
మల్కన్‌గిరి: యజమాని ఇంట్లోకి ప్రవేశించిన విష సర్పాన్ని తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా హతమార్చింది ఓ పెంపుడు శునకం. జిల్లా కేంద్రంలోని శిశుమందిర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంద. శివప్రసాద్ మాఝి అనే వ్యక్తి ఇంట్లోకి శనివారం రాత్రి పాము ప్రవేశించింది. గమనించిన అదే ఇంట్లోని పెంపుడు శునకం.. ఒక్కసారిగా సర్పంపై దాడి చేసింది.
యజమాని కుటుంబాన్ని కాపడాలనే ప్రయత్నంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పామును కొరికి, చంపింది. ఇంతలో శివప్రసాద్ స్థానిక స్నేక్ హెల్ప్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు వచ్చేన కొద్ది సేపటికే సర్పం కొన ఊపిరితో చనిపోయింది. మృతిచెందిన పామును హైల్ప్‌లైన్ సిబ్బంది తమ వెంట తీసుకు వెళ్లారు. మరోవైపు శునకం సాహసాన్ని స్థానికులు ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment