Economic Statistics
-
బలహీనత కొనసాగొచ్చు
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలకు తోడు దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో దలాల్ స్ట్రీట్ బలహీనంగా కదలాడొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చంటున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ‘‘కార్పొరేట్ తొలి త్రైమాసిక ఫలితాల మాదిరిగానే దేశీయ క్యూ1 జీడీపీ వృద్ధి అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఆగస్టు పీఎంఐ తయారీ, సేవా రంగ డేటా, ఆటో అమ్మకాలు మెప్పించలేపోయాయి. ఈ పరిణామాలతో అప్రమత్తత వాతావరణం నెలకొని ఉంది. అధిక వాల్యుయేషన్ల కారణంగా పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు రాణించలేపోతున్నాయి. కమోడిటీ ధరలు తగ్గడంతో మెటల్ షేర్లూ నష్టాలు చవిచూస్తున్నాయి. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 24,500–24,400 పరిధిలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,400 వద్ద మరో మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల గతవారంలో సెన్సెక్స్ 1,182 పాయింట్లు, నిఫ్టీ 384 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. స్థూల ఆర్థిక డేటాపై దృష్టి అమెరికా ఆగస్టు ద్రవ్యల్బోణ గణాంకాలు సెపె్టంబర్ 11న, దేశీయ ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణ, జూలై పారిశ్రామికోత్పత్తి డేటా గురువారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రొడ్యూసర్ ప్రెస్ ఇండెక్స్(పీపీఐ) సెపె్టంబర్ 14న వెల్లడి కానున్నాయి. అమెరికాలో ఉపాధి కల్పన తగ్గినట్లు డేటా వెలువడంతో ఫెడ్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మే వడ్డీరేట్లను తగ్గించే అంచనాలు పెరిగాయి. ఇదే సమయంలో ఆర్థిక మాంద్య భయాలు తెరపైకి వచ్చాయి.ఈ వారం ఐపీఓల పండుగ దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల వారం మళ్లీ వచి్చంది. మెయిన్ బోర్డు విభాగంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో సహా నాలుగు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. అందులో పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్, టొలిన్స్ టైర్స్, క్రాస్ కంపెనీలు ఉన్నాయి. తద్వారా ఆయా కంపెనీలు మొత్తం రూ.8,390 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి. అలాగే తొమ్మిది సంస్థలు ఎస్ఎంఈ సెగ్మెంట్లో పబ్లిక్ ఇష్యూ ప్రారంభించనున్నాయి. ‘‘సెబీ నిబంధల ప్రకారం కంపెనీలు సమరి్పంచిన ముసాయిదా పత్రాల్లోని ఆర్థిక గణాంకాలు ఆరు నెలలలోపు అయి ఉండాలి. గత ఆర్థిక సంవత్సరంలో సెబీ నుంచి అనుమతులు పొందిన ఐపీఓలకు ఈ సెపె్టంబర్ చివరి నెల కావడంతో కంపెనీలు ఇష్యూ బాట పట్టాయి’’ అని ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ మునీష్ అగర్వాల్ తెలిపారు. తొలివారంలో రూ.11వేల కోట్ల కొనుగోళ్లు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్ తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల ఆర్థిక మందగమన భయాలతో ఎఫ్ఐఐలు తమ కేటాయింపులను పునశ్చరణ చేసుకోవచ్చు. రిస్క్ సామర్థ్యాన్ని తగ్గించుకునే వ్యూహాం అమలు చేసినట్లయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల తగ్గొచ్చు’’ అని మోజోపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో సునీల్ దమానియా తెలిపారు. ఇదే సమీక్షా కాలం(సెపె్టంబర్ 1–6 తేదీల)లో డెట్ మార్కెట్లో రూ.7,600 కోట్ల పెట్టుడులు పెట్టారు. ఎఫ్ఐఐలు ఆగస్టులో రూ.7,320 కోట్లు, జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్లు చొప్పున విక్రయాలు జరిపారు. -
వరుస నష్టాలకు బ్రేక్
ముంబై: స్టాక్ సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఎన్నికల అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలతలున్నా.., అధిక వెయిటేజీ రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్ల రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 72,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 22,055 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచి్చన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. లండన్ మెటల్ ఎక్సే్చంజీలో బేస్ మెటల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. అలాగే యుటిలిటీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీ, టెలికం, ఆటో షేర్లు రాణించాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 542 పాయింట్లు ఎగసి 72,947 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు బలపడి 22,131 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, బ్యాంకులు, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, ప్రతి రెండు షేర్లకు ఒక షేరు బోనస్ ప్రకటించడంతో బీపీసీఎల్ షేరు 4.5% లాభపడి రూ.619 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.622 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
ఆర్బీఐ పాలసీ, ప్రపంచ పరిణామాలు కీలకం
న్యూఢిల్లీ: వడ్డీరేట్లపై ఆర్బీఐ వెల్లడించే పాలసీ నిర్ణయం, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని పేర్కొన్నారు. కాగా, బుధవారం మహావీర్ జయంతి అలాగే శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్లు పని చేయవు. ట్రేడింగ్ మూడు రోజులకు మాత్రమే పరిమితం కానుంది. ఆర్బీఐ పాలసీపై ఫోకస్... ఆర్బీఐ పాలసీ నిర్ణయం ఏప్రిల్ 6న వెలువడనుంది. దీనిపై ఈ వారం మార్కెట్ ప్రధానంగా దృష్టి పెడుతుందని స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. మళ్లీ నికర కొనుగోలుదారులుగా మారుతున్న ఎఫ్‌పీఐల పెట్టుబడులపై అలాగే దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐ)పై కూడా ఫోకస్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక గతేడాది రికార్డు స్థాయి వాహన విక్రయాలను సాధించిన ఆటోమొబైల్ రంగంపైగా మార్కెట్ దృష్టి సారిస్తుందన్నారు. ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం పెంచే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పీఎంఐ గణాంకాలు.. ఆర్బీఐ చర్యలతో పాటు ఏప్రిల్3న ఎస్అండ్పీ గ్లోబల్ తయారీ రంగ పీఎంఐ గణాంకాలు, ఏప్రిల్ 5న సేవల రంగ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. ‘దేశీయ అంశాలకు తోడు ప్రపంచ పరిణామాలు, విదేశీ నిధుల ప్రవాహ ధోరణులు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి’ అని రెలిగేర్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వ్యాఖ్యానించారు. సమీప కాలంలో చూస్తే మార్కెట్ దృష్టి అంతా ఆర్బీఐ పాలసీపైనే ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. ఆర్బీఐ నిర్ణయం, పీఎంఐ డేటా కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్‌హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. గతవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,462 పాయింట్లు (2.54%) దూసుకెళ్లింది. శుక్రవారం ఒక్కరోజే 1,031 పాయింట్లు ఎగబాకడం విశేషం. బ్యాంకింగ్ సంక్షోభ భయాలు నెమ్మదిగా సద్దుమణుగుతుండటంతో ఆసియా, యూరప్, అమెరికా సూచీలు సైతం గత శుక్రవారం సానుకూలంగా ముగిశాయి. -
ఎట్టకేలకు లాభాలొచ్చాయ్
ముంబై: ఎనిమిది వరుస నష్టాల ముగింపు తర్వాత బుధవారం స్టాక్ సూచీలు లాభపడ్డాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు కలిసిరాగా.., దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. అధిక వెయిటేజీ రిలయన్స్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు రెండుశాతం రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఉదయం సెన్సెక్స్ 174 పాయింట్ల లాభంతో 59,136 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 17,360 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి అరగంట కాస్త తడబడినా.., వెంటనే తేరుకోగలిగాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం మరింత విశ్వాసాన్నిచ్చింది. ఇటీవల దిద్దుబాటులో భాగంగా కనిష్టాలకు దిగివచ్చిన నాణ్యమైన షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. ఒక దశలో సెన్సెక్స్ 513 పాయింట్లు బలపడి 59,475 వద్ద, నిఫ్టీ 164 దూసుకెళ్లి 17,468 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. ట్రేడింగ్ చివరి వరకు స్థిరమైన లాభాల్లో కదలాడాయి. ఫలితంగా సెన్సెక్స్ 449 పాయింట్లు పెరిగి 59,411 వద్ద, నిఫ్టీ 147 పాయింట్ల లాభంతో 17,451 వద్ద ముగిశాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. విస్తృత స్థాయి మార్కెట్లోని చిన్న, మధ్య తరహా షేర్లకు రాణించడంతో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు వరుసగా 1.38%, 1.35శాతం చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.424 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,499 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో సింగపూర్ మినహా అన్ని దేశాల సూచీలు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు అరశాతం పెరిగాయి. ► సెన్సెక్స్ సూచీ 449 పెరగడంతో బీఎస్ఈ ఎక్సే్చంజీలో రూ.3.28 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ► అదానీ గ్రూప్‌లోని మొత్తం పది కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అత్యధికంగా అదానీ ఎంటర్ప్రైజెస్ 15% బలపడింది. అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ షేర్లు ఐదుశాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. అంబుజా సిమెంట్స్ 3.32%, ఏసీసీ 2.14%, అదానీ పోర్ట్స్ ఒకటిన్నరశాతం చొప్పున లాభపడ్డాయి. దీంతో గ్రూప్ మొత్తం కంపెనీల మార్కెట్ వ్యాల్యూయేషన్ రూ.7.56 లక్షల కోట్లకు చేరింది. ఎఫ్అండ్ఓలో చమురు, గ్యాస్ ఎన్ఎస్ఈకి సెబీ గ్రీన్‌సిగ్నల్ స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ లైట్ స్వీట్ క్రూడ్‌గా పిలిచే డబ్ల్యూటీఐతోపాటు.. నేచురల్ గ్యాస్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను ప్రవేశ పెట్టనుంది. ఇందుకు సెబీ నుంచి అనుమతి పొందినట్లు ఎన్ఎస్ఈ తాజాగా వెల్లడించింది. త్వరలోనే వీటి ఎఫ్‌అండ్‌వో లావాదేవీలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. -
క్యూ2 ఫలితాలు, గణాంకాలపై కన్ను
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం కార్పొరేట్ ఫలితాలు, ఆర్థిక గణాంకాల ఆధారంగా ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. సోమవారం(10న) సాఫ్ట్వేర్ సేవల నంబర్‌వన్ కంపెనీ టీసీఎస్ జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాలు ప్రకటించనుంది. ఈ బాటలో ఇతర ఐటీ దిగ్గజాలు విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(12న), ఇన్ఫోసిస్(13న), ద్విచక్ర వాహన బ్లూచిప్ కంపెనీ బజాజ్ ఆటో(14న), ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్(15న).. క్యూ2 పనితీరును వెల్లడించనున్నాయి. ఇక ఆగస్ట్ నెలకు పారిశ్రామికోత్పత్తి, సెప్టెంబర్ నెలకు రిటైల్ ధరల(సీపీఐ) గణాంకాలు 12న, సెప్టెంబర్ టోకు ధరల (డబ్ల్యూపీఐ) వివరాలు 14న వెలువడనున్నాయి. రూపాయి ఎఫెక్ట్ క్యూ2 ఫలితాల సీజన్ ప్రారంభంకానుండగా.. మరోపక్క ఆర్థిక గణాంకాలూ ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గత వారం డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 82ను తాకింది. చమురు దేశాల(ఒపెక్) సరఫరా కోతలతో బ్రెంట్ చమురు ధర మళ్లీ 100 డాలర్లకు చేరువైంది. ఇక డాలరు ఇండెక్స్ కొంతవెనకడుగు వేసినప్పటికీ ఫెడ్ గత పాలసీ సమీక్షా నిర్ణయాల వివరాలు(మినిట్స్) వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టిపెట్టే అవకాశముంది. వీటికితోడు ఇటీవల విదేశీ ఇన్వెస్ట ర్లు దేశీ స్టాక్స్‌లో అమ్మకాలవైపు మొగ్గుచూపుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్య భయాలు కొనసాగుతుండటంతో ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నీ దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు అంతర్జాతీయంగా చూస్తే యూఎస్ సీపీఐ గణాంకాలు 11న విడుదల కానున్నాయి. ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ గత పాలసీ మినిట్స్ 12న, కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెల్లడికానున్నాయి. వారం రోజులపాటు ఐఎంఎఫ్ సాధారణ వార్షిక సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా కదలనున్నట్లు నిపుణులు వివరించారు. గత వారం మూడు వారాల డౌన్‌ట్రెండ్‌కు చెక్ పెడుతూ గత వారం దేశీ మార్కెట్లు జోరందుకున్నాయి. ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైనప్పటికీ సెన్సెక్స్ 764 పాయింట్లు జమ చేసుకుని 58,191 వద్ద నిలవగా.. నిఫ్టీ 220 పాయింట్ల ఎగసి 17,315 వద్ద స్థిరపడింది. ఫలితంగా ప్రధాన ఇండెక్సులు సాంకేతికంగా కీలకమైన 58,000– 17,000 స్థాయిలకు ఎగువనే స్థిరపడ్డాయి. -
ఆర్బీఐ నిర్ణయాలు, ఆర్థిక గణాంకాలు కీలకం
ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు, ద్రవ్య పాలసీపై ఆర్బీఐ నిర్ణయాలతో పాటు ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్‌సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్ కదలికలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూలతలతో స్టాక్ సూచీల ఐదువారాల వరుస లాభాలకు గతవారం బ్రేక్ పడింది. బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్ల పతనంతో ఆ వారం మొత్తంగా సెన్సెక్స్ 1,283 పాయింట్లు, నిఫ్టీ 321 పాయింట్లను కోల్పోయాయి. అయితే ఆయిల్ అండ్ గ్యాస్, ఇంధన, మెటల్, ఆటో షేర్లలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ‘‘ఈ వారంలోనూ మార్కెట్ స్థిరీకరణ జరగవచ్చు. అమెరికా స్టాక్ మార్కెట్ సెపె్టంబర్ దిద్దుబాటు ప్రభావం ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. క్రూడాయిల్, కమోడిటీ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం భయాలు తెరపైకి వచ్చాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు యోచనలు చేస్తున్నాయి. ఫెడ్ ట్యాపరింగ్, చైనాలో తాజాగా నెలకొన్న సంక్షోభాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ అంశాలు ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. అయితే దేశీయ కార్పొరేట్ల రెండో ఆర్థిక గణాంకాలు ఆశాజనకంగా ఉండొచ్చనే విశ్లేషకుల అంచనాలు కలిసొచ్చే అంశంగా ఉంది’’ అని జూలియస్ బేయర్ ఇండియా ఎండీ ఉన్మేష్ కులకర్ణి తెలిపారు. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత లోతుగా పరిశీలిస్తే... అందరి చూపు ఆర్బీఐ వైపు ... భారత కేంద్ర బ్యాంకు ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశం బుధవారం(అక్టోబర్ 6న) ప్రారంభమవుతుంది. గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం పాలసీ కమిటీ నిర్ణయాలను వెల్లడించున్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టేందుకు వడ్డీరేట్లను పెంచమనే వ్యాఖ్యలకు కట్టుబడి రెపో రేటును యథాతథంగా ఉండొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే క్రూడాయిల్ ధరలు పెరుగుదల, కోవిడ్ పరిస్థితులు అదుపులోకి రావడం, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక వృద్ధి స్థితిగతులపై ఆర్బీఐ అంచనాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. 8న టీసీఎస్‌తో ఆర్థిక ఫలితాల బోణీ... కంపెనీల క్యూ2 ఫలితాల సీజన్ ఆరంభమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్(జూలై–సెపె్టంబర్) ఫలితాలను అక్టోబర్ 8న దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ బోణీ చేయనుంది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే వారం 13న ఫలితాలను వెల్లడించనున్నది. విప్రో ఫలితాలు అదే రోజున (అక్టోబర్ 13న) వెలువడతాయి. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం... దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సేవా రంగ ఉత్పత్తి గణాంకాలు ఈ మంగళవారం విడుదల కానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి వరుకు ఆరు మాసాల్లో తొలి రెండు మినహా మిగతా నాలుగు నెలల్లో సేవారంగం మెరుగైన పనితీరు కనబరించింది. ఈ వారాంతాన శుక్రవారం ఆర్బీఐ సెప్టెంబర్ 24వ తేదీతో ముగిసిన డిపాజిట్, బ్యాంక్ రుణ వృద్ధి గణాంకాలతో పాటు అక్టోబర్ 1వ వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటాను వెల్లడించనుంది. ఈ స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం సూచీలపై పడొచ్చని నిపుణులు అంటున్నారు. రెండో నెలలోనూ కొనుగోళ్లు... దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా రెండో నెలలోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. భారత మార్కెట్లో ఈ సెప్టెంబర్ మాసంలో రూ.26,517 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.13,154 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.13,363 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అయితే డాలర్ ఇండెక్స్ బలపడటం, చైనాలో అనిశి్చతుల ప్రభావంతో ఎఫ్ఐఐలు ఇటీవల భారత్‌తో పాటు ఇతర వర్థమాన దేశాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ‘‘కోవిడ్ తర్వాత దీర్ఘకాలపు ప్రయోజనాల దృష్ట్యా భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచింది. మెరుగైన ఆర్థిక గణాంకాల నమోదైతే ఎఫ్ఐఐలు తిరిగి దేశంలో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇండియా డెరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
ఎకానమీ ప్రగతిబాట!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరళతర ద్రవ్య, పరపతి విధానం కొనసాగింపునకు తగిన ఆర్థిక గణాంకాలు శుక్రవారం వెలువడ్డాయి. 2020 డిసెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి ‘పాజిటివ్’లోకి మారింది. ఒక శాతం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగం కొంత మెరుగవడం దీనికి ప్రధాన కారణమని తాజా గణాంకాలు తెలిపాయి. ఇక ఆర్బీఐ తన పాలసీ విధానానికి ప్రాతిపదికగా తీసుకునే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 4.06 శాతంగా నమోదయ్యింది. ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6% –2% శ్రేణిలో (ప్లస్ లేదా మైనస్ 2తో 4 శాతంగా) ఉండాలి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలు ఇలా... మైనింగ్ మినహా అన్నీ మెరుగే... ► తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 77.63 శాతం వాటా ఉన్న ఈ రంగం 2020 డిసెంబర్లో 1.6% వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ► విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి 5.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అయితే 2019 డిసెంబర్లో ఈ రంగం 0.1 శాతం క్షీణతలో ఉండడం గమనార్హం. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యం త్రాల ఉత్పత్తికి సూచికగా ఉండే ఈ విభాగంలో వృద్ధి 0.6 శాతం వృద్ధి నమోదయ్యింది. 2020 డిసెంబర్లో 18.3 శాతం క్షీణత నెలకొంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: దీర్ఘకాలం మన్నే రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లకు సంబంధించిన ఈ విభాగంలో వృద్ధి 4.9 శాతంగా నమోదయ్యింది. 2019 డిసెంబర్లో 5.6 శాతం క్షీణత ఈ విభాగంలో ఉంది. ► కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్: ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)కు చెందిన ఈ విభాగంలో సైతం రెండు శాతం వృద్ధి నమోదయ్యింది. 2019 డిసెంబర్లో ఈ విభాగంలో క్షీణ రేటు 3.2 శాతం. ► మైనింగ్: మైనింగ్ రంగం 4.8 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2019లో ఈ రంగం 5.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఏప్రిల్–డిసెంబర్ మధ్య 13.5 శాతం క్షీణత కాగా పారిశ్రామిక ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య 13.5 శాతం క్షీణించింది. 2019 ఇదే కాలంలో ఇది స్వల్పంగా 0.3 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ఐఐపీ నడత ఇలా... 2019 డిసెంబర్లో ఐఐపీ స్వల్పంగా 0.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2019 డిసెంబర్లో తయారీ రంగం 0.3 శాతం క్షీణతను నమోదుచేసుకోవడం ఇక్కడ ప్రస్తావనాంశం. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, దేశాల రక్షణాత్మక విధానాల వంటి అంశాలతో దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమన పరిస్థితి దీనికి నేపథ్యం. కాగా కోవిడ్–19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో గత ఏడాది మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణతలోకి జారిపోయింది. 2020 ఆగస్టు వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి వృద్ధిలోకి మారింది. ఒక శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో 4.2 వృద్ధి నమోదయ్యింది. ఇందుకు పండుగల సీజన్ కూడా కలిసి వచ్చింది. అయితే నవంబర్‌లో తిరిగి ఐఐపీ 2.1 శాతం క్షీణతలోకి పడిపోయింది. కాగా, తాజా గణాంకాలను కోవిడ్–19 ముందు నెలలతో పోల్చుకోవడం సరికాదని కూడా గణాంకాల శాఖ పేర్కొనడం గమనార్హం. 16 నెలల కనిష్టానికి ‘రిటైల్’ ధరలు జనవరిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) రిటైల్ ద్రవ్యోల్బణం 4.06 శాతంగా నమోదయ్యింది. గడచిన 16 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో (2019 సెప్టెంబర్‌లో 4 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆహార, కూరగాయల ధరల తగ్గుదల దీనికి ప్రధాన కారణం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిత స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదుకావడమూ వరుసగా ఇది రెండవనెల కావడం గమనార్హం. డిసెంబర్ 2020లో 4.59 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఎన్ఎస్ఓ తాజా గణాంకాల ప్రకారం, జనవరిలో ఫుడ్ బాస్కెట్ ధర (2019 ఇదే నెల ధరతో పోల్చి) కేవలం 1.89 శాతం పెరిగింది. 2020 డిసెంబర్లో ఈ రేటు 3.41 శాతం. కూరగాయల ధరలు 15.84 శాతం తగ్గాయి. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 13.39 శాతం దిగివచ్చాయి. ప్రొటీన్ రిచ్ మాంసం, చేపలు ధరలు 12.54 శాతం తగ్గితే, గుడ్ల ధరలు 12.85 శాతం తగ్గాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 2.73 శాతం తగ్గాయి. కాగా సీపీఐలో ఒక భాగంగా ఉన్న ఫ్యూయల్ అండ్ లైట్ విభాగంలో ధరల పెరుగుదల 3.87 శాతంగా ఉంది. కొన్ని నిర్దిష్ట గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ఎన్ఎస్ఓ గణాంకాలను సేకరిస్తుంది. ఆర్బీఐ సరళతర పాలసీ కొనసాగింపునకు దోహదం ఆర్థికాభివృద్ధికి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)ను మరింత తగ్గించాలన్న డిమాండ్ పారిశ్రామిక వర్గాల నుంచి వినబడుతోంది. వడ్డీరేటు తగ్గింపు ద్వారా డిమాండ్‌కు, వినియోగానికి తద్వారా వృద్ధికి ఊపును ఇవ్వవచ్చని ఆయా వర్గాలు కోరుతున్నాయి. అయితే ద్రవ్యోల్బణం భయాలతో ఆర్బీఐ మరింత రెపో తగ్గించడానికి వెనుకాడుతోంది. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన (ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్. ఫిబ్రవరి నెలల్లో) నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు కారణంగా చూపుతోంది. అయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాలను వ్యక్తం చేస్తున్న ఆర్బీఐ, రేటు తగ్గింపునకు మొగ్గుచూపే సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది. ఆర్బీఐ తాజా అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతంగా ఉంటుంది. -
ధరలు పైకి.. పరిశ్రమలు డీలా!
ఆర్థిక గణాంకాలు నిరుత్సాహం ► జూలైలో పారిశ్రామిక వృద్ధి 1.2 శాతం ► ఆగస్టులో ఐదు నెలల గరిష్టానికి రిటైల్ ధరలు... న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక గణాంకాలు ఇంకా నిరుత్సాహంగానే కొనసాగుతున్నట్లు మంగళవారం వెలువడిన గణాంకాలు స్పష్టంచేశాయి. 2017 జూలై పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు కేవలం 1.2 శాతంగా నమోదయింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ వృద్ధి రేటు 4.5 శాతం. ఇక ఏప్రిల్–జూలై మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6.5 శాతం నుంచి 1.7 శాతానికి పడిపోయింది. మరోవైపు ఆగస్టు నెల్లో రిటైల్ ధరల స్పీడ్ 3.36 శాతంగా (గత ఏడాది ఇదే నెలలో ధరలతో పోల్చి) నమోదయింది. గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. తయారీ పేలవ పనితీరు... మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో దాదాపు 77 శాతంగా ఉన్న తయారీ రంగం జూలైలో పేలవ పనితీరును ప్రదర్శించింది. 2016 జూలైలో తయారీ రంగం 5.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటే, 2017 జూలైలో అసలు వృద్ధిలేకపోగా –0.1 శాతం క్షీణించింది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య నెలలను చూస్తే వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 1.3 శాతానికి పడింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో ఎనిమిది మాత్రమే వృద్ధిని నమోదుచేసుకున్నాయి. ♦ క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర ఉత్పత్తి, డిమాండ్ వృద్ధికి ప్రతిబింబమైన ఈ విభాగంలోనూ 8.8 శాతం వృద్ధి రేటు (2016 జూలై) –1 శాతం క్షీణతలోకి జారింది. ♦ కన్జూమర్ డ్యూరబుల్స్: ఈ విభాగంలో 0.2 శాతం వృద్ధి ఈ దఫా ఏకంగా –1.3 శాతం క్షీణతలోకి జారింది. అయితే కన్జూమర్–నాన్–డ్యూరబుల్స్ విషయంలో వృద్ధి రేటు 3.4 శాతానికి ఎగసింది. ♦ విద్యుత్: ఈ రంగం మాత్రం చక్కని పనితీరును ప్రదర్శించింది. వృద్ధిరేటు 2.1% నుంచి 6.5%కి చేరింది. అయితే ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో మాత్రం ఈ రేటు 7.9% నుంచి 5.6%కి తగ్గింది. ♦ మైనింగ్: ఈ రంగం కూడా సానుకూల రీతిలో 0.9 శాతం వృద్ధిరేటు 4.8 శాతానికి పెరిగింది. అయితే ఏప్రిల్ నుంచి జూలై మధ్య నెలల్లో చూస్తే వృద్ధి రేటు 5.8 శాతం నుంచి 2.1 శాతానికి పడింది. ♦ మరోవైపు జూన్‌లో వృద్ధి లేకపోగా – 0.2 శాతం క్షీణత నమోదయ్యిందని సవరించిన గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్ర స్థాయిల్లో సంస్కరణలు: ఫిక్కీ పారిశ్రామిక ఉత్పత్తి పేలవ పనితీరుపై పారిశ్రామిక ప్రాతినిధ్య మండలి ఫిక్కీ సెక్రటరీ జనరల్ సంజయ్ బారు మాట్లాడుతూ, దేశంలో పెట్టుబడుల పునరుద్ధరణ తక్షణం అవసరమన్నారు. ఇందుకు వడ్డీరేట్ల తగ్గింపు, ఈ ప్రయోజనం పెట్టుబడిదారులకు అందేలా చేయడం కీలకమని వివరించారు. దీనితోపాటు రాష్ట్రస్థాయిలో సంస్కరణలూ ముఖ్యమని వివరించారు. కాగా, భారత్ 9 నుంచి 10 శాతం భారీ వృద్ధిని సాధించడానికి తొలుత తయారీ రంగం పురోగమించాల్సి ఉందని అసోచామ్–ఈవై నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. తయారీ రంగం వచ్చే 30 సంవత్సరాలూ స్థిరంగా 14 నుంచి 15 శాతం మేర సగటు వార్షిక వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని వివరించింది. పెరుగుతున్న రిటైల్ ధరలు మరోవైపు రిటైల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి నుంచి తగ్గుతూ జూన్ నాటికి 1.46 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం స్పీడ్ మళ్లీ పెరుగుతూ జూలైలో 2.36 శాతానికి చేరింది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం ఇది ఆగస్టు నెలలో 3.36 శాతం. అంటే 2016 రిటైల్ బాస్కెట్ ధరతో పోల్చితే ప్రస్తుత ఏడాది ఆగస్టు రిటైల్ బాస్కెట్ ధర 3.36 శాతం పెరిగిందన్నమాట. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. పండ్లు, కూరగాయల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. నిత్యావసరాలు ఇలా: ధరలు పెరిగిన జాబితాలో కూరగాయలు (6.16 శాతం), పండ్లు (5.29 శాతం), చక్కెర (7.35 శాతం), పాలు, పాలపదార్థాలు (3.58 శాతం) ప్రెపేర్డ్ మీల్స్ (5.23%), మాంసం చేపలు (3 శాతం) వంటివి ఉన్నాయి. -
రేటు కోతకు గణాంకాలు అనుకూలించాలి
వాషింగ్టన్: ద్రవ్యోల్బణం, ఇతర స్థూల ఆర్థిక గణాంకాలు అనుమతిస్తే- రెపో రేటు కోతకు ఏమీ అభ్యంతరం ఉండబోదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. రేటు కోతకు తాము అనుకూలమే అయినా గణాంకాలు ఇందుకు వీలుకల్పించాలని సూచించారు. ద్రవ్య పరపతి సమీక్ష సెప్టెంబర్ 29న జరగనున్న నేపథ్యంలో రాజన్ తాజా వివరణ వెలువడ్డం గమనార్హం. కన్సాస్ సిటీ ఫెడరల్ రిజర్వ్ ప్రతిష్టాత్మక జాక్సన్ హోలీ ఎకనమిక్ సింపోజియంలో పాల్గొన్న రాజన్ ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో రెపో రేటు కోత అంశంపై మాట్లాడారు. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 7.25 శాతం)ను ఈ ఏడాది ఇప్పటికి ఆర్బీఐ మూడుసార్లు తగ్గించింది. ఈ ప్రయోజనంలో దాదాపు సగాన్ని బ్యాంకులు సైతం కస్టమర్లకు బదలాయించారు. వృద్ధికి చేయూతగా బ్యాంక్ మరింత రేటు కోత నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ అటు ప్రభుత్వం నుంచీ ఇటు పారిశ్రామికవేత్తల నుంచీ వస్తోంది. ఈ అంశంపై రాజన్ మాట్లాడుతూ, ‘‘రేటు కోత అంశం పూర్తయ్యిందని మేము చెప్పడం లేదు. అలా చేయడానికి గణాంకాలు అనుమతించాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం’’ అని అన్నారు.