ఎల్‌జీ నుంచి 4 కొత్త ఉత్పత్తులు | LG L90 Receives Android 5 Lollipop Update | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ నుంచి 4 కొత్త ఉత్పత్తులు

Published Thu, Mar 19 2015 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

ఎల్‌జీ నుంచి 4 కొత్త ఉత్పత్తులు

ఎల్‌జీ నుంచి 4 కొత్త ఉత్పత్తులు

న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఈ ఏడాది భారత్‌లో రూ. 23,500 కోట్ల టర్నోవరును లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 25 శాతం అధికం. 2014లో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా టర్నోవరు రూ. 18,500 కోట్లు. ఇక, పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలపై కంపెనీ ఈ ఏడాది కనీసం రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.

బుధవారం ఎల్‌జీ ఇండియా టెక్ షో 2015 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ సూన్ వాన్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తమ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి అంతర్జాతీయంగా టాప్ 5 దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆయన చెప్పారు. రాబోయే మూడేళ్లలో భారత్‌ను తమకు మూడో అతి పెద్ద మార్కెట్‌గా మల్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు వాన్ వివరించారు.
 
105 అంగుళాల టీవీ..: టెక్‌షోలో భాగంగా మొబైల్స్, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎయిర్ కండీషనర్స్, గృహోపకరణాలకు సంబంధించి 4 కొత్త ఉత్పత్తులను ఎల్‌జీ ఆవిష్కరించింది. తమ రెండో కర్వ్‌డ్ స్మార్ట్ ఫోన్ జీ ఫ్లెక్స్2ని, 105 అంగుళాల టీవీని ప్రవేశపెట్టింది. జీ ఫ్లెక్స్ ధర రూ. 55,000 కాగా టీవీ రేటు రూ. 60 లక్షలు. మొబైల్స్ విభాగంలో ఈ ఏడాది 30 కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వాన్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement