ఎంత నిర్దయ ..! | The complaint for the arrest of the woman with the charity organization | Sakshi
Sakshi News home page

ఎంత నిర్దయ ..!

Published Wed, Mar 23 2016 3:13 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

ఎంత నిర్దయ ..!

ఎంత నిర్దయ ..!

వర్షం కురుస్తుండగా కుక్క పిల్లలను రోడ్డుపై పడేసిన మహిళ
కూనలు మృతి
ఓ స్వచ్ఛంద సంస్థ  ఫిర్యాదుతో మహిళ అరెస్ట్
     

బెంగళూరు (బనశంకరి) : కుక్క పిల్లల మరణానికి కారణమైన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... తుమకూరు రోడ్డు కృష్ణరాజనగరలో మాజీ సైనికుడి కుటుంబ నివసిస్తోంది. ఆ ఇంటి సమీపంలో ఓ కుక్క ఏడు కూనలకు జన్మనిచ్చింది. ఈ కుక్క పిల్లలను చూసిన ఆ సైనికుడి భార్య పూనమ్మ ఈనెల 15న భారీ వర్షం వస్తున్న సమయంలో కూనలను తీసుకుని రోడ్డుపై పడేసింది.

సుమారు గంట పాటు వర్షంలో తడిచి ముద్దైన ఆ 15 రోజుల వయసు ఉన్న కూనలు చలికి తట్టుకోలేక చనిపోయాయి. దీనిని గమనించిన స్థానికులు మృతి చెందిన కూనలకు అంతిమ సంస్కారం నిర్వహించారు. ఈ విషయంపై ఓ సేవా సంస్థ పూనమ్మపై పీణ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూనమ్మను అరెస్ట్ చేసి జామీనుపై విడుదల చేశారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement