ఎల్‌జీ జీ4 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ @ 24,990 | LG 4G Smartphone Stylus @ 24,990 | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ జీ4 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ @ 24,990

Published Tue, Jul 21 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

ఎల్‌జీ జీ4 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ @ 24,990

ఎల్‌జీ జీ4 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ @ 24,990

న్యూఢిల్లీ: ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్  జీ4 స్టైలస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో సోమవారం ఆవిష్కరించింది.  ఈ పెన్ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్  ధర రూ.24,990 అని ఎల్‌జీ మొబైల్స్ ఇండియా బిజినెస్ హెడ్ దీపక్ జస్‌రోషియా చెప్పారు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వినియోగించిన అనుభూతినిచ్చేలా ఈ ఫోన్‌ను రూపొందించామని తెలిపారు. అయితే ప్రీమియం ధరకు కాకుండా తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. 1.2 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో రూపొందిన ఈ డ్యుయల్ సిమ్  స్మార్ట్‌ఫోన్‌లో 1 జీబీ ర్యామ్, 5.5 అంగుళాల డిస్‌ప్లే, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపారు. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 3,000 ఎంఏహెచ్ రిమూవల్ బ్యాటరీను అందిస్తున్నామన్నారు. 4జీ ఎల్‌టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, ఎన్‌ఎఫ్‌సీలను సపోర్ట్ చేస్తుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement