వాషింగ్టన్: ద్రవ్యోల్బణం, ఇతర స్థూల ఆర్థిక గణాంకాలు అనుమతిస్తే- రెపో రేటు కోతకు ఏమీ అభ్యంతరం ఉండబోదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. రేటు కోతకు తాము అనుకూలమే అయినా గణాంకాలు ఇందుకు వీలుకల్పించాలని సూచించారు. ద్రవ్య పరపతి సమీక్ష సెప్టెంబర్ 29న జరగనున్న నేపథ్యంలో రాజన్ తాజా వివరణ వెలువడ్డం గమనార్హం. కన్‌సాస్ సిటీ ఫెడరల్ రిజర్వ్ ప్రతిష్టాత్మక జాక్‌సన్ హోలీ ఎకనమిక్ సింపోజియంలో పాల్గొన్న రాజన్ ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో రెపో రేటు కోత అంశంపై మాట్లాడారు.
బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 7.25 శాతం)ను ఈ ఏడాది ఇప్పటికి ఆర్‌బీఐ మూడుసార్లు తగ్గించింది. ఈ ప్రయోజనంలో దాదాపు సగాన్ని బ్యాంకులు సైతం కస్టమర్లకు బదలాయించారు. వృద్ధికి చేయూతగా బ్యాంక్ మరింత రేటు కోత నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ అటు ప్రభుత్వం నుంచీ ఇటు పారిశ్రామికవేత్తల నుంచీ వస్తోంది. ఈ అంశంపై రాజన్ మాట్లాడుతూ, ‘‘రేటు కోత అంశం పూర్తయ్యిందని మేము చెప్పడం లేదు. అలా చేయడానికి గణాంకాలు అనుమతించాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం’’ అని అన్నారు.
రేటు కోతకు గణాంకాలు అనుకూలించాలి
Published Sun, Aug 30 2015 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM
Advertisement