P Gannavaram Former MLA Pulaparthi Narayana Murthy Passes Away - Sakshi
Sakshi News home page

Pulaparthi Narayana Murthy: మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి మృతి

Published Fri, Jul 8 2022 8:11 AM | Last Updated on Fri, Jul 8 2022 3:05 PM

P Gannavaram Former MLA Pulaparthi Narayana Murthy Passes Away - Sakshi

సాక్షి, కోనసీమ జిల్లా : పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి (68) గురువారం తెల్లవారుజామున  అమలాపురం ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టెలిఫోన్‌ డిపార్ట్‌మెంట్‌లో లైన్‌మన్‌గా పనిచేసిన నారాయణమూర్తి 1996లో జరిగిన నగరం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొంది 1999 వరకూ ఎమ్మెల్యేగా పనిచేశారు.

2004లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓటమి చెందారు. 2014లో పి.గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలుపొంది 2019 వరకు సేవలు అందించారు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు రవికుమార్, నలుగురు కుమార్తెలున్నారు. పులపర్తి పార్థివదేహానికి పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నివాళులు అర్పించారు.  ముంగండ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో నారాయణమూర్తి అంత్యక్రియలు నిర్వహించారు.  

చదవండి: (Chintamaneni Prabhakar: 60కి పైగా కేసులు.. రూటు మార్చిన చింతమనేని)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement