరు విప్పాడు... పేట్ బషీరాబాద్ పోలీసుల తీరుతో ‘మంత్రముగ్ధుడైన’ ఉమేష్ ఖతీక్ ఐదో రోజు కస్టడీలో నోరు విప్పాడు. ఇక్కడ కొట్టేసిన బంగారం తన ఇంట్లోనే దాచానంటూ బయటపెట్టాడు. ఈ విషయం అహ్మదాబాద్ పోలీసులకు చెబితే అక్కడి కేసుల్లో రికవరీ చూపించేస్తారని, జైలు నుంచి వచ్చాక తనకు ఏమీ మిగలదనీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్లు బయటపెట్టాడు. సాధారణంగా స్నాచింగ్ చేసిన బంగారం వెంటనే అమ్మేసి సొమ్ము చేసుకుంటానని, అలాంటప్పుడు బయటపెట్టినా రిసీవర్ల నుంచి రివకరీ చేస్తారు కాబట్టి తనకు ఎలాంటి నష్టం ఉండదని అన్నాడు. ఈ బంగారం అమ్మని కారణంగానే అలా చెప్పానని వివరించాడు. ఇలా అసలు విషయం తెలిసి అహ్మదాబాద్ వెళ్లిన పేట్ బషీరాబాద్ పోలీసులు అతడి ఇంటి నుంచి 19 తులాలు రికవరీ చేసుకువచ్చారు. (చదవండి: ఆన్లైన్ గేమ్స్ వద్దన్నందుకు డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య) -
మధ్యతరగతి గృహాలపై దృష్టిపెట్టండి!
సాక్షి, హైదరాబాద్: దేశంలో మధ్య తరగతి జనాభా శరవేగంగా పెరుగుతుంది. వీరి ఆకాంక్షలు సొంతింటి నుంచే మొదలవుతాయి. అందుకే మధ్యతరగతి అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా గృహాలను నిర్మించాలని, వాళ్లను ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలనూ తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. నిర్మాణ సంస్థల మార్కెట్, వ్యాపార ధోరణిని సామాన్య, మధ్య తరగతికి అనుబంధంగా సాగాలని, అలాంటి కంపెనీలు చిన్నవైన సరే బహుళ జాతి సంస్థల కంటే శరవేగంగా వృద్ధి చెందుతాయని అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) యూత్‌కాన్–2019 సదస్సులో మోదీ ప్రసంగించారు. రియల్టీ రంగం ప్రధాన అడ్డంకులు పాలసీలు, నిధుల సమస్య కాదు. భరోసా లేకపోవటం. డెవలపర్‌కు, కొనుగోలుదారులకు మధ్య నమ్మకం లేకపోతే ఈ రంగం కుదేలవుతుంది. అందుకే గత నాలుగున్నర ఏళ్లలో రియల్టీ రంగంలో భరోసా, పారదర్శకత చేకూర్చే పలు నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. ‘‘నోట్ల రద్దుతో అక్రమ పెట్టుబడులను నిరోధించాం. బినామీ, రెరా చట్టాలతో లావాదేవీల్లో పారదర్శకత, కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని తీసుకొచ్చాం. జీఎస్టీతో పన్నులను తగ్గించాం. రీట్స్ పెట్టుబడులపై డివెడెండ్ డిస్ట్రిట్యూషన్ పన్నును, విదేశీ పెట్టుబడుల సరళతరం కోసం సెక్టరల్ రిమ్మిటన్స్లను ఎత్తేశాం. వీటన్నింటితో రియల్టీ రంగంలో మళ్లీ భరోసా నెలకొంది. టెక్నాలజీ వినియోగం పెరగాలి.. రియల్టీ రంగంతో అభివృద్ధితో సిమెంట్, టైల్స్, పెయింట్స్ వంటి అనుబంధ రంగాలు కూడా వృద్ధి చెందుతాయి. ఉద్యోగ అవకాశాలూ పెరుగుతాయి. నిర్మాణ రంగంలో సాంకేతికత వినియోగం పెరగాలి. 12 లక్షల పీఎంఏవై గృహాలను సరికొత్త టెక్నాలజీతో నిర్మిస్తున్నాం. దీంతో నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటూ వేగవంతంగా పూర్తవుతాయన్నారు. టెక్నాలజీ వినియోగంతో పాటూ సహజ ఇంధన వనరులను వినియోగించాలి. వ్యర్థాల పునర్వినియోగం, వర్షపు నీరు, మురుగు నీటి శుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, పర్యావరణహితమైన నిర్మాణ సామగ్రిని వినియోగించాలని సూచించారు. జీవించడమూ నేర్పించాలి ‘గోడలు మారినంత మాత్రాన జీవితం మారదు’. అంటే అప్పటివరకు గుడిసెళ్లో ఉన్న వాళ్లకి సొంతిల్లు అందిస్తే అందులో ఎలా జీవించాలో తెలియదు. అందుకే డెవలపర్లు గృహాలు నిర్మించడంతో పాటూ ఆయా ఇళ్లలో ఎలా జీవించాలో కూడా నేర్పించాలి. టాయిలెట్ వినియోగం, నల్లా, ఎల్పీజీ గ్యాస్, ఇంధన వనరుల వాడకం వంటి వాటిపై అవగాహన చేయాలి. ఇందుకోసం క్రెడాయ్ మహిళ విభాగాలను ఏర్పాటు చేసి.. ఎన్జీవోలతో కలిసి ఆయా శిక్షణ శిబిరాలను చేపట్టాలని సూచించారు. గృహాల్లో యూపీఏ వర్సెస్ ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వం పదేళ్లలో పేదల గృహాల నిర్మాణం కోసం రూ.38 వేల కోట్లు వెచ్చిస్తే.. ఎన్డీఏ ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్లలో రూ.4 లక్షల కోట్లను వెచ్చించింది. పదేళ్లలో దేశంలో 13 లక్షల గృహాలను నిర్మిస్తే.. గత నాలుగున్నర ఏళ్లలో 73 లక్షల గృహాలను నిర్మించింది. పదేళ్లలో పట్టణ పేదల కోసం 8 లక్షల గృహాలను నిర్మిస్తే.. నాలుగున్నర ఏళ్లలో 1.5 లక్షల గృహాలను నిర్మించింది. ఇదే లక్ష్యంగా 2022 నాటికి దేశంలోని పేదలందరికీ గృహాలను అందిస్తామని ధీమావ్యక్తం చేశారు. ఎన్సీఎల్టీకి రియల్టీ కేసు వస్తే? రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఏమైనా కేసులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి వస్తే.. ముందుగా సంబంధిత రెరా అథారిటీకి సమాచారం అందించాలని మహారాష్ట్ర రెరా చీఫ్ గౌతమ్ చటర్జీ కోరారు. ‘‘ఎన్సీఎల్టీలో కేసు నమోదైతే సెక్షన్–14 ప్రకారం 6–9 నెలల పాటు ప్రాజెక్ట్‌లో ఎలాంటి కార్యకలాపాలు, లావాదేవీలు జరగవు. ఇది ఆయా నిర్మాణ సంస్థలకు ఆర్థిక ఇబ్బంది. ఒకవేళ ఐబీసీ కింద దివాళా ప్రక్రియకు ఆదేశిస్తే 30–50 శాతం నష్టాలు తప్పవు. ఐబీసీ కింద గృహ కొనుగోలుదారులు కూడా క్రెడిటర్స్ (రుణదాతలు) కాబట్టి వీళ్లూ 50 శాతం నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఎన్సీఎల్టీ కేసును ఆమోదించకముందే రెరాకు నివేదించాలని ఆయన సూచించారు. సమస్యను పరిష్కరించేందుకు అథారిటీకి 3–4 నెలల సమయం ఇవ్వాలని, అప్పటికీ పరిష్కారం కాకపోతే ఎన్సీఎల్టీ కేసును నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో నమో దు కానీ ప్రాజెక్ట్‌లను గుర్తించి సమాచారం అందించేందుకు ఇన్ఫార్మర్స్ పథకాన్ని ప్రారంభించామని చైర్మన్ ఆంటోనీ డీ సా తెలిపారుప్రస్తుతం రెరా చట్టం 28 రాష్ట్రాల్లో అమలులో ఉంది. 21 రాష్ట్రాలు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశాయి. ఇప్పటివరకు 35 వేల ప్రాజెక్ట్‌లు, 27 వేల మంది ఏజెంట్లు రెరాలో నమోదయ్యాయి. నెలకు రూ.3 వేలు పెన్షన్! అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం సరికొత్త పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధాన్‌మంత్రి శ్రమ్‌యోగి మాన్‌ధన్ (పీఎంఎస్‌వైఎం) పథకంలో నమోదైన కార్మికులకు నెలకు రూ.3 వేలు పెన్షన్ రూపంలో అందించనుంది. తొలి విడతగా ఈ స్కీమ్‌కు రూ.500 కోట్లను కేటాయించింది. స్కీమ్‌లో నమోదైన కార్మికులు వయస్సును బట్టి నెలకు రూ.55–100 జమ చేయాలి. అంతే మొత్తాన్ని కేంద్రం కూడా జమ చేస్తుంది. కార్మికునికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3 వేలు పెన్షన్‌ను అందుతుందని.. ఈ స్కీమ్‌తో వచ్చే ఐదేళ్లలో సుమారు 10 కోట్ల మంది కార్మికులు లబ్ధి పొందుతారని కేంద్రం అంచనా వేసింది. పీఎంఎస్‌వైఎం, పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై పథకాల్లో నిర్మాణ కార్మికులను భాగస్వామ్యం చేసేందుకు డెవలపర్లు ముందుకురావాలని కోరారు. -
సొంతింటికి దారి ఇదీ..!
ఇంటి కొనుగోలును ఆకర్షణీయం చేసే పలు నిర్ణయాలను మోదీ సర్కారు ఇటీవలి బడ్జెట్లో ప్రకటించింది. అందుబాటు గృహాలపై బిల్డర్లకు పన్ను రాయితీలను 2019–20 వరకు పొడిగించింది. అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లపైనా పన్ను మినహాయింపు రెండేళ్లకు పొడిగించారు. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే పన్ను మినహాయింపునిచ్చారు. దీనికి పైన మరో రెండు లక్షల ఆదాయం ఉన్న వారు రుణంపై ఇంటిని తీసుకుని వడ్డీ రూ.2 లక్షలు చెల్లించడం ద్వారా మొత్తం ఆదాయంపై పన్ను లేకుండా ప్రయోజనం పొందొచ్చు. త్వరలో ఇళ్లపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వచ్చేందుకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక బడ్జెట్‌కు ముందే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వడ్డీ సబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగించడం జరిగింది. ఇవన్నీ కలసి మధ్యతరగతి జీవులు సొంతింటి కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. అయితే, ఈ విషయంలో కచ్చితంగా దృష్టిపెట్టాల్సిన కొన్ని అంశాలున్నాయి. అవేంటో చూడండి మరి... ఇల్లు కొనుగోలు అన్నది ఆర్థికంగా ఓ పెద్ద నిర్ణయం. ఈ విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తుంటారు. సొంతిల్లును సమకూర్చుకోవడాన్ని చాలా ముఖ్యమైన విషయంగా చూస్తారనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. నిజానికి ఇది ఆర్థిక కట్టుబాటు కూడా. అందుకే ఇంటి కొనుగోలుకు సిద్ధమైన వారు ముందుగా చూడాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. రుణంతో మొదటి సారి ఇంటిని కొనాలనుకునే వారు.. డౌన్ పేమెంట్ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నెలవారీ సమాన వాయిదాల (ఈఎంఐ)ను సక్రమంగా చెల్లించే సామర్థ్యాన్ని కూడా అంచనా వేసుకోవాలి. వీటికి తోడు మరెన్నో అంశాలు ఇంటి కొనుగోలు సామర్థ్యాలను నిర్ణయిస్తాయి. అవన్నీ పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయాలి. డౌన్ పేమెంట్... ఇంటి రుణానికి డౌన్ పేమెంట్ తప్పనిసరి. ఓ ఇంటి కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చులో కొంత శాతాన్ని రుణం తీసుకోదలిచిన వ్యక్తి తన వంతుగా రెడీ చేసుకోవాల్సినదే డౌన్ పేమెంట్. రుణాలిచ్చే సంస్థలు సాధారణంగా ఇల్లు కొనుగోలు వ్యయంలో 20 శాతం డౌన్‌పేమెంట్ కింద అడుగుతాయి. ఉదాహరణకు రూ.50 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేసే వారు కనీసం తమ వంతుగా రూ.10 లక్షలను డౌన్‌పేమెంట్‌గా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన రూ.40 లక్షలను బ్యాంకులు రుణంగా ఇస్తాయి. ఇంటి కొనుగోలు విలువ... డౌన్‌పేమెంట్ ఎంతన్నది నిర్ణయిస్తుంది. ఒకవేళ ఈ మొత్తం లేకపోతే ఇంటి రుణం సాధ్యం కానట్టే. అత్యవసరాలనూ దృష్టిలో ఉంచుకోవాల్సిందే జీవితంలో అత్యవసరాలు ఎప్పుడైనా ఎదురుకావచ్చు. వాటిని తప్పించుకోలేం. అటువంటి పరిస్థితులను అధిగమించేందుకు ముందే తగిన విధంగా సన్నద్ధం కావాలి. సొంతింటి కోసం అప్పటి వరకు పొదుపు చేసిన మొత్తాన్ని డౌన్ పేమెంట్ కోసం వినియోగిస్తే... వేతనంలో మిగిలేదంతా ఈఎంఐగా పోతుంటే... అత్యవసరం ఎదురైతే ఏంటి పరిస్థితి? ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే..? అందుకే అత్యవసర నిధిని పక్కన పెట్టి మిగిలిన మొత్తానే డౌన్‌పేమెంట్‌గా వాడుకోవడం వివేకం. కనీసం ఆరు నెలల కుటుంబ అవసరాలకు సరిపడా మొత్తాన్నే అత్యవసర నిధిగా ఉంచుకోవాలి. అలాగే, ఇంటి రుణం తీసుకునే వారు, అత్యవసర నిధికి అదనంగా మూడు నెలల ఈఎంఐ మొత్తాన్ని కూడా విడిగా రెడీగా ఉంచుకోవాలి. ముఖ్య లక్ష్యాల కోసం పెట్టుబడులు... డౌన్ పేమెంట్‌ను సమకూర్చుకుని, అత్యవసర నిధిని పక్కన పెట్టి, నెలవారీ ఈఎంఐ చెల్లించడంతోనే అన్ని బాధ్యతలు తీరినట్టు కాదు. జీవితంలో కీలకమైన లక్ష్యాలు వేరేవీ ఉన్నాయి. పిల్లల ఉన్నత విద్య ఇందులో ఎంతో ముఖ్యమైనది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. పిల్లల ఉన్నత విద్య వంటి కీలక లక్ష్యాలకు అవసరమైనంత సమకూర్చుకునేందుకు ప్రతి నెలా కొంత మేర ఇన్వెస్ట్ చేస్తుండాలి. దీనికి తోడు స్వల్పకాల లక్ష్యాలు ఏవైనా ఉన్నాయా అన్నది చూసుకోవాలి. వీటికి పెట్టుబడులు పోను వేతనంలో ఎంత మిగులుతుంది, ఎంత ఈఎంఐగా చెల్లించగలరన్నది నిర్ణయించుకోవాలి. చాలా మంది సొంతింటిని సమకూర్చుకునే విషయంలో కీలకమైన పెట్టుబడులు, అత్యవసరాలను విస్మరిస్తుంటారు. ఈఎంఐ మొత్తాన్ని నిర్ణయించుకోవడంలోనూ అన్ని అంశాలను చూడరు. అందుకే ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి రావాలి. ఈఎంఐ ఎంత మేర...? డౌన్ పేమెంట్ అవసరమైనంత ఉన్న వారు చూడాల్సిన తదుపరి అంశం ఈఎంఐ. రుణం తీసుకుంటే నెలవారీగా ఈఎంఐ మొత్తాన్ని చెల్లించగల సామర్థ్యం ఉందా? అనేది చూడాలి. కట్టగలమన్న నమ్మకం వేరు, సామర్థ్యం వేరు. ఉదాహరణకు మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐ మొత్తం 30–40 శాతాన్ని మించరాదనేది పాటించాల్సిన సూత్రం. ఇక ఈఎంఐ ఎంతన్నది రుణం ఎంత తీసుకుంటున్నారనే అంశంతోపాటు, ఎంత కాలానికి తీసుకుంటున్నారనేదీ నిర్ణయిస్తుంది. ఉదాహరణకు నెలవారీ ఆదాయం రూ.75,000 ఉందనుకుంటే... 9.5 శాతం వడ్డీ రేటు ప్రకారం ఎంత కాలానికి, ఎంత రుణం తీసుకుంటే ఈఎంఐ ఎంత ఉంటుందంటే... ఆదాయంలో ఈఎంఐ 20% ► రూ.18 లక్షల ఇంటికి 20 శాతం డౌన్ పేమెంట్ పోను బ్యాంకులు రూ.14.4 లక్షల రుణం ఇస్తాయి. 15 ఏళ్ల కాలానికి తీసుకుంటే 9.5 శాతం వడ్డీ రేటు ప్రకారం ఈఎంఐ రూ15,000 అవుతుంది. అంటే రూ.75,000 నెలసరి ఆదాయంలో 20 శాతాన్ని ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది. ► రూ.20 లక్షల ఇంటికి బ్యాంకులు రూ.16 లక్షల రుణం ఇస్తాయి కనుక 20 ఏళ్ల కాలాన్ని నిర్ణయించుకుంటే అప్పుడు కూడా ఈఎంఐ రూ.15,000 అవుతుంది. రుణం పెరిగినప్పటికీ కాల వ్యవధి ఐదేళ్లు పెంచుకున్నారు గనుక ఈఎంఐ మొదటి ఉదాహరణలో మాదిరే ఉంటుంది. ► ఇక రూ.21.5 లక్షల ఇంటికి బ్యాంకులు రూ.17.2 లక్షల రుణాన్ని ఇస్తాయి. దీనిపైనా రూ.15,000 ఈఎంఐ ఉండాలనుకుంటే ఇంటి రుణ కాల వ్యవధిని 25 ఏళ్లుగా చేసుకుంటే సరిపోతుంది. ఆదాయంలో ఈఎంఐ 30% ► రూ.26.8 లక్షల ఇంటికి డౌన్ పేమెంట్ పోను రూ.21.5 లక్షలు రుణంగా లభిస్తుంది. 15 ఏళ్ల టర్మ్ పెట్టుకుంటే ఈఎంఐ రూ.22,500 అవుతుంది. ► రూ.30.3 లక్షల ఇంటికి 24.2 లక్షలు రుణంగా తీసుకుంటే టర్మ్‌ను 20 ఏళ్లుగా నిర్ణయించుకున్నా కూడా ఈఎంఐ రూ.22,500 అవుతుంది. ► రూ.32.3 లక్షల ఇంటికి రూ.25.8 లక్షలు రుణంగా లభిస్తుంది. 25 ఏళ్ల టర్మ్‌ను నిర్ణయించుకుంటే ఈఎంఐ 22,500 అవుతుంది. ఆదాయంలో ఈఎంఐ 40% ► రూ.36 లక్షల ఇంటిపై రూ.28.8 లక్షల రుణానికి గాను, 15 ఏళ్ల టర్మ్‌కు ఈఎంఐ రూ.30,000. ► రూ.40.3 లక్షల ఇంటికి రూ.28.8 లక్షల రుణం లభిస్తుంది. రుణం చెల్లించాల్సిన వ్యవధి 20 ఏళ్లు అయితే అప్పుడూ ఈఎంఐ రూ.30,000 దాటదు. ► ఇక రూ.43 లక్షల ఇంటికి 20 శాతం డౌన్ పేమెంట్ పోను వచ్చే రుణం రూ.34.4 లక్షలు. కాల వ్యవధి 25 ఏళ్లు అయితే ఈఎంఐ రూ.30,000 అవుతుంది. నెలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే తప్ప, ఈఎంఐ 20 శాతానికి మించకుండా ఉంటే దాన్ని సురక్షితంగా భావించొచ్చు. ఒకవేళ డౌన్ పేమెంట్ 20 శాతానికి మించి సమకూర్చుకుంటే అప్పుడు కూడా ఈఎంఐ భారం తగ్గుతుంది. నెల వేతనంలో ఈఎంఐ 40 శాతం వరకు ఉంటే చెల్లింపులు కష్టం కావచ్చు. తప్పదనుకుంటే నెల ఆదాయంలో 30 శాతాన్ని ఈఎంఐగా నిర్ణయించుకోవచ్చు. కొందరు దంపతులు ఇద్దరూ కలసి ఇంటి రుణం తీసుకుంటుంటారు. ఇరువురు ఆర్జనాపరులైతే అధిక ఈఎంఐ చెల్లించగలరు. అయితే, రుణ కాల వ్యవధి ముగిసే వరకు ఇద్దరూ ఆర్జనను కొనసాగించాలి. లేదంటే మధ్యలో ఇల్లాలు కుటుంబ అవసరాల కోసం ఉద్యోగాన్ని విడిచిపెడితే, అప్పుడు భారీ ఈఎంఐ భారం ఆమె భాగస్వామి ఒక్కరిపైనే పడుతుంది. దీన్ని ముందే ఆలోచించుకోవాలి. -
మిడిల్ క్లాస్ మోదీ..
మధ్య తరగతికి.. మహా ఊరట! ఇది..ముచ్చటగా 3 కోట్ల మందిపై ప్రధాని వేసిన సమ్మోహనాస్త్రం. ఏడాదికి 5 లక్షల రూపాయల్లోపు ఆదాయాన్ని ఆర్జించేవారు రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు. వీరేకాదు.. రకరకాల మినహాయింపులు, ఇన్వెస్ట్మెంట్లను పరిగణనలోకి తీసుకుంటే రూ. 8–9 లక్షల వార్షికాదాయం ఉన్నవారు కూడా పైసా పన్ను కట్టకుండా తప్పించుకోవచ్చు. కాకపోతే ఏడాదికి దాదాపుగా రూ.10 లక్షలు, ఆపైన ఆర్జించేవారికి మాత్రం ఈ బడ్జెట్‌తో ఒరిగిందేమీ లేదు. అందుకే కావచ్చు.. ఈ ఏడాదికి తాము ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో ఈ వర్గాల గురించీ ఆలోచిస్తామన్నారు గోయల్. న్యూఢిల్లీ: ఎన్నికల వేళ ప్రధాని మోదీ మిడిల్ క్లాస్ వేతన జీవుల మనసు గెలిచే ప్రయత్నం చేశారు. పన్ను శ్లాబులను మార్చకుండా వారికి ఉపశమనం కల్పించారు. పన్ను చెల్లించాల్సిన ఆదాయం గనక రూ.5 లక్షలలోపు ఉంటే.. వారెలాంటి పొదుపులూ చేయకపోయినా పూర్తిగా పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఈ మేరకు సెక్షన్ 87ఏ కింద ఇస్తున్న రిబేటును రూ.2,500 నుంచి రూ.12,500కు పెంచుతూ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు. గతంలో సెక్షన్ 87ఏ రిబేటు పరిమితి రూ.3.50 లక్షలుండగా దీన్ని రూ.5 లక్షలకు పెంచారు. దీంతో రూ.5 లక్షలలోపు పన్ను ఆదాయం (ట్యాక్సబుల్ ఇన్కమ్) ఉన్నవారు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. గోయల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాక లోక్‌సభ కొన్ని నిమిషాల సేపు బీజేపీ కార్యవర్గ సమావేశం మాదిరిగా మారిపోయింది. ఎన్డీఏ ఎంపీలంతా మోదీ... మోదీ అంటూ సభను మార్మోగించారు. ఈ రిబేటు పరిమితిని పెంచడం వల్ల 3 కోట్ల మంది ఉద్యోగులకు రూ.18,500 కోట్ల మేర పన్ను భారం తగ్గుతుందని గోయల్ ప్రకటించారు. అంతేకాదు సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.5 లక్షల మినహాయింపు, ఇంటి రుణానికి చెల్లించే వడ్డీ, ఆరోగ్య బీమా ప్రీమియం వంటి ఇతర మినహాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే రూ.9 లక్షల వార్షికాదాయం ఉన్న వారూ పన్ను కట్టక్కర్లేదు. అయితే ట్యాక్సబుల్ ఇన్కమ్ కనక రూ.5 లక్షలకన్నా రూపాయి దాటినా.. వారు మునుపటిలానే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గత నాలుగేళ్లుగా అమలు చేసిన సంస్క రణలు ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల ఆదాయం పెరిగిందని, ఈ ప్రయోజనాన్ని తిరిగి వారికి అందించాలని ఉన్నా ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో వేతనజీవుల వరకు మాత్రమే పరిమితమవుతున్నామని గోయల్ స్పష్టం చేశారు. బేసిక్ లిమిట్లో మార్పు లేదు... బడ్జెట్ ప్రసంగంలో గోయల్ రూ.5 లక్షలలోపు వారికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరంలేదని ప్రకటించడంతో అందరూ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచినట్లు భావించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం... పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని, కేవలం సెక్షన్ 87 రిబేటు పరిమితిని రూ.3,50,000 నుంచి రూ.5,00,000 మాత్రమే పెంచామని, మును పటి శ్లాబులు యథాతథంగా కొనసాగుతాయని వివరణ ఇచ్చింది. సెక్షన్ 87ఏ పరిమితిని పెంచడం వల్ల పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.5 లక్షలలోపు గనక ఉంటే... వారికి గరిష్టంగా రూ.12,500 ప్రయోజనం లభిస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచడం వల్ల రూ.2,080 నుంచి రూ.3,120 వరకు ప్రయోజనం లభించనుంది. ఈ రెండింటిని కలిపితే గరిష్టంగా రూ.15,000 వరకు ప్రయోజనం చేకూరనుంది. రెండో ఇంటికీ ‘క్యాపిటల్’ గెయిన్స్ ఏదైనా ఇంటిని విక్రయించినపుడు వచ్చిన దీర్ఘకాలిక మూలధన పన్ను లాభాలను రెండు ఇళ్లకు వర్తింప చేస్తూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం ఏదైనా ఒక ఇంటిని విక్రయించినపుడు దానిపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను చెల్లించాలి. ఒకవేళ ఈ పన్ను భారాన్ని తప్పించుకోవాలంటే ఈ లాభాలతో మరో ఇంటిని కొనుగోలు చేయవచ్చు. ఇంతకాలం ఇది కేవలం ఒక ఇంటి కొనుగోలుకే వర్తించేది. ఇప్పుడు దీన్ని రెండు ఇళ్లను కొనుగోలు చేయడానికి అనుమతించారు. ఈ విధంగా గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకూ వచ్చే మొత్తానికి దీర్ఘకాలిక మూలధన పన్ను లాభాలు వర్తిస్తాయి. కాకపోతే ఈ ప్రయోజనాన్ని జీవితంలో ఒకసారి మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. అదే విధంగా వేతన జీవులు ఉద్యోగార్థం ఒక ఇంటిలో ఉండి మరో ఇల్లు ఖాళీగా ఉంచినా దానిని ఊహాజనిత ఆదాయంగా లెక్కించి పన్ను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు రెండో ఇంటిని ఊహాజనిత ఆదాయం నుంచి మినహాయించారు. పెన్షన్‌దారులకు ఊరట కేవలం వడ్డీనే ఆదాయంగా ఉన్న వారికి మోదీ సర్కార్ పెద్ద ఊరటనిచ్చింది. పోస్టాఫీసులు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వాటిపై వచ్చే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ (మూలం వద్ద ఆదాయ పన్ను) పరిమితిని 3 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏడాదిలో వడ్డీ రూపంలో వచ్చే మొత్తం రూ.10,000 దాటితే టీడీఎస్ చెల్లించాల్సి వచ్చేది. ఒకవేళ టీడీఎస్ చెల్లించకూడదనుకుంటే... తమ మొత్తం ఆదాయం పన్ను పరిమితికి లోబడే ఉందని నిర్ధారిస్తూ బ్యాంకుకు డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.40,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంటే రూ.40,000 దాటేదాకా ఎలాంటి టీడీఎస్ ఉండదు. డిక్లరేషన్ అవసరం లేదు. అదే విధంగా ఇంటి అద్దెల రూపంలో వసూలు చేసే మొత్తంపై కూడా టీడీఎస్ పరిమితిని పెంచారు. ఇప్పటి వరకు ఇంటద్దెల రూపంలో వచ్చే ఆదాయం ఏడాదికి రూ.1.80 లక్షలు దాటితే (నెలకు రూ.15వేలు) టీడీఎస్ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.2.40 లక్షలకు (నెలకు రూ.20 వేలకు) పెంచారు. -
వేతన జీవులకు భారీ ఊరట
-
మిల్లర్ల మాయాజాలం
సాక్షి, విశాఖపట్నం : నిత్యావసరాల ధరలు నింగిలో విహరిస్తున్నాయి.. బియ్యం ధరలే కాస్త అందుబాటులో ఉన్నాయనుకుంటే అవీ భారమవుతున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి బియ్యం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. క్వింటాలుకు రూ.500, పాతిక కిలోల బ్యాగ్‌పై రూ.100కు పైగా పెరిగాయి. సాధారణంగా మార్చి నుంచి బియ్యం ధరలు అందుబాటులో ఉంటాయి. మునుపటికంటే తగ్గుతాయి. ఎందుకంటే.. జనవరితో పంట చేతికొస్తుంది. రైతులు అప్పట్నుంచి ధాన్యాన్ని రెండు నెలల పాటు నిల్వ ఉంచుతారు. వాటిని వ్యాపారులు కొనుగోలు చేసి మిల్లుల్లో మర పట్టించి మార్కెట్‌కు తరలిస్తారు. ఫలితంగా జులై, ఆగస్టు నెలల వరకు బియ్యం ధరలు కాస్త తగ్గుముఖం పడతాయి. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు బియ్యం ధరలు పెరుగుతున్నాయి. మిల్లర్లు సిండికేట్ అయి బియ్యం సరఫరాలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధాన్యం లభ్యత ఆశించినంతగా లేకపోవడంతో బియ్యం ధరలు పెంచక తప్పడం లేదని మిల్లర్లు చెబుతున్నారు. వాస్తవానికి బియ్యాన్ని ప్రభుత్వానికి లెవీ ఇస్తున్నందున ఆ లోటును భర్తీ చేసుకోవడానికి మిల్లర్లు ధరలు పెంచుతున్నారని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు వేసవికాలంలో ధాన్యం మరపట్టిస్తే నూక ఎక్కువగా వచ్చి బియ్యం దిగుబడి తగ్గుతుందన్నది మరో వాదన. దీన్ని దృష్టిలో ఉంచుకుని కూడా మిల్లర్లు నష్టపోకుండా బియ్యం ధరలు పెంచుతుంటారని అంటున్నారు. కాగా రానున్న రెండు, మూడు నెలల వరకు వీటి ధరల పెరుగుదల కొనసాగవచ్చని, ప్రస్తుతంకంటే ఒకింత ఎగబాకే అవకాశం ఉందని బియ్యం వ్యాపారులు చెబుతున్నారు. రోజుకు 4 లక్షల కిలోల వినియోగం విశాఖ నగరంలో రోజుకు సగటున 4 లక్షల కిలోల బియ్యం వినియోగమవుతుందని అంచనా. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రస్తుతం సరుకు మార్కెట్‌కు రావడం లేదు. మిల్లర్ల ముందస్తు వ్యూహంలో భాగంగా సరుకును తగ్గిస్తున్నట్టు చెబుతున్నారు. ఫలితంగా మార్కెట్లో బియ్యానికి డిమాండ్/కృత్రిమ కొరత సృష్టించి, ధర పెరగడానికి దోహదపడుతున్నట్టు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, సరుకులు, కూరగాయల ధరలు భారంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు బియ్యం రేట్లు కూడా వాటితో పోటీపడుతుండడంపై వినియోగదారుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. అధికారులు రంగంలోకి దిగి బియ్యం ధరలను కట్టడి చేయాలని కోరుతున్నారు. ధరలు తగ్గించకపోతే ఎలా? ఇప్పటికే మార్కెట్లో పప్పుదినుసులు, నూనెల ధరలు మధ్య తరగతి వారికి భారంగా మారాయి. ఇప్పుడు వాటికి బియ్యం రేట్లు కూడా తోడయ్యాయి. వీటి ధరల పెరుగుదలను నియంత్రించాలన్న ఆలోచన ప్రభుత్వానికి గాని, అధికారులకు గాని కలగడం లేదు. ఎవరుష్టానుసారం వారు రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యులే బాధితులవుతున్నారు. బియ్యం ధరల పెరుగుదలకు కారకులయ్యే వారిపై చర్యలు తీసుకుని కట్టడి చేయాలి. – కుప్పిలి నిర్మల్‌కుమార్, చైతన్యనగర్, సీతమ్మధార -
రూ.20వేలు..అన్నీ రూ.10 నాణేలే
జడ్చర్ల టౌన్: డబ్బుల కష్టాలు అన్నీఇన్నీ కావు. గురువారం డబ్బుల కోసం మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి ఎస్‌బీహెచ్‌కు వెళ్లిన సంతోశ్ అనే ఖాతాదారుడికి దిమ్మ తిరిగేలా రూ.10 నాణేలతో కూడిన రూ.20వేల సంచిని అందించారు బ్యాంకు అధికారులు. గురువారం బ్యాంక్‌కు వెళ్లిన ఖాతాదారులకు నగదు ఇస్తున్నామని చెప్పారు. దీంతో ఖాతాదారులు పెద్ద క్యూ కట్టారు. దాదాపు 100 మందికిపైగా రూ.20 వేలు విలువ చేసే నాణేలను తీసుకెళ్లారు. కొందరికీ రూ.2 వేల నోట్లు వస్తే వాటిని మార్చుకుని చిల్లర తీసుకునేందుకు ఇబ్బంది రాగా, మరికొందరికి చిల్లర ఉండి నోట్లుగా మార్చుకునేందుకు ఇబ్బంది వచ్చింది.