Indian equity market
-
ఎన్ఆర్ఐల ఈక్విటీ పెట్టుబడులకు ఇన్వెస్ట్ 19 వేదిక
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) భారత ఈక్విటీ మార్కెట్లలో నేరుగా ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా ఒక గేట్వేను ఆవిష్కరించనున్నట్టు ఇన్వెస్ట్ 19 ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్–డిసెంబర్ నాటికి ఈ ప్లాట్ఫామ్ను తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ కంపెనీ ఇప్పటికే ఆన్లైన్ మల్టీబ్రోకింగ్ సేవలు అందిస్తోంది. ఒకే క్లిక్తో భారత ఈక్విటీల్లో పెట్టుబడుల అవకాశాలను ఎన్ఆర్ఐలకు కలి్పంచాలన్న ప్రణాళికతో ఉన్నట్టు వివరించింది. నిరీ్ణత శాతం మేర దేశ పౌరులు విదేశాల్లో నివసిస్తున్నారని.. వారు భారత ఈక్విటీ మార్కెట్లలో సులభంగా ఇన్వెస్ట్ చేసుకునే మార్గం లేదని ఇన్వెస్ట్19 వ్యవస్థాపకుడు, సీఈవో కౌసలేంద్రసింగ్ సెంగార్ తెలిపారు. యూఎస్, బ్రిటన్, ఆ్రస్టేలియాలో ఒక శాతానికిపైనే భారత సంతతి ప్రజలున్నట్టు.. కెనడాలో అయితే 4 శాతానికి పైనే ఉన్నట్టు పేర్కొన్నారు. -
రెండో రోజూ నష్టాల్లో మార్కెట్లు
ముంబై: ఆయిల్ ధరలు, ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలతో స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో మొదలయ్యాయి. అటు ఎఫ్ఐఐల అమ్మకాలు, ఇటు డెరివేటివ్ ముగింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టంతో 27,736 వద్ద, నిఫ్టీ కూడా41 పాయింట్లు క్షీణించి 8,573 వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ బలహీనత,టాటా గ్రూప్ షేర్లలో అమ్మకాలు ఈ రోజుకూడా కొనసాగుతున్నాయి. దీంతోపాటు ఐటీ, ఆటో, మెటల్స్ రంగాలు బలహీనంగా ఉన్నాయి. టాటా మోటార్స్, టాటా పవర్, టాటా స్టీల్, టాటా హోటల్స్ , టాటా కమ్యూనికేషన్స్, షేర్లలో భారీఅమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఏషియన్ పెయింట్స్, యాక్సిస్, లుపిన్ నష్టపోతుండగా, ఐటీసీ, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, మారుతీ, టెక్ మహీంద్రా స్వల్పంగా లాభపడుతున్నాయి. అటు దేశీయమారకపు రేటుతో రూపాయి 0.04పైసల నష్టంతో రూ.66.87వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పసిడి పది గ్రా. రూ. 32నష్టంతో రూ. 29,866 వద్ద ఉంది.