ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ దక్షిణ కొరియాలో తన కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎల్‌జీ ఎక్స్5(2018) పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 2016లో లాంచ్ చేసిన ఎల్‌జీ ఎక్స్5కు సక్సెసర్‌గా దీన్ని ప్రవేశపెట్టింది. ముందస్తు దానికి కొన్ని మెరుగులు దిద్దుతూ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎల్‌జీ లాంచ్ చేసింది. 2016లోని ఎల్‌జీ ఎక్స్5కు 2800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే, నేడు లాంచ్ చేసిన ఈ ఫోన్‌కు భారీగా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియోను ఈ ఫోన్ కలిగి ఉంది.
ఎల్‌జీ ఎక్స్5(2018) స్పెషిఫికేషన్లు..
5.5 అంగుళాల స్క్రీన్
ఆక్టాకోర్ ఎంటీ6750 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
మైక్రోఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్ విస్తరణకు అవకాశం
13 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
కంపెనీ మొబైల్ పేమెంట్ సర్వీసు ఎల్‌జీ పే
మోరోఖాన్ బ్లూ రంగులో అందుబాటు
ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ సిస్టమ్
Comments
Please login to add a commentAdd a comment