మార్కెట్లలో అస్థిరత ఉంటే.. అసెట్ అలొకేషన్ ఫండ్లే మందు!! | If the volatility in the markets .. alokesan hold Asset drug !! | Sakshi
Sakshi News home page

మార్కెట్లలో అస్థిరత ఉంటే.. అసెట్ అలొకేషన్ ఫండ్లే మందు!!

Published Sun, Apr 3 2016 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

మార్కెట్లలో అస్థిరత ఉంటే.. అసెట్ అలొకేషన్ ఫండ్లే మందు!!

మార్కెట్లలో అస్థిరత ఉంటే.. అసెట్ అలొకేషన్ ఫండ్లే మందు!!

ఈక్విటీ మార్కెట్ అంటే రిస్కు సహజం. అందుకే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు, అప్పుడప్పుడు ఇన్వెస్ట్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉ ండాలి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఇన్వెస్టర్లు మార్కెట్ అస్థిరత నుంచి తప్పించుకోవాలంటే ‘డైనమిక్ అసెట్ అలొకేషన్’ వ్యూహం సరైనదని చెప్పొచ్చు.

 

అసెట్ కేటాయింపులు ఇలా...

చాలా మంది ఇతరులను అనుసరిస్తుంటారు. అది సరికాదు. బయటైనా, స్టాక్ మార్కెట్‌లోనైనా. తమకు తెలిసిన వారు షేర్లు అమ్మేస్తున్నారు కదా అని వీరు కూడా స్టాక్స్ అమ్మేస్తారు. అలాగే అందరూ కొంటున్నారు కదా అని వీరు కూడా కొనేస్తారు. ఇలా ఎప్పుడూ చేయొద్దు. సరైన ప్లానింగ్ లేకుండా ఇలా చేస్తే నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే అసెట్ అలొకేషన్ వ్యూహాన్ని అనుసరించాలి. అసెట్ అలొకేషన్ వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి సెంటిమెంట్‌ను తరిమేయొచ్చు. దీంతో మనం మార్కెట్ బాగులేనపుడు స్టాక్స్‌ను అమ్మేయడం, బాగున్నప్పుడు కొనడం వంటి చర్యలకు దూరంగా ఉంటాం. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ సాయంతో ఈ వ్యూహాన్ని అమలు చేయవచ్చు.

 
డైనమిక్ రీ-బ్యాలెన్సింగ్
డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌లో తక్కువ కొనడం, ఎక్కువ అమ్మడం అనే విధానాన్ని గమనిస్తాం. ఇక్కడ మన సెంటిమెంట్లతో సంబంధం ఉండదు. ఈక్విటీ మార్కెట్స్ ఆశాజనకంగా లేనప్పుడు (పడ్డప్పుడు) అందులో ఇన్వెస్ట్‌చేసి, పెరుగుతున్నప్పుడు కొన్ని షేర్లను విక్రయించి లాభాలను స్వీకరించవచ్చు. ఫండ్ నిబంధనల ప్రకారం అసెట్ అలొకేషన్స్‌ను మార్చుకుంటూ ఉండాలి. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను తీసుకుంటే.. ఇందులో రీ-బ్యాలెన్సింగ్ ప్రతిరోజూ జరుగుతుంది. ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీల వాటా షేర్ల ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు 30 శాతంగా, ధరలు ఆకర్షణీయంగా ఉన్నప్పుడు 80 శాతంగా ఉంటుంది. దీని కోసం ఫండ్ కొన్ని ప్రమాణాలను అవలంబిస్తూ ఉంటుంది. సాధారణంగా అందరికీ తెలిసిన సూత్రం... ‘ప్రైస్-బుక్ వేల్యూ’. ఈక్విటీల ప్రైస్-టు-బుక్‌వేల్యూ ఆధారంగా మార్కెట్ స్థితిని అంచనా వేయవచ్చు. పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలకు సంబంధించి డైన మిక్ అసెట్ అలొకే షన్ ఫండ్స్ ప్రతిరోజూ ప్రైస్-బుక్ వేల్యూను గమనిస్తాయి. దీని ప్రకారమే అసెట్స్‌ను రీ-బ్యాలెన్స్ చేసుకుంటాయి. ఒకానొక రోజు బుక్ వేల్యూ అనుకున్న స్థాయికి కన్నా దిగువకు వచ్చినప్పుడు ఫండ్ తర్వాతి రోజు ఎక్కువ ఈక్విటీలను కొంటుంది. బుక్ వేల్యూ ఇంకా పడితే ఈక్విటీ కేటాయింపును పెంచుకుంటుంది. పోర్ట్‌ఫోలియోలోని మొత్తం ఈక్విటీ పరిమితిలోనే ఇదంతా జరుగుతుంది. ఇలా రోజూ రీ-బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల పోర్ట్‌ఫోలియో దృఢంగా తయారవుతుంది.

 

ఫండ్స్ ప్రయోజనాలు
మీరు ఈక్విటీ ఎంచుకున్నారా? ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ మార్గాన్ని ఎన్నుకున్నారా? అనే దాంతో సంబంధం లేకుండా రిస్క్ ప్రొఫైల్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రాధాన్యాల ఆధారంగా మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. వీటిద్వారా మార్కెట్లోకి అడుగుపెడితే ైడె వర్సిఫికేషన్, ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ అనే ప్రయోజనాలను పొందొచ్చు. డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ వల్ల ఇన్వెస్ట్‌మెంట్లకు ప్రతిఫలం ఉంటుంది. ఇవి కొత్త ఇన్వెస్టర్లకు, ఒక రకంగా రిస్క్‌ను భరించగలిగే ఇన్వెస్టర్లకు మాత్రమే బాగుంటాయి.  దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పన్ను ప్రయోజనాలను పొందొచ్చు.

 

 సీహెచ్.రామ్ ప్రకాశ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement