LG Electronics
-
కే–పాప్ కాంటెస్ట్‌లో విజేతలు వీరే..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో కొరియన్ పాప్ సంగీతం(కే–పాప్)కు నగరంలోనూ క్రేజ్ పెరిగిన నేపథ్యంలో యువత ఆసక్తిని ప్రోత్సహించేందుకు కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియాతో కలిసి ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా నిర్వహించిన కే–పాప్ సంగీత పోటీల్లో కోల్‌కతాకు చెందిన అభిప్రియ చక్రవర్తి విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరం నుంచి పలువురు కే–పాప్ యూత్‌ను ఆకట్టుకున్న ఈ పోటీల్లో డ్యాన్సింగ్ విభాగంలో టైటిల్‌ను ది ట్రెండ్ ఫ్రమ్ ఇటానగర్ ఆల్బమ్ సొంతం చేసుకుందని, విజేతలకు కొరియా ట్రిప్‌ను బహుమతిగా అందించనున్నట్లు వివరించారు.అలరించిన.. సంగీత్ సమారోహ్ మాదాపూర్‌లోని సీసీఆర్టీ (సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ ట్రైనింగ్)లో పండిత్ జష్రాజ్ 52వ పండిత్ మోతీరాం పండిత్ మనీరాం సంగీత్ సమారోహ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రిషి, మహిమా ఉపాధ్యాయులు పాకవజ డ్యూయోట్ను, నటి శోభన భరతనాట్య ప్రదర్శన, అభిషేక్ రఘురాం కర్ణాటక సంగీతంతో ఆకట్టుకున్నారు. పద్యనాటకం.. నటన అద్భుతం పురాకృతి దశమ వార్షికోత్సవాలు చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు అలరించాయి. పాదుకా పట్టాభిషేకం, భక్త పోతన, శ్రీకృష్ణ రాయభారం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సమావేశంలో కళాకారుడు ఉప్పలపాడు షేక్ సైదులుకు జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. అదే విధంగా ప్రముఖ నటులు మల్లాది గోపాలకృష్ణ, ఇందిరాదేవికు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు శ్రీహరిరావు, సాంబశివారెడ్డి, షేక్‌లాల్ అహ్మద్, పొత్తూరు సుబ్బారావు, నాగేశ్వర్రావు, కళ్యాణ్, మల్లాది వెంకటరమణ, పుట్రేవు పరివారం తదితరులు పాల్గొన్నారు. భగవద్గీతతో జీవన నిర్వహణగీతా సారాంశాన్ని అర్థం చేసుకోవడం, ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనడం, మానవ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, సమతుల్యమైన జీవితాన్ని గడపడం వంటి అవసరమైన అంశాలపై ఆధ్యాత్మిక బోధనలను ఆధ్యాత్మిక గురువు సుఖబోధానంద స్వామి వివరించనున్నారు. ఈ నెల 30, వచ్చే నెల 1వ తేదీల్లో భగవద్గీతతో జీవన నిర్వహణ అనే అంశంపై రెండు రోజుల పాటు విశ్వేశ్వరయ్య భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
హైదరాబాద్‌లో ఎల్జీ ఆవిష్కరణల సదస్సు
హైదరాబాద్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్జీ ఎలక్ట్రా నిక్స్ హైదరాబాద్‌లో ‘ఆవిష్కరణల పునరుద్ధరణ’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది.ఇందులో తన డిస్ప్లే ఉత్పత్తి ఎల్జీ మ్యాగ్నిట్తోపాటు 136 ఆల్ ఇన్ వన్ ఎల్ఈడీ, ఎల్జీ వన్: క్విక్ ఫ్లెక్స్, ఎల్జీ వన్: క్విక్వర్క్స్, ఎల్జీ క్రియేట్ బోర్డ్ తదితర ఉత్పత్తులు, సొల్యూషన్లను ప్రదర్శించింది. ఈ వార్షిక సదస్సుకు కస్టమర్లు, భాగ స్వాములు, సిస్టమ్ ఇంటెగ్రేటర్లు విచ్చేసినట్టు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తెలిపింది. ఎల్జీకి సంబంధించి డిస్ప్లే ఉత్పత్తులు, సొల్యూషన్ల గురించి కస్టమర్లు తెలుసుకునే వీలు కల్పించడ మే ఈ సదస్సు ఉద్దేశ్యమని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండి యా బిజినెస్ హెడ్ హేమేందు సిన్హా తెలిపారు. -
కొత్త టెక్నాలజీతో ఎల్జీ ఫ్రిజ్.. ఎక్కడ నుంచైనా ఆపరేట్ చేయొచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ మేకిన్ ఇండియా నినాదంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా పుణెలో సైడ్ బై సైడ్ (ఎస్ బీ ఎస్) ఫ్రిజ్ ల తయారీ కోసం కొత్త యూనిట్ ప్రారంభించింది. రూ. 200 కోట్లతో దీన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ భారత విభాగం ఎండీ హోంగ్ జు జియోన్ తెలిపారు. దీని వార్షిక తయారీ సామర్థ్యం 2 లక్షల యూనిట్లుగా ఉంటుందని వివరించారు. తాజాగా దేశీయంగానే వీటిని తయారు చేయడం వల్ల ధరలు కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. గతేడాదే దేశీయంగా విండో ఏసీల తయారీని ప్రారంభించినట్లు జియోన్ చెప్పారు. భారత్ లో ఎస్ బీ ఎస్ ఫ్రిజ్ ల విభాగంలో తమకు 50 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా ఫ్రిజ్ ల విభాగంలో తమకు 34 శాతం, వాషింగ్ మెషీన్ల విభాగంలో 37 శాతం వాటా ఉండగా అన్ని విభాగాల్లోనూ మార్కెట్ వాటాను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు జియోన్ చెప్పారు. ఎల్జీకి దేశీయంగా పుణె, గ్రేటర్ నోయిడాల్లో ప్లాంట్లు ఉన్నాయి. పుణె ప్లాంటుపై 2004 నుంచి గతేడాది వరకూ రూ. 1,619 కోట్లు, నోయిడా ప్లాంటుపై 1997 నుంచి గతేడాది వరకు రూ. 1,778 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపారు. కొత్త ఫ్రిజ్‌ల శ్రేణి.. 2023కి సంబంధించి ఎల్జీ కొత్త ఎస్ బీ ఎస్ ఫ్రిజ్ ల శ్రేణిని ఆవిష్కరించింది. ఎల్జీ థింక్యూ టెక్నాలజీతో వీటిలో టెంపరేచర్ సెట్టింగ్ వంటి ఫీచర్లను ఎక్కడ నుంచైనా ఆపరేట్ చేయొచ్చని సంస్థ తెలిపింది. ఎస్ బీ ఎస్ ఫ్రిజ్ లలో 15 మోడల్స్ ఉండగా ధరలు రూ. 1,20,699 నుంచి రూ. 2,29,099గా ఉంటాయని వివరించింది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
దేశీయ మార్కెట్లో టీవీ విడుదల, ధర రూ.75లక్షలా!
సౌత్ కొరియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అత్యంత ఖరీదైన టీవీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. త్వరలో దేశ వ్యాప్తంగా ఉన్న ఎల్జీ ఔట్లెట్లలో ఈ టీవీని అందుబాటులోకి ఉంచనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముంబై క్రోమా స్టోర్‌లో ఎల్జీ సంస్థ ఎల్ఈడీ టీవీ పేరుతో టీవీని విడుదల చేసింది. ఈ టీవీ ధర ఎంతో తెలుసా అక్షరాల రూ.75లక్షలు. ఈ సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా డైరెక్టర్ హ్యాక్ హ్యయిన్ కిమ్ మాట్లాడుతూ.. వీక్షకులకు సరికొత్త యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ఈ సరికొత్త టీవీని మార్కెట్లోకి విడుదల చేసినట్లు వెల్లడించారు. టీవీ స్పెసిఫికేషన్లు టీవీ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే 65అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ప్లే, సెల్ఫ్ లైట్నింగ్ ఫిక్సెల్ టెక్నాలజీ, ఎల్జీ ఏ9 జనరేషన్ ఏఐ ప్రాసెసర్, డొల్బే అట్మాస్ స్పాటల్ సౌండ్ తో పాటు ఆకట్టుకునేలా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. -
ఎల్జీ నుంచి ఎల్ఈడీల కొత్త శ్రేణి
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యూరబుల్స్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తాజాగా 2022 ఓఎల్ఈడీ టీవీల శ్రేణిని ఆవిష్కరించింది. వీటిలో 106 సెం.మీ. (42 అంగుళాలు) నుంచి 246 సెం.మీ. (97 అంగుళాల) వరకూ విస్తృత స్థాయిలో మోడల్స్ ఉన్నాయని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా డైరెక్టర్ హక్ హ్యున్ కిమ్ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద (223 సెం.మీ.) 8కే ఓఎల్ఈడీ టీవీ, మార్కెట్లోనే తొలి రోలబుల్ ఓఎల్ఈడీ టీవీ వీటిలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటి ధర శ్రేణి రూ. 89,990 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. రోలబుల్ ఓఎల్ఈడీ టీవీ రేటు రూ. 75,00,000 స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. కొత్త ఓఎల్ఈడీ టీవీల్లో గేమింగ్ ఔత్సాహికుల కోసం గేమ్ ఆప్టిమైజర్ మెనూ, నాణ్యమైన పిక్చర్, డాల్బీ విజన్, అప్‌గ్రేడ్ చేసిన యూఎక్స్, అల్ఫా9 జెన్ 5 ఇంటెలిజెంట్ ప్రాసెసర్ మొదలైన ఫీచర్లు ఉంటాయని కిమ్ వివరించారు. -
ఎల్జీ సరికొత్త ఆవిష్కరణ.. ఇక కరెంట్ లేకున్నా 3 గంటలు టీవీ చూడొచ్చు..!
అరె.. టీవీ అక్కడెక్కడో మూలన కాకుండా నా సోఫా పక్కనే ఉంటే బాగుండేది. ఎంచక్కా పడుకొని సినిమా చూసేవాడిని. అయ్యయ్యో.. వంట పూర్తయ్యేసరికి సీరియల్ కూడా అయిపోయేలా ఉందే. కిచెన్లోకే టీవీని లాక్కొచ్చుకుంటే బావుండు. అటు సీరియల్ చూస్తూ ఇటు వంట చేసుకునేదాన్ని.. అని ఇక అనుకోనక్కర్లేదు. ఎందుకంటే అచ్చం ఇలాంటి ఫీచర్లతోనే అద్భుతమైన టీవీని ఎల్జీ కంపెనీ తీసుకొస్తోంది. వచ్చే జనవరిలోనే లాంచ్ చేయబోతోంది. పేరు ‘స్టాన్ బై మీ’. టీవీ పరిమాణం 27 అంగుళాలు. రిమోట్, టచ్‌తో పాటు మన సంజ్ఞలతో కూడా ఆపరేట్ చేయొచ్చు. బ్యాటరీతో నడిచే టీవీ ఇది. అయితే ఓ సినిమా చూశాక మళ్లీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. మున్ముందు బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుతారేమో చూడాలి. టీవీలానే కాకుండా మన మానసిక స్థితి(మూడ్)ని మార్చే వాల్పేపర్లు, ఫొటోలు, రంగులను కూడా టీవీలో సెట్ చేసుకోవచ్చు. టీవీకి పెద్దగా వైర్లు అవసరం ఉండదు. ఇంతకీ టీవీ ధరెంతో చెప్పలేదు కదా. ఎల్జీ వాళ్లు కూడా ఇంకా ప్రకటించ లేదు. లాక్కెళ్లొచ్చు.. తిప్పుకోవచ్చు టీవీలకు ఎల్జీ పెట్టింది పేరు. మనం ఇంతవరకు చూడని రకరకాల ఫీచర్లతో, అనేక రకాల మోడళ్లతో మనల్ని ఆశ్చర్యపరిచింది. గ్లాస్‌లా పారదర్శకంగా ఉండే టీవీల దగ్గర్నుంచి 325 అంగుళాల అతి పెద్ద టీవీ వరకు చిత్ర విచిత్రమైనవి అందుబాటులోకి తెచ్చి ‘వారెవ్వా’ అనిపించుకుంది. ‘అప్పుడే అయిపోలేదు’.. అంటూ ఇప్పుడు ‘స్టాన్బై మీ’ టీవీని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. పేరుకు తగ్గట్టే ఇంట్లో మనం ఎక్కడుంటే అక్కడికి టీవీని తీసుకెళ్లొచ్చు. టీవీతో పాటు వచ్చే స్టాండ్ కింద ఇందుకోసం చక్రాలుంటాయి. డ్రైవర్ స్టీరింగ్‌ను తిప్పినట్టు ఎలా కావాలంటే అలా టీవీని తిప్పుకోవచ్చు. మనకు నచ్చిన ఎత్తులో, నచ్చిన యాంగిల్లో సినిమాలు, సీరియళ్లు, ప్రోగ్రామ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు రకరకరాల పనులు చేసుకోవచ్చు. (చదవండి: గుడ్‌న్యూస్! హైదరాబాద్‌కి పెట్ కేర్.. వరంగల్‌కి ఐటీ కంపెనీ..) -
కరోనా పోరులో భారత్‌కు అండగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్
న్యూఢిల్లీ: ప్రముఖ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మన దేశంలో గత 24 సంవత్సరాలుగా వివిధ సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతో సహాయం చేస్తుంది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషికి మద్దతుగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ భారతదేశం అంతటా 10 తాత్కాలిక ఆసుపత్రులకు సహాయం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. స్థానిక ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇది జరుగుతుంది. ఈ అసోసియేషన్‌లో భాగంగా, ఈ కీలకమైన కాలంలో వైద్య మౌలిక సదుపాయాల కొరకు ఎల్జీ 5.5 మిలియన్ డాలర్ల(రూ.40 కోట్ల) ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ భారతదేశంలోకి ఈ రోజుకి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కోవిడ్ -19 వ్యతిరేకంగా పోరాడుతున్న పౌరులు, ప్రభుత్వాలకు మద్దతుగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ & ఎన్జిఓ భాగస్వాములతో కలిసి పనిచేయనుంది. దేశంలో అతిపెద్ద వైద్య సదుపాయం గల ఎయిమ్స్ లో కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి మరిన్ని పడకలు, అవసరమైన మౌలిక సదుపాయాలకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నిధులు సమకూరుస్తుంది. ఈ మేక్‌షిఫ్ట్(తాత్కాలిక) ఆస్పత్రులన్నీ ఢిల్లీ, బెంగళూరు, పూణే, భోపాల్, ఉదయపూర్, లక్నో వంటి ఇతర నగరాల్లో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల సహకారంతో నిర్మించనున్నట్లు తెలిపింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వివిధ రాష్ట్రాలలో పీపుల్ టు పీపుల్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయనుంది. సంస్థ తీసుకుంటున్న చొరవ గురుంచి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎమ్ డీ యంగ్ లక్ కిమ్ మాట్లాడుతూ.. “కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వానికి, పౌరులకు మా పూర్తి మద్దతును తెలియజేస్తున్నాము. గత ఏడాది మహమ్మారి ప్రారంభంలో, మేము మా వనరులను ఆరోగ్య సంరక్షణ కోసం పంచుకున్నాము. మేము ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం వైద్య మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా ప్రాణాలను కాపాడిన వారిమీ అవుతాము అని నమ్ముతున్నాము. వైద్య మౌలిక సదుపాయాలను కల్పించడానికి మేము వివిధ ప్రభుత్వ/ భాగస్వాములతో పనిచేస్తున్నాము. దీని కోసం 5.5 మిలియన్ డాలర్ల (రూ.40 కోట్ల) ఆర్థిక సహాయన్ని ప్రకటించినట్లు” పేర్కొన్నారు. 2020 ఏప్రిల్ లో ఎల్జీ అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో కలిసి భారతదేశం అంతటా 1 మిలియన్ బోజనాలను అందించినట్లు పేర్కొన్నారు. ఎల్జీ ఇండియా వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్ & టీవి వంటి ఉత్పత్తులను రాష్ట్ర, జిల్లాల్లో నిర్బంధ / ఐసోలేషన్ వార్డులకు కేటాయించిన 300+ ఆసుపత్రులకు విరాళంగా ఇచ్చింది. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తెలుపుతున్న మద్దతును పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసించాయి. మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రతిజ్ఞ చేసింది. చదవండి: టాటా మోటార్స్ కస్టమర్లకు గుడ్ న్యూస్! -
బంపర్ ఆఫర్ : ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీ తగ్గింపు
సాక్షి,ముంబై: ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్జీ వింగ్ స్మార్ట్ఫోన్నుఇపుడు తక్కువ ధరలోనే అందుబాటులోకి రానుంది. 40వేల తగ్గింపుతో 29,999 రూపాయలకు ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం కానుంది. భారతదేశంలో మాత్రమే ఏప్రిల్ 13 నుండి అందుబాటులో ఉండనుంది. అరోరా గ్రే, ఇల్యూజన్ స్కై కలర్ ఆప్షన్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు. కాగా, ఆకర్షణీయమైన ఫీచర్లతో ల్‌జీ వింగ్ స్మార్ట్‌ఫోన్‌ను 69,990ధర వద్ద గత ఏడాది అక్టోబర్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. మొబైల్ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగనున్నట్టు ఇటీవల ఎల్జీ అధికారంగా ప్రకటించింది. స్టాక్ ఉన్నంత వరకు తన ఉత్పత్తులను విక్రయిచనుంది. అయితే ఈ నేపథ్యంలో భారీ తగ్గింపును కంపెనీ ప్రకటించింది. ఈ సంవత్సరం జూలై 31 నాటికి పూర్తిగా మొబైల్ మార్కెట్‌నుంచి వైదొలగాలనేది కంపెనీ వ్యూహం. ఎల్జీ వింగ్ ఫీచర్లు 6.8 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 10 2440 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 765జి ప్రాసెసర్ 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 64+13+12 మెగాపిక్సల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఎల్జీ సంచలన నిర్ణయం : యూజర్లకు షాక్
సాక్షి,న్యూఢిల్లీ : దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ సంచలనం నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ వ్యాపారానికి స్వస్తి పలకాలని నిర్ణయించినట్టు సోమవారం ధృవీకరించింది. భారీ నష్టాలకారణంగా స్మార్ట్‌ఫోన్ డివిజన్ ఉత్పత్తి అమ్మకాలను ముగించనున్నట్లు తెలిపింది. దాదాపు అరేళ్లుగా తీవ్ర నష్టాలతో కొట్టిమిట్టాడుతున్న ఎల్జీ తన ఫోన్ వ్యాపారాన్ని జర్మనీకి చెందిన వోక్స్ వాగన్ ఏజీ, వియత్నాం కంపెనీ విన్‌గ్రూప్ జెఎస్సీ సహా రెండు బడా కంపెనీలకు విక్రయించాలన్న ప్లాన్లు విఫలం కావడంతో ఈ దిశగా కంపెనీ అడుగులు వేసింది. తద్వారా మార్కెట్ నుండి పూర్తిగా వైదొలిగిన మొట్టమొదటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఎల్జీ నిలిచింది. ఎల్జీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలతో సహా అనేక సెల్ ఫోన్ ఆవిష్కరణలతో మార్కెట్లోకి దూసుకొచ్చింది. 2013లో ఆపిల్, శాంసంగ్ తరువాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా నిలిచింది. కానీ ఆ తరువాత తీవ్రపోటీకి తోడు, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ప్రమాదాల వివాదంలో పడింది. మరోవైపు చైనా ప్రత్యర్థులతో పోల్చితే కంపెనీకి మార్కెటింగ్ నైపుణ్యం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. (ఈ స్మార్ట్‌ఫోన్ అభిమానులకు షాకింగ్ న్యూస్) కాగా గత ఆరేళ్లలో ఎల్జీ దాదాపు 4.5 బిలియన్ డాలర్లు (రూ.32,856 కోట్లు) మేర నష్టాలను చవిచూసింది. ఈ కారణంగానే మొబైల్ బిజినెస్నుంచి వైదొలగాలని కంపెనీ నిర్ణయించుకుంది. నష్టాల నుంచి గట్టేందుకు అన్నిరకాల అవకాశాలను పరిశీలిస్తున్నామంటూఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈవో ప్రకటించినప్పటికీ, మొబైల్ బిజినెస్‌కు గుడ్‌బై చెప్ప నుందంటూ ఇటీవల పలు వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. -
ఈ స్మార్ట్‌ఫోన్ అభిమానులకు షాకింగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: మీరు ఎల్జీ స్మార్ట్‌ఫోన్ అభిమానులా? అయితే మీకో షాకింగ్ న్యూస్. దక్షిణ కొరియా సంస్థ ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఎల్జీ ఫ్యాన్స్‌ను నిరాశపర్చే సంచలన నిర్ణయం దిశగా కదులుతోందట. మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్ని పూర్తిగా మూసివేయాలని కంపెనీ భావిస్తోందట. స్మార్ట్‌ఫోన్ విక్రయాలకు సంబంధించిన వ్యూహాలు సఫలం కాకపోవడం వ్యాపార భాగస్వామ్య చర్చలు కార్యరూపం దాల్చకపోవడమే ఇందుకు కారణమని అంచనా. దక్షిణ కొరియాకు చెందిన డోంగా ఇల్బో నివేదిక ప్రకారం స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై ఇప్పటికే జర్మనీకి చెందిన వోక్స్వ్యాగన్ ఏజీ, వియత్నాంకు చెందిన వింగ్రూప్ జేఎస్సి అనే రెండు సంస్థలతో ఎల్జీ చర్చలు జరిపింది. ఈ చర్చలు విఫలమవడంతో మొత్తం మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్నే మూసివేయాలని ఎల్జీ నిర్ణయించుకుంది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ ప్లాన్లను ఎల్జీ నిలిపివేసింది. రోలబుల్ డిస్ప్లే ఫోన్ల ఉత్పత్తిని కంపెనీ గత నెలలో నిలిపివేసిందని డోంగా తెలిపింది. 'ది రోలబుల్' గా పిలువబడే ఈ ఫోన్‌ను ఎల్జీ తిరిగి సీఈఎస్ 2021లో ప్రదర్శించింది. అటు మొబైల్ పరికరాలకు గ్లోబల్ మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్నందున ఎల్జీ మంచి నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని. స్మార్ట్ఫోన్ల అమ్మకాలు నిలిపివేసి, ఆ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగే వైపు ఆలోచన చేస్తోందని కొరియా హెరాల్డ్ జనవరిలో ఒక ఎల్జీ అధికారిని ఉటంకిస్తూ తెలపింది. కాగా మొబైల్ కమ్యూనికేషన్స్‌లో కంపెనీ నష్టాలను చవి చూస్తోందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈఓ క్వాన్ బాంగ్ సియోక్ గత జనవరి నెలలో ప్రకటించారు. గత ఐదేళ్లలో కంపెనీ 4.5 బిలియన్ల డాలర్లు (రూ.32,856 కోట్లు) కోల్పోయినట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మొబైల్ కమ్యూనికేషన్స్‌ని విడిచిపెట్టాలని నిర్ణయించి నట్లు బాంగ్ తెలిపారు. దీనిపై విధివిధాలను ఏప్రిల్ తొలివారంలో ప్రకటిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
12 గంటల్లో 1.75 లక్షల ఫోన్ల అమ్మకం
దసరా పండుగ సీజన్ మరోసారి ఎలక్ట్రానిక్ గూడ్స్‌కు ఎంత డిమాండ్ ఉందో నిరూపించింది. అందులోనూ కొత్తరకం ఫోన్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదని మరోసారి నిరూపితమయ్యింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్‌లో కొత్తగా లాంచ్ చేసిన ఎల్జీ జీ8ఎక్స్ డ్యుయల్ స్క్రీన్ రికార్డు సృష్టించింది. ఏకంగా 12 గంటల్లోనే 350 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. 1.75 లక్షల ఫోన్లు అమ్ముడుపోయాయి. ఈ సందర్భంగా ఎల్ జీ ఫోన్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హెడ్ అద్వైత వైద్య మాట్లాడుతూ, లాక్డౌన్లో చాలా మంది ఇంట్లో నుంచి పని చేయాల్సి వచ్చిందని అప్పుడు వాళ్లు మల్టీ టాస్క్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. వారు ఒకేసారి ఆఫీస్ పని చేస్తూ వేరే యాప్స్ కూడా చూడాల్సి వచ్చిందని దానిలో నుంచే ఈ డ్యుయల్ స్క్రీన్ ఆలోచన వచ్చిందన్నారు. ఈ ఫోన్లో ఒక స్క్రీన్‌లో మీకు కావాల్సిన పని చూసుకుంటూనే మరో స్క్రీన్‌లో మీకు కావాల్సినవి తెరవొచ్చని పేర్కొన్నారు. చూడటానికి చాలా బాగుండటంతో చాలా మంది ఈ ఫోన్ వైపు మొగ్గు చూపారని వెల్లడించారు. కస్టమర్ డిమాండ్స్‌కు అనుగుణంగా ఇంకొన్ని ఫోన్లను అందుబాటులోకి తీసురానున్నామని పేర్కొన్నారు. ఇక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా లాంటి ఆన్లైన్ రిటైల్ దిగ్గజాలు దసరా సందర్భంగా భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వేదికలపై భారీగా అమ్మకాలు -
ఎల్జీ కొత్త స్మార్ట్‌ఫోన్, అతిపెద్ద బ్యాటరీ
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ దక్షిణ కొరియాలో తన కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎల్జీ ఎక్స్5(2018) పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2016లో లాంచ్ చేసిన ఎల్జీ ఎక్స్5కు సక్సెసర్‌గా దీన్ని ప్రవేశపెట్టింది. ముందస్తు దానికి కొన్ని మెరుగులు దిద్దుతూ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎల్జీ లాంచ్ చేసింది. 2016లోని ఎల్జీ ఎక్స్5కు 2800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే, నేడు లాంచ్ చేసిన ఈ ఫోన్‌కు భారీగా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియోను ఈ ఫోన్ కలిగి ఉంది. ఎల్జీ ఎక్స్5(2018) స్పెషిఫికేషన్లు.. 5.5 అంగుళాల స్క్రీన్ ఆక్టాకోర్ ఎంటీ6750 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్ విస్తరణకు అవకాశం 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా కంపెనీ మొబైల్ పేమెంట్ సర్వీసు ఎల్జీ పే మోరోఖాన్ బ్లూ రంగులో అందుబాటు ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ సిస్టమ్ -
‘ఎల్జీ’ ట్వీట్‌పై పేలుతున్న జోకులు
న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. రాష్ట్రం హక్కుల్ని కేంద్రం కాలరాస్తుందని, ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో బైజాల్ చొరవతీసుకోవడం లేదంటూ కేజ్రీవాల్, మంత్రులు ఈ నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. వీరు తన కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తుండటంతో, గవర్నర్ తన ఉద్యోగాన్ని ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, ఇతర డిపార్ట్మెంట్లకు చెందిన ఫైల్స్‌ను మాత్రమే చూసుకుంటున్న గవర్నర్, ఢిల్లీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ ఒక్క ఫైల్‌ను ముట్టడం లేదు. అంతేకాక ఇన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మంత్రుల్ని, ఢిల్లీ ముఖ్యమంత్రిని అసలు పట్టించుకోవడం లేదు. ఢిల్లీలో జరుగుతున్న ఈ హైడ్రామాపై డైరెక్టర్ శిరిష్ కుందర్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతోంది. సీరియస్ సమస్యలపై కూడా హాస్యాభరితమైన ట్వీట్ చేసే శిరిష్ కుందర్, నేడు కూడా ఇదే విధంగా హాస్యం పండించారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌ను అడగండి.. ఢిల్లీలో సర్వీసు సెంటర్ ఉందా? అని.. అక్కడ ఎల్జీ పనిచేయడం లేదు... అని హాస్యాస్పదంగా కామెంట్ చేశారు. అయితే శిరిష్ కుందర్ చేసిన ఈ ట్వీట్ నిజంగా ఎల్జీ కంపెనీ గురించి అనుకున్నారామో? కాదు. లెఫ్టినెంట్ గవర్నర్ గురించి. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోని ఎల్జీ ఎలక్ట్రానిక్స్... నిజంగా తమ వస్తువులపై ఫిర్యాదు చేశారేమోనని భావించి.. వెంటనే జవాబిచ్చింది. ‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. దయచేసి మీ కాంటాక్ట్ వివరాలు మాకు అందించండి. దీంతో వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తాం ’ అని ట్వీట్ చేసింది. శిరిష్ కుందర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ చేసిన ట్వీట్లు కొన్ని గంటల్లోనే తొలగించారు. శిరిష్ కుందర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మధ్య జరిగిన సంభాషణపై ట్విటర్లో జోకులు పేలుతున్నాయి. OMG!! This one is killer — Sushil Jain (@SushilJ1960) June 16, 2018 Wow ... his is what we call humour! Even @LtGovDelhi must be smiling ~ 😀😀😀🙏 — Dr.S.P.Singh MD (@medico956) June 16, 2018 -
దోమల్ని తరిమే స్మార్ట్‌ఫోన్
‘కే7ఐ’ను ఆవిష్కరించిన ఎల్జీ న్యూఢిల్లీ: దోమలను తరమడానికి జెట్ కాయిల్స్‌ను, బాడ్మింటన్ రాకెట్స్‌ను ఉపయోగించి ఉంటాం. కానీ ఇప్పుడు దోమలకు తరిమేసే స్మార్ట్ఫోన్లు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. ప్రముఖ మొబైల్ హ్యాడ్‌సెట్స్ తయారీ కంపెనీ ఎల్జీ తాజాగా ఇలాంటి ఫీచర్‌తో ‘కే7ఐ’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.7,990. మస్కిటో అవే టెక్నాలజీతో ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో 5 అంగుళాల డిస్ప్లే, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించింది. కాగా కంపెనీ ఇప్పటికే పలు టీవీలు, ఏసీలలో ఈ టెక్నాలజీని పొందుపరిచింది. మార్కెట్లోకి 4జీ సీసీటీవీలు వొడాఫోన్తో వీడియోకాన్ వాల్‌కామ్ జట్టు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెక్యూరిటీ, నిఘా సొల్యూషన్ ప్రొవైడర్ సంస్థ వీడియోకాన్ వాల్‌కామ్.. వొడాఫోన్తో జట్టుకట్టింది. విపణిలోకి తొలిసారిగా 4జీ అనుసంధానమైన సీసీటీవీ కెమెరాలను విడుదల చేసింది. ఇందులో 4జీ సిమ్‌తో పాటూ మొబైల్ వాహన కిట్, 4జీ అవుట్డోర్, ఇన్డోర్ సీసీటీవీ కెమెరాలు అనుసంధానమై ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 4జీ మొబైల్ వాహన కిట్‌ను బస్సులు, కార్లు, రైళ్లు, ట్రక్కుల వంటి అన్ని రకాల వాహనాలకు బిగించుకునే విధంగా 1.3, 2 మెగా పిక్సల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుందని పేర్కొంది. ఆసుస్ ‘వివోబుక్ ఎస్15’ @ రూ.59,990 న్యూఢిల్లీ: ‘ఆసుస్’ తాజాగా కొత్త నోట్‌బుక్ ‘వివోబుక్ ఎస్15’ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.59,990. ఇందులో 8వ జనరేషన్ ఇంటెల్ కోర్–ఐ7 ప్రాసెసర్, 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ నానో ఎడ్జ్ డిస్ప్లే వంటి పలు ప్రత్యేకతలున్నాయి. -
ఎల్జీకి గిన్నిస్ రికార్డు..
న్యూఢిల్లీ: సైనికులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు తాము నిర్వహించిన ‘కర్‌సలామ్’ కార్యక్రమం తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ సొంతం చేసుకుందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తెలిపింది. 1,14, 741కుపైగా లిఖితపూర్వక సందేశాలు వచ్చినట్లు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కిమ్ కి వాన్ తెలిపారు. ఈ స్టికీ నోట్స్‌తో అతిపెద్ద వరుస సృష్టించినందుకు తమకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం లభించిందన్నారు. కార్యక్రమంలో భాగంగా హోంశాఖకు రూ.కోటి విరాళంగా అందించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ దంగరికర్ (మధ్య) నుంచి అవార్డు అందుకుంటున్న సంస్థ ఎండీ కిమ్ కి వాన్ (ఎడమ), సంస్థ కార్పొరేట్ మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ (కుడి) -
లాభాల్లో దూసుకుపోయిన ఎల్ జీ
సియోల్ : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్ జీ, లాభాల్లో దూసుకుపోయింది. శుక్రవారం ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో నిర్వహణ లాభాలు రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. ఎల్ జీ ప్రధాన వ్యాపారాలైన గృహోపకరణాలు, టెలివిజన్ సెట్లు లాభాలను పెంచడంలో కీలకపాత్ర పోషించాయని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద టీవీల తయారీదారుగా మార్కెట్ షేరును సొంతం చేసుకున్న ఎల్ జీ సంస్థకు ఏప్రిల్-జూన్ లాభాలు రూ.58,500 కోట్లగా రికార్డు అయినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. 2014లో రూ.61,000 కోట్ల త్రైమాసిక లాభాలను నమోదుచేసిన తర్వాత ఇదే అతిపెద్ద త్రైమాసిక లాభాలని కంపెనీ వెల్లడించింది. రెవెన్యూలు కూడా 0.5 శాతానికి ఎగిసి రూ. 14 లక్షల కోట్లను (14ట్రిలియన్) నమోదుచేశాయి. జూలై ఆఖరికి విడుదలయ్యే తుది ఫలితాల్లో మిగతా వివరాలను ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ వెల్లడించనుంది. గృహోపకరణాల వ్యాపారాల్లో ప్రీమియం ఉత్పత్తులు, ఎయిర్ కండీషనర్లకు డిమాండ్ పెరగడంతో, ఎల్ జీ నిర్వహణ లాభాలు ఎగిశాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2016 యూఈఎఫ్ఏ యూరోపియన్ ఛాంపియన్ షిప్ సాకర్ టోర్నమెంట్ లాంటి ప్రధాన క్రీడాంశాలు టీవీల క్రేజ్ ను పెంచాయని, పెద్ద సైజు సెట్లకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. వీక్ డిస్ ప్లే ప్యానెల్ ధరలు కూడా మార్జిన్లు పెంచడానికి దోహదం చేశాయన్నారు. అయితే స్మార్ట్ ఫోన్ల బిజినెస్ లు మాత్రం ఎల్ జీని నిరాశపరిచాయి. వరుసగా ఐదో త్రైమాసికం ఏప్రిల్-జూన్ కూడా మొబైల్ డివైజ్ లో నిర్వహణ నష్టాలను నమోదుచేశాయి. జీ5 స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఈ త్రైమాసికంలో ఎల్ జీ బాగా నిరాశపరిచాయని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. తీవ్ర పోటీ నేపథ్యంలో కేవలం 22 లక్షల మొబైల్ యూనిట్లను మాత్రమే ఎల్ జీ అమ్మినట్టు హెచ్ఎమ్ సీ ఇన్వెస్ట్ మెంట్ అనాలిస్ట్ గ్రేగ్ రో తెలిపారు. మొబైల్ డివైజ్ ల్లో ఎల్ జీ రూ. 9,400 కోట్ల నష్టాలను నమోదుచేసింది. -
ఆ టీవీ అమ్మకాలు షురూ!
మలేరియా, డెంగ్యూ, జికా వైరస్ లనుంచి ఇక బయటపడట్టే. దక్షిణ కొరియా దిగ్గజం ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ కనిపెట్టిన దోమలను తరిమే సరికొత్త సాధనం "మస్కిటో రిపెల్లింగ్ టీవీ" అమ్మకాలు భారత్ లో ప్రారంభమయ్యాయి. దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ భారత్ లో ఈ టీవీ అమ్మకాలను చేపడుతోంది. సరికొత్త మస్కిటో ఎవే టెక్నాలజీని అల్ట్రా సోనిక్ తరంగాలతో ఎల్ జీ ఈ టీవీని రూపొందించింది. ఈ తరంగాలతో దోమల చెవులు బద్దలై, ఇంట్లో నుంచి పారిపోతయాని కంపెనీ వెల్లడించింది. దీనికి సమానమైన టెక్నాలజీ ఎయిర్ కండీషనర్స్, వాషింగ్ మెషిన్స్ లో కూడా వాడటానికి చెన్నైకి దగ్గర్లోని ఓ ల్యాబోరేటరీ నుంచి సర్టిఫికేట్ పొందామని ఎల్జీ తెలిపింది. టీవీ స్విచ్ ఆఫ్ చేసినా ఈ టెక్నాలజీ పనిచేసేలా రూపొందించామని, రెండు మోడల్స్ లో ఇది లభ్యమవుతోందని కంపెనీ పేర్కొంది. ఒకటి రూ.26,500 కు, మరొకటి రూ.47,500లకు మార్కెట్లోకి తీసుకొచ్చామని ఎల్జీ ప్రకటించింది. దోమల వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధుల నుంచి అల్ప ఆదాయ వినియోగదారులను రక్షించి, ఆరోగ్యంగా ఉంచే లక్ష్యంతో దీన్ని రూపొందించామని పేర్కొంది. శ్రీలంక, ఫిలిప్పీన్స్ లో వచ్చే నెలనుంచి అమ్మకాలు చేపడతామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అధికారి కిమ్ సుంగ్ యేల్ తెలిపారు. లాటిన్ అమెరికాను గడగడలాడించిన జికా వైరస్ ప్రభావంతో ఈ టీవీ రూపకల్పనకు ఎల్జీ శ్రీకారం చుట్టింది. ఈ జికా వైరస్ ప్రభావం రియో నగరంలో కూడా ఉందని ఆగస్టులో జరగబోయే ఒలంపిక్స్ ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ వెల్లువెత్తిన క్రమంలో ఎల్జీ ఈ వినూత్న సాధనాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసింది. -
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాభం 10.7 కోట్ల డాలర్లు
హైదరాబాద్: ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇన్‌కార్పొ ప్రపంచవ్యాప్త కార్యకలాపాల ద్వారా ఈ ఏడాది మూడో త్రైమాసిక కాలంలో 10.7 కోట్ల డాలర్ల నికర లాభం ఆర్జించింది. ప్రపంచవ్యాప్తంగా టీవీ, స్మార్ట్ఫోన్ల కేటగిరిల్లో పోటీ తీవ్రమవుతున్నప్పటికీ, ఈ ఏడాది రెండో త్రైమాసిక కాలంలో నికర అమ్మకాలతో పోల్చితే క్యూ3 అమ్మకాలు 0.7 శాతం వృద్ధితో 1,200 కోట్ల డాలర్లకు పెరిగాయని ఎల్జీ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. టీవీ, స్మార్ట్‌ఫోన్ విభాగాల్లో తీవ్రమైనపోటీ కారణంగా అమ్మకాలు ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ, హోమ్ అప్లయన్సెస్, ఎయిర్ సొల్యూషన్ విభాగాలు మంచి పనితీరు కనబరిచాయని పేర్కొంది. -
ఎల్జీ జీ4 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ @ 24,990
న్యూఢిల్లీ: ఎల్జీ ఎలక్ట్రానిక్స్ జీ4 స్టైలస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో సోమవారం ఆవిష్కరించింది. ఈ పెన్ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.24,990 అని ఎల్జీ మొబైల్స్ ఇండియా బిజినెస్ హెడ్ దీపక్ జస్రోషియా చెప్పారు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వినియోగించిన అనుభూతినిచ్చేలా ఈ ఫోన్‌ను రూపొందించామని తెలిపారు. అయితే ప్రీమియం ధరకు కాకుండా తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. 1.2 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో రూపొందిన ఈ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో 1 జీబీ ర్యామ్, 5.5 అంగుళాల డిస్ప్లే, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపారు. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో 3,000 ఎంఏహెచ్ రిమూవల్ బ్యాటరీను అందిస్తున్నామన్నారు. 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, ఎన్ఎఫ్సీలను సపోర్ట్ చేస్తుందని చెప్పారు. -
ఎల్జీ డోర్-ఇన్-డోర్ ఫ్రిజ్‌లకు మంచి రేటింగ్స్
హైదరాబాద్ : ఎల్జీ ఎలక్ట్రానిక్స్ డోర్-ఇన్-డోర్ రిఫ్రిజిరేటర్లకు ఇంగ్లాండ్, చైనాల్లో మంచి గుర్తింపు లభిస్తోందని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వినూత్నమైన ఫీచర్లు, విద్యుత్తు ఆదా చేసే సామర్థ్యం తదితర అంశాల కారణంగా ఈ ఫ్రిజ్‌లకు ఉత్తమ రేటింగ్స్ లభిస్తున్నాయని ఎల్జీ హోమ్ అప్లయెన్స్ అండ్ ఎయిర్ సొల్యూషన్ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ సియోంగ్-జిన్ జో పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన ఎలక్ట్రికల్ రిటైల్ ట్రేడ్ మ్యాగజైన్ అయిన ఇన్నోవేటివ్ ఎలక్ట్రికల్ రిటైలింగ్(ఐఈఆర్) ఇచ్చే ఈకో/ఎనర్జీ సేవింగ్ అవార్డ్ తమ నాలుగు డోర్ల ఫ్రిజ్(మోడల్ జీఎంఎం916ఎన్ఎస్హెచ్వీ)కు లభించిందని తెలిపారు. అలాగే ఇంగ్లాండ్‌కే చెందిన ట్రస్టెడ్ రివ్యూస్(టెక్ న్యూస్, రివ్యూల వెబ్సైట్) ఈ ఫ్రిజ్‌కు పదికి పది రేటింగ్‌ను ఇచ్చిందని వివరించారు. ఇక తమ ఐదు డోర్ల డోర్ ఇన్ డోర్ ఫ్రిజ్‌కు (మోడల్: జీఆర్-ఎం23హెచ్డబ్ల్యూసీహెచ్ఎల్)కు చైనాస్ హౌస్‌హోల్డ్ ఎలక్ట్రిక్ అప్లయెన్సెస్ అసోసియేషన్ నుంచి చైనా అప్లయెన్స్ గ్రాండ్ ప్రైజ్ లభించిందని వివరించారు. -
ఎల్జీ నుంచి 4 కొత్త ఉత్పత్తులు
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఈ ఏడాది భారత్‌లో రూ. 23,500 కోట్ల టర్నోవరును లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 25 శాతం అధికం. 2014లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా టర్నోవరు రూ. 18,500 కోట్లు. ఇక, పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ) కార్యకలాపాలపై కంపెనీ ఈ ఏడాది కనీసం రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. బుధవారం ఎల్జీ ఇండియా టెక్ షో 2015 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ సూన్ వాన్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తమ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి అంతర్జాతీయంగా టాప్ 5 దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆయన చెప్పారు. రాబోయే మూడేళ్లలో భారత్‌ను తమకు మూడో అతి పెద్ద మార్కెట్‌గా మల్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు వాన్ వివరించారు. 105 అంగుళాల టీవీ..: టెక్‌షోలో భాగంగా మొబైల్స్, హోమ్ ఎంటర్టైన్మెంట్, ఎయిర్ కండీషనర్స్, గృహోపకరణాలకు సంబంధించి 4 కొత్త ఉత్పత్తులను ఎల్జీ ఆవిష్కరించింది. తమ రెండో కర్వ్డ్ స్మార్ట్ ఫోన్ జీ ఫ్లెక్స్2ని, 105 అంగుళాల టీవీని ప్రవేశపెట్టింది. జీ ఫ్లెక్స్ ధర రూ. 55,000 కాగా టీవీ రేటు రూ. 60 లక్షలు. మొబైల్స్ విభాగంలో ఈ ఏడాది 30 కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వాన్ తెలిపారు. -
నగరంలో ఐసీసీ ప్రపంచకప్ ప్రదర్శన
కేపీహెచ్‌బీ కాలనీ: నగరంలో సోమవారం ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ సందడి చేసింది. టోర్నీ గ్లోబల్ స్పాన్సర్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఆధ్వర్యంలో కూకట్పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని ఫోరం మాల్లో ఈ ట్రోఫీని ప్రదర్శించారు. కప్‌ను చూసేందుకు వచ్చిన క్రికెట్ అభిమానులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్ విజయాన్ని కాంక్షిస్తూ 30 అడుగుల పొడవైన బ్యాట్‌పై పలువురు అభిమానులు సంతకాలు చేశారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ శశికిరణ్, ఆర్ఆర్ఎం అచింట్ రాణే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో ఈ ట్రోఫీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, నోయిడాల్లో ట్రోఫీని ప్రదర్శిస్తారు. ఫిబ్రవరి 14 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో ప్రపంచకప్ జరుగుతుంది. -
ఎల్జీ స్మార్ట్ గ్లాసెస్ వస్తున్నాయ్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూగుల్ తరహాలో రూపొందుతున్న స్మార్ట్ గ్లాసెస్‌ను ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఈ ఏడాదే మార్కెట్లోకి తెచ్చే అవకాశాలున్నాయి. అయితే గూగుల్ గ్లాస్‌లా కాకుండా సొంతంగా అభివృద్ధి చేస్తున్న ‘గ్లాస్టిక్’ పరిజ్ఞానాన్ని ఎల్జీ ఇందుకు ఉపయోగిస్తోంది. 2013 నవంబరులోనే గ్లాస్టిక్ ట్రేడ్‌మార్క్ కోసం మొబైల్స్, స్పెక్టాకిల్స్(ఆప్టిక్స్) విభాగంలో కంపెనీ దరఖాస్తు చేసుకుంది. స్మార్ట్ గ్లాసెస్ వస్తున్న విషయాన్ని ఎల్జీ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ ఏడాదే ఇవి మార్కెట్లోకి రావచ్చని చెప్పారు. మార్కెట్లో ఉన్న గ్లాసెస్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఇవి ఉండబోతున్నాయని.. ధర ఎంత ఉండేది ఇప్పుడే చెప్పలేమన్నారు. స్మార్ట్ గ్లాసెస్ కళ్లజోడు మాదిరిగా ఉండే చిన్నపాటి కంప్యూటర్. బ్యాటరీ, సీపీయూ, స్పీకర్, కెమెరా, మైక్రోఫోన్ దీనికి ఉంటాయి. ఫోన్‌కాల్స్ చేయొచ్చు. అద్దాలకు ముందువైపు గాజు వంటి చిన్న తెర ప్రిసమ్ ఉంటుంది. నచ్చిన వీడియోలు చూడొచ్చు. కెమెరాతో వీడియో రికార్డింగ్, ఫోటోలు తీయొచ్చు.