Mancherial Crime News: Man Deceased After Chinese Manja Slit His Throat - Sakshi

ప్రాణం తీసిన చైనా మాంజా.. మంచిర్యాలలో విషాదం

Jan 16 2022 8:37 AM | Updated on Jan 16 2022 9:31 AM

Man Deceased After Chinese Manja Slit His Throat Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల: సంక్రాంతిపూట గాలిపటాల పండుగ ఓ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. చైనా మాంజా ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది. మంచిర్యాల జిల్లాలోని పాత మంచిర్యాల జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న దంపతులకు గాలిపటం (చైనా మాంజ) దారం అడ్డు తగిలింది. ఆ దారం మెడకు చుట్టుకోవడంతో భీమయ్య అనే వ్యక్తి గొంతు కోసుకుపోయింది. దీంతో భీమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

అతని భార్యకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి స్వస్థలం జగిత్యాల జిల్లా గొల్లపల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో యువతి.. 
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో శనివారం గాలిపటంలోని చైనా మాంజా 20 ఏళ్ల యువతి గొంతు కోయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఉజ్జయినిలోని మాధవ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జీరో పాయింట్ బ్రిడ్జి వద్ద ఓ మహిళ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాలిపటం దారం గొంతును కోసేయడంతో తీవ్ర రక్తస్రామై యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement