బంపర్‌ ఆఫర్‌ : ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర భారీ తగ్గింపు | Massive Price Cut : LG Wing can buy at Rs. 29,999 | Sakshi

బంపర్‌ ఆఫర్‌ : ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర భారీ తగ్గింపు

Apr 12 2021 1:52 PM | Updated on Apr 12 2021 2:58 PM

Massive Price Cut : LG Wing can buy at Rs. 29,999 - Sakshi

సాక్షి,ముంబై: ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు ఎల్‌జీ వింగ్‌ స్మార్ట్‌ఫోన్‌నుఇపుడు తక్కువ ధరలోనే అందుబాటులోకి రానుంది. 40వేల తగ్గింపుతో 29,999 రూపాయలకు ఈ స్మార్ట్‌ఫోన్‌  ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం కానుంది. భారతదేశంలో మాత్రమే ఏప్రిల్ 13 నుండి అందుబాటులో ఉండనుంది.  అరోరా గ్రే,  ఇల్యూజన్ స్కై కలర్ ఆప్షన్లలో  దీన్ని సొంతం చేసుకోవచ్చు. 

కాగా, ఆకర్షణీయమైన ఫీచర్లతో  ల్‌జీ వింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను 69,990ధర వద్ద గత ఏడాది అక్టోబర్‌లో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.  మొబైల్ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగనున్నట్టు ఇటీవల ఎల్‌జీ అధికారంగా ప్రకటించింది. స్టాక్‌ ఉన్నంత వరకు తన ఉత్పత్తులను విక్రయిచనుంది.  అయితే ఈ నేపథ్యంలో భారీ తగ్గింపును కంపెనీ ప్రకటించింది.  ఈ సంవత్సరం జూలై 31 నాటికి పూర్తిగా మొబైల్‌ మార్కెట్‌నుంచి వైదొలగాలనేది కంపెనీ వ్యూహం.

ఎల్‌జీ వింగ్  ఫీచర్లు
6.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్  డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10
2440 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 765జి ప్రాసెస‌ర్‌
8జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
64+13+12 మెగాపిక్స‌ల్ రియర్‌ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement