
సాక్షి, అమరావతి (మహారాష్ట్ర): ఇనుప నిచ్చెన విద్యుత్ తీగలకు తగలడంతో ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన నలుగురు ఉద్యోగులు విద్యుదాఘాతంతో మరణించారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ, రాష్ట్ర మాజీ మంత్రి ప్రవీణ్ పోటే ఆధ్వర్యంలో నడుస్తున్న పోటే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రవేశద్వారం వద్ద బాధితులు పెయింట్ వేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
పెయింటింగ్ పనికోసం వారు ఉప యోగిస్తున్న ఇనుప నిచ్చెన ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ తీగకు తాకడంతో నలుగురికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ప్రైవేట్ కళాశాల ఉద్యోగులు, అక్షయ్ సాహెబ్రావ్ సావర్కర్ (25), గోకుల్ శాలిక్రమ్‌జీ వాగ్ (28), ప్రశాంత్ సెల్లుకర్ (30), సంజయ్ దండనాయక్ (45)గా గుర్తించారు.
చదవండి: (Hyderabad: విద్యార్థినిపై లైంగిక దాడికి ప్రిన్సిపాల్ యత్నం)
Comments
Please login to add a commentAdd a comment