హైదరాబాద్ : ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ డోర్-ఇన్-డోర్ రిఫ్రిజిరేటర్లకు ఇంగ్లాండ్, చైనాల్లో మంచి గుర్తింపు లభిస్తోందని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వినూత్నమైన ఫీచర్లు, విద్యుత్తు ఆదా చేసే సామర్థ్యం తదితర అంశాల కారణంగా ఈ ఫ్రిజ్‌లకు ఉత్తమ రేటింగ్స్ లభిస్తున్నాయని ఎల్‌జీ హోమ్ అప్లయెన్స్ అండ్ ఎయిర్ సొల్యూషన్ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ సియోంగ్-జిన్ జో పేర్కొన్నారు.
ఇంగ్లాండ్‌కు చెందిన ఎలక్ట్రికల్ రిటైల్ ట్రేడ్ మ్యాగజైన్ అయిన ఇన్నోవేటివ్ ఎలక్ట్రికల్ రిటైలింగ్(ఐఈఆర్) ఇచ్చే ఈకో/ఎనర్జీ సేవింగ్ అవార్డ్ తమ నాలుగు డోర్ల ఫ్రిజ్(మోడల్ జీఎంఎం916ఎన్‌ఎస్‌హెచ్‌వీ)కు లభించిందని తెలిపారు. అలాగే ఇంగ్లాండ్‌కే చెందిన ట్రస్టెడ్ రివ్యూస్(టెక్ న్యూస్, రివ్యూల వెబ్‌సైట్) ఈ ఫ్రిజ్‌కు పదికి పది రేటింగ్‌ను ఇచ్చిందని వివరించారు. ఇక తమ ఐదు డోర్ల డోర్ ఇన్ డోర్ ఫ్రిజ్‌కు (మోడల్: జీఆర్-ఎం23హెచ్‌డబ్ల్యూసీహెచ్‌ఎల్)కు చైనాస్ హౌస్‌హోల్డ్ ఎలక్ట్రిక్ అప్లయెన్సెస్ అసోసియేషన్ నుంచి చైనా అప్లయెన్స్ గ్రాండ్ ప్రైజ్ లభించిందని వివరించారు.
ఎల్‌జీ డోర్-ఇన్-డోర్ ఫ్రిజ్‌లకు మంచి రేటింగ్స్
Published Thu, Apr 2 2015 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM
Advertisement
Advertisement