ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ లాభం 10.7 కోట్ల డాలర్లు | LG Electronics profit of $ 10.7 million | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ లాభం 10.7 కోట్ల డాలర్లు

Published Fri, Oct 30 2015 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ లాభం  10.7 కోట్ల డాలర్లు

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ లాభం 10.7 కోట్ల డాలర్లు

హైదరాబాద్: ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇన్‌కార్పొ ప్రపంచవ్యాప్త కార్యకలాపాల ద్వారా ఈ ఏడాది మూడో త్రైమాసిక కాలంలో 10.7 కోట్ల డాలర్ల నికర లాభం ఆర్జించింది. ప్రపంచవ్యాప్తంగా టీవీ, స్మార్ట్‌ఫోన్ల కేటగిరిల్లో పోటీ తీవ్రమవుతున్నప్పటికీ, ఈ ఏడాది రెండో త్రైమాసిక కాలంలో నికర అమ్మకాలతో పోల్చితే క్యూ3 అమ్మకాలు  0.7 శాతం వృద్ధితో 1,200 కోట్ల డాలర్లకు పెరిగాయని ఎల్‌జీ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

టీవీ, స్మార్ట్‌ఫోన్ విభాగాల్లో తీవ్రమైనపోటీ కారణంగా అమ్మకాలు ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ, హోమ్ అప్లయన్సెస్, ఎయిర్ సొల్యూషన్ విభాగాలు మంచి పనితీరు కనబరిచాయని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement