ముంబై: ఆయిల్ ధరలు, ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలతో స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో మొదలయ్యాయి. అటు ఎఫ్‌ఐఐల అమ్మకాలు, ఇటు డెరివేటివ్ ముగింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టంతో 27,736 వద్ద, నిఫ్టీ కూడా41 పాయింట్లు క్షీణించి 8,573 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ బలహీనత,టాటా గ్రూప్ షేర్లలో అమ్మకాలు ఈ రోజుకూడా కొనసాగుతున్నాయి. దీంతోపాటు ఐటీ, ఆటో, మెటల్స్ రంగాలు బలహీనంగా ఉన్నాయి. టాటా మోటార్స్, టాటా పవర్, టాటా స్టీల్, టాటా హోటల్స్ , టాటా కమ్యూనికేషన్స్, షేర్లలో భారీఅమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఏషియన్ పెయింట్స్, యాక్సిస్, లుపిన్ నష్టపోతుండగా, ఐటీసీ, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఓఎన్‌జీసీ, మారుతీ, టెక్ మహీంద్రా స్వల్పంగా లాభపడుతున్నాయి.
అటు దేశీయమారకపు రేటుతో రూపాయి 0.04పైసల నష్టంతో రూ.66.87వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పసిడి పది గ్రా. రూ. 32నష్టంతో రూ. 29,866 వద్ద ఉంది.
రెండో రోజూ నష్టాల్లో మార్కెట్లు
Published Thu, Oct 27 2016 10:36 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
Advertisement
Advertisement