బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు ఐఐఎం సమీపాన బేగూర్‌లోని దేవరచిక్కనహల్లిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో సిలిండర్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనం కాగా మరికొంత మందికి గాయాలయ్యాయి. కాగా మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అశ్రిత ఆస్పైర్ అపార్ట్‌మెంట్‌లో పైప్‌లైన్‌లో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయి.
ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో అపార్‌మెంట్‌ను పొగ కమ్మేసింది. అగ్నిమాపక శాఖ నియంత్రణ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4.41 గంటలకు అగ్నిప్రమాదం గురించి సమాచారం రావడంతో అగ్నిమాపకశాఖ సిబ్బందితో పాటు మూడు ఫైర్‌టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు.
Fire at apartment called Ashrith Aspire near IIM #Bangalore #Karnataka. Fire engines rushed to spot. Locals says people are trapped. pic.twitter.com/O2PpnAEQzu
— Imran Khan (@KeypadGuerilla) September 21, 2021
Bengaluru | Fire broke out at an apartment in Devarachikkana Halli, Begur due to gas leakage in pipeline around 3:30 pm, this afternoon. Three fire tenders at the spot: Fire department#Karnataka pic.twitter.com/InXOtx9t6W
— ANI (@ANI) September 21, 2021
చదవండి: దారుణం: ‘మా అమ్మాయినే వేధిస్తావా?’ మెడకు బెల్ట్ బిగించి..
Comments
Please login to add a commentAdd a comment