lunar cycle
-
ఈ–లూనా వచ్చేసింది
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లోకి ఈ–లూనా అడుగు పెట్టింది. కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ఆవిష్కరించారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ–లూనా ఎలక్ట్రిక్ రవాణాకు వీలు కలి్పస్తుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష ఈ–లూనాలను విక్రయించనున్నట్టు కినెటిక్ గ్రీన్ వ్యవస్థాపకురాలు, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ తెలిపారు. బీటూబీ కస్టమర్లు, ఈ–కామర్స్ సంస్థల నుంచి మంచి స్పందన వచ్చిందని, వారికి 50,000 యూనిట్లు విక్రయిస్తామనే అంచనాతో ఉన్నట్టు చెప్పారు. ఈ–లూనా ఆరంభ ధర రూ.69,990 (ఎక్స్‌షోరూమ్). 2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీతో వచ్చే ఈ–లూనా ఒక్కసారి చార్జింగ్‌తో 110 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల టర్నోవర్ సాధించాలని.. ఇందులో రూ.800 కోట్ల ఆదాయం ఈ–లూనా నుంచే వస్తుందన్న అంచనాతో కంపెనీ ఉంది. -
రెండు రోజుల్లో చంద్రుడిపై పగలు.. రోవర్, ల్యాండర్ పరిస్థితి?
బెంగళూరు: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 సక్సెస్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు ఇప్పటికే కీలక సమాచారాన్ని అందించాయి. అయితే, చంద్రుడిపై లూనార్ నైట్ ప్రారంభం కావడంతో ఇస్రో.. ఈ నెల 2, 4 తేదీల్లో ల్యాండర్, రోవర్లను నిద్రాణ స్థితిలోకి పంపింది. రోవర్, ల్యాండర్ నిద్రలేచేనా? ఇదిలా ఉండగా.. తాజాగా చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు నిద్రాణస్థితి నుంచి బయటకు రావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చంద్రుడిపై రాత్రి ముగిసిపోయి, తిరిగి పగలు మొదలయ్యాక 22న ల్యాండర్, రోవర్ స్లీప్ మోడ్ నుంచి బయటకు వస్తాయని ఇస్రో అంచనా వేస్తోంది. లూనార్ డే మొదలైన తర్వాత ల్యాండర్, రోవర్ మళ్లీ ఎలా పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అక్కడి మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎలక్ట్రానిక్ పరికరాలు తట్టుకోవడం, రీఛార్జి కావడంపైనే ఇది ఆధారపడి ఉంది. అయితే, రోవర్, ల్యాండర్లను మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Chandrayaan-3 Mission: Vikram Lander is set into sleep mode around 08:00 Hrs. IST today. Prior to that, in-situ experiments by ChaSTE, RAMBHA-LP and ILSA payloads are performed at the new location. The data collected is received at the Earth. Payloads are now switched off.… pic.twitter.com/vwOWLcbm6P — ISRO (@isro) September 4, 2023 చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరిస్తూ అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. అయితే.. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన దృశ్యాలను 3డీ ప్రింటింగ్‌ని ఇస్రో విడుదల చేసింది. మరోవైపు.. రోవర్ ప్రజ్ఞాన్ సరైన దారిని వెతుక్కునే క్రమంలో అక్కడక్కడే తిరుగాడుతున్న దృశ్యాలను ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీడియో తీసింది. ఈ వీడియోను ఇస్రో తన అధికారిక ఖాతాలో పంచుకుంది. Chandrayaan-3 Mission: The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera. It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately. Isn't it?🙂 pic.twitter.com/w5FwFZzDMp — ISRO (@isro) August 31, 2023 విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రజ్ఞాన్.. పరిశోధనలను కొనసాగిస్తోంది. చంద్రునిపై నీటిజాడ, వాయువులు, మట్టి, అక్కడ దొరుకుతున్న రసాయనిక పదార్థాల గురించి ఆరా తీస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సల్ఫర్ మూలకం పుష్కలంగా ఉందని ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే గుర్తించింది. అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీసు, సిలికాన్, ఆక్సిజన్ కూడా అక్కడ ఉన్నట్లు కనుగొంది. చంద్రునిపై ఉష్ణ్రోగ్రత 70 డిగ్రీల వరకు ఉంటోందని ఇస్రో తెలిపింది. Chandrayaan-3 Mission: Anaglyph is a simple visualization of the object or terrain in three dimensions from stereo or multi-view images. The Anaglyph presented here is created using NavCam Stereo Images, which consist of both a left and right image captured onboard the Pragyan… pic.twitter.com/T8ksnvrovA — ISRO (@isro) September 5, 2023 Chandrayaan-3 Mission: 🏏Pragyan 100* Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ — ISRO (@isro) September 2, 2023 -
వావ్! ఎలక్ట్రిక్ వెహికల్‌గా..లూనా మళ్లీ వచ్చేస్తోంది!
న్యూఢిల్లీ: చిన్న బండి లూనా గుర్తుంది కదూ. ఒకప్పుడు ప్రాచుర్యంలో ఉన్న ఈ మోపెడ్ కొద్ది రోజుల్లో ఎలక్ట్రిక్ లూనా రూపంలో వస్తోంది. కినెటిక్ గ్రీన్ ఎనర్జీ, పవర్ సొల్యూషన్స్ దీనిని ప్రవేశపెట్టనుంది. చాసిస్, ఇతర విడిభాగాల తయారీ ఇప్పటికే మొదలైందని కినెటిక్ గ్రూప్ ప్రకటించింది. నెలకు 5,000 యూనిట్ల తయారీ సామర్థ్యంతో ప్రత్యేక యూనిట్ సైతం అహ్మద్‌నగర్ ప్లాంటులో ఏర్పాటైంది. లూనా అమ్మకాల ద్వారా వచ్చే 2–3 ఏళ్లలో ఏటా రూ.30 కోట్ల ఆదాయం సమకూరుతుందని కినెటిక్ ఇంజనీరింగ్ ఎండీ ఆజింక్యా ఫిరోదియా తెలిపారు. -
తిథి, వార, నక్షత్రాలను చూసి నిర్ణయిస్తారా?
మామూలుగా ఎన్నికల తేదీలు నిర్ధారించాలంటే సెలవులు, పండుగలు, పరీక్షలు, తీర్థాలు, జాతరల వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. దీనితో పాటు వాతావరణం, వానలు పడతాయా, చలి ఎలా ఉంటుంది వంటి కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఈ సారి వీటన్నిటితో పాటు పోలింగ్ తేదీ అమావాస్య నాడు లేదా కృష్ణపక్షంలో ఉండకుండా, పౌర్ణమికి దగ్గరగా అంటే శుక్లపక్షంలో ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ జ్యోతిష్యాన్నో లేక పంచాంగాన్నో నమ్ముకుందా? ఎన్నికల తేదీలు కూడా తిథి, వార, నక్షత్రాలను చూసి నిర్ణయిస్తారా? ఇలాంటి అనుమానాలు రావడం సహజం. అయితే దీని వెనుక వేరే లెక్కలేవీ లేవు. దేశంలోని 9 రాష్ట్రాల్లోని 83 నక్సల్ ప్రభావిత జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించడం చాలా ప్రమాదభరితమైన పని. నక్సల్స్ మందుపాతరలు పేల్పవచ్చు. పోలింగ్ బూత్ లను ధ్వంసం చేయొచ్చు. పోలింగ్ సిబ్బందిని అపహరించవచ్చు. అమావాస్య లేదా కృష్ణపక్షం సమయంలో రాత్రి పూట చిమ్మచీకటిగా ఉంటుంది. దీని వల్ల దాడులు చేయడం సులువవుతుంది. అదే శుక్లపక్షం అయితే రాత్రి పూట వెన్నెల బాగా ఉంటుంది. నక్సల్ కదలికలను గమనించడానికి వీలవుతుంది. నక్సల్ దాడికి కూడా అనుకూల పరిస్థితులు ఉండవు. అందుకే రాత్రి వెన్నెల వెలుగు ఉండేలా శుక్లపక్షంలోనే నక్సల్ ప్రభావిత ప్రాంతాల పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నక్సల్ ప్రభావిత క్షేత్రాల్లో ఒకే సారి ఎన్నికలు జరిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏప్రిల్ 10 న ఈ పోలింగ్ జరుగుతుంది.