Gas Pipeline Accident
-
ఘోరం: బెంగళూరులో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు ఐఐఎం సమీపాన బేగూర్‌లోని దేవరచిక్కనహల్లిలోని ఒక అపార్ట్మెంట్లో సిలిండర్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనం కాగా మరికొంత మందికి గాయాలయ్యాయి. కాగా మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అశ్రిత ఆస్పైర్ అపార్ట్మెంట్లో పైప్‌లైన్‌లో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో అపార్‌మెంట్‌ను పొగ కమ్మేసింది. అగ్నిమాపక శాఖ నియంత్రణ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4.41 గంటలకు అగ్నిప్రమాదం గురించి సమాచారం రావడంతో అగ్నిమాపకశాఖ సిబ్బందితో పాటు మూడు ఫైర్‌టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. Fire at apartment called Ashrith Aspire near IIM #Bangalore #Karnataka. Fire engines rushed to spot. Locals says people are trapped. pic.twitter.com/O2PpnAEQzu — Imran Khan (@KeypadGuerilla) September 21, 2021 Bengaluru | Fire broke out at an apartment in Devarachikkana Halli, Begur due to gas leakage in pipeline around 3:30 pm, this afternoon. Three fire tenders at the spot: Fire department#Karnataka pic.twitter.com/InXOtx9t6W — ANI (@ANI) September 21, 2021 చదవండి: దారుణం: ‘మా అమ్మాయినే వేధిస్తావా?’ మెడకు బెల్ట్ బిగించి.. -
ఇద్దరు జిల్లా యువకులను మింగేసిన గ్యాస్‌పైప్ లైన్ దుర్ఘటన
పెంటపాడు/గణపవరం : నిరుపేద కుటుంబాలు వారివి. .నేలతల్లిని మన్ముకుని జీవించే వారి తల్లిదండ్రులకు చేతికంది వచ్చారు. తమ బిడ్డలు ప్రయోజకులవటంతో కష్టాలు, కన్నీళ్లు ఉండవని సంబరపడుతున్న తరుణంలో వారి జీవితాలతో విధి ఆడుకుంది. తూర్పుగోదావరి జిల్లా నగరంలో సమీపంలో జరిగిన గ్యాస్‌పైప్ లైన్ దుర్ఘటన ఇద్దరి యువకుల్ని పొట్టనబెట్టుకుని. వారి తల్లిదండ్రులకు కడుపుకోతతోపాటు, వృద్ధాప్యంలో ఉన్న తమను చక్కగా చూసుకుంటారని భావించిన వారి ఆశలకు నిప్పు పెట్టింది. సరిగ్గా వారం క్రితం ఇదే రోజు చెల్లెలి నిశ్చితార్థం కావటంతో ఆ వేడుకలో సందడి చేశాడు గోపిరెడ్డి దివ్వతేజ(24). పనులన్నీ తన భుజాన వేసుకుని చక్కబెట్టాడు. వచ్చిన బంధువులందరినీ పేరుపేరునా పలకరించాడు. పెంటపాడు మండలం పరిమళ్ల గ్రామానికి చెందిన కౌలురైతు సత్యనారాయణ కుమారుడు దివ్యతేజ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన గెయిల్ గ్యాస్ పైపులైన్ ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. జయసుందర్ ఇంజనీరింగ్ వర్క్స్‌లో మెకానికల్ వింగ్‌లో సూపర్వైజర్గా ఏడేళ్లుగా నగరంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. తమ ఒక్కగానొక్క కుమారుడిని మృత్యువు గ్యాస్ పైప్‌లైన్ రూపంలో మింగేసిందని తెలిసి అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. శుభకార్యం జరగాల్సిన ఇంట ఇంతటి విషాదం చోటుచేసుకోవడంతో వారిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. తేజ తల్లి లక్ష్మి, చెల్లెలు మౌనిక షాక్‌నుంచి తేరుకోలేదు. కష్టపడి పొలం పనులు చేసుకుంటూ కుమారుడిని చదివించిన సత్యనారాయణ చెట్టంత కొడుకును పోగొట్టుకుని విలపిస్తున్నారు. గణపవరం గ్రామానికి చెందిన మద్దాల శాంతబాలాజీ (25) ఇదే ప్రమాదంలో మృతిచెందాడు. బాలాజీ రెండేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో గెయిల్ పైప్‌లైన్ మెయింటెనెన్స్ చేసే కాంట్రాక్టర్ వద్ద వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. బాలాజీ తండ్రి ధనం వ్యవసాయ కూలీ. తల్లి సుబ్బలక్ష్మి గృహిణి. వీరికి ఇద్దరు కుమారులుకాగా బాలాజీ న్న అన్న కూడా వ్యవసాయ కూలీ. రామలక్ష్మణుల్లా ఉండే తమ ఇద్దరు పిల్లల్లో చిన్నవాడు లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కొడుకుపై వారికి ఉన్న మమకారం తెలిసిన బందువులు ప్రమాదంలో బాలాజీ మృతి చెందిన వార్తను చాలా సమయం వరకు అతని తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. టీవీలో వార్తలు చూసి కలవరపాటుకు గురైన బాలాజీ తల్లిదండ్రులు తమ బిడ్డ క్షేమంగానే ఉన్నాడని భావించారు. అతనికి ఏమీ కాకూడదని దేవుడ్ని వేడుకున్నారు. కానీ వారికి కడుపుకోత మిగిలింది. -
ఉలిక్కిపడిన పశ్చిమ
తూర్పుగోదావరిలో గ్యాస్ పైప్‌లైన్ ప్రమాదంతో జిల్లాలో భయాందోళనలు నరసాపురం(రాయపేట) : తూర్పుగోదావరి జిల్లా మామి డికుదురు మండలం నగరంలో గ్యాస్ పైప్‌లైన్ ప్రమాద ఘటనతో జిల్లాప్రజలు ఉలిక్కిపడ్డారు. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) పైప్లైన్లు నరసాపురం మండలం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్లు కావడం, తుప్పుపట్టి పోవడంతో ఏ క్షణమైనా ప్రమా దం చోటుచేసుకునే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 250 కిలోమీటర్ల మేర పైప్లైన్లు గ్యాస్ నిక్షేపాల తరలింపులో భాగంగా ఓఎన్జీసీ ఆధ్వర్యంలోని గెయిల్ తీర ప్రాంతం నుంచి 250 కిలోమీటర్ల పైప్లైన్లు వేసింది. నరసాపురం మండలం కొత్తనవరసపురం, పాతనవరసపురం, యలమంచిలి మండలం ఏనుగువానిలంక, బాడవ, చించినాడ గ్రామాలలోని పొలాలు మధ్యన, నివాస గృహాలకు సమీపం నుంచి గ్యాస్ పైప్‌లైన్ ఉంది. అనంతరం నరసాపురం మండలంలోని పలు గ్రామాల మధ్యగా పైప్‌లైన్‌ను విస్తరించారు. నరసాపురం, పెనుగొండ పరిసర ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాలు విస్తారంగా లభించడంతో ఓఎన్జీసీతవ్వకాలను మరింత విస్తృతం చేసింది. దీనిలోభాగంగా నరసాపురం పట్టణంలో ఓఎన్జీసీ టెంపుల్లాండ్ను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గతంలో ఎన్నోసార్లు గ్యాస్ లీకేజీ ఘటనలు జిల్లాలోని గ్యాస్ పైప్లైన్లు కూడా తరచూ లీకేజీ అవుతున్నాయి. అనేకసార్లు గ్యాస్ లీక్ అయినట్లుగా రైతులు గుర్తించి సమీపంలోని ఓఎన్జీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే లీకేజీని అరికట్టేవారు. భూమిలో నుంచి గ్యాస్ ఎగదన్నడంతో ఆ ప్రాంతంలో శబ్దంతో కూడినబుడగలు వచ్చేవని, వాటిని చూసి ఓఎన్జీసీ అధికారులకు చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయని కొత్తనవరసపురం మాజీ సర్పంచి ఈద ఇశ్రాయేలు తెలిపారు. తుప్పుపట్టిన పైప్లైన్లు 25 ఏళ్ల కిందట వేసిన పైప్లైన్లు కావడంతో తుప్పుపట్టాయని ఓఎన్జీసీ అధికారులే అనేక సందర్భాల్లో చెప్పారని స్థానికులు వివరించారు. పైప్‌లైన్ లీకేజీ అయినవెంటనే తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారని, శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని వాపోతున్నారు. లీకేజీలను అరికట్టడానికి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని, లేకపోతే నగరం లాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశముందని పలువ ఆందోళన వ్యక్తం చేశారు. 125 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ మారుస్తాం కేజీ బేసిన్‌కు సంబంధించి గ్యాస్ పైప్‌లైన్ మొత్తం 650 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని, దానిలో 125 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను త్వరలో మారుస్తామని ఓఎన్జీసీ ఈడీ, అసిస్టెంట్ మేనేజర్(రాజమండ్రి) పి.కృష్ణారావు తెలిపారు. నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 12న ఓఎన్జీసీ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేజీ బేసిన్లో రోజుకు 800 టన్నుల ఆయిల్, 31 లక్షల క్యూబిక్ మీటర్లు గ్యాస్ ఉత్పత్తి అవుతోందని వివరించారు.