
సాక్షి, కురుపాం( విజయనగరం): ఆ ఇంట మృత్యుఘోష వినిపిస్తోంది. తల్లి మరణించిన పది రోజులకే కుమారుడు తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కురుపాం మండల కేంద్రం శివ్వన్నపేటకు చెందిన సారిక సత్యవతి (60) అనారోగ్యంతో గత నెల 26న మృతి చెందింది. ఆమె పెద్దకర్మ శుక్రవారం జరగాలి.
ఈ ఏర్పాట్లలో ఉంటుండగానే స్నేహితులతో కలిసి గురువారం భీమిలి బీచ్‌కు వెళ్లిన చిన్నకుమారుడు సారిక దేవీప్రసాద్ (32) గల్లంతయ్యాడు. మృతదేహంగా ఒడ్డుకు చేరాడు. ఒకే ఇంటిలో రోజుల వ్యవధిలో తల్లీకొడుకుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మెకానిక్‌గా పనిచేస్తున్న దేవీప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment